ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 అక్టోబరు 1 వ తేదీ నాడు తెలంగాణ ను సందర్శించనున్నారు. మధ్యాహ్నం పూట దాదాపు గా 2 గంటల 15 నిమిషాల కు, ప్రధాన మంత్రి మహబూబ్ నగర్ జిల్లా కు చేరుకొంటారు. అక్కడ ఆయన రహదారులు, రైలు మార్గాలు, పెట్రోలియమ్, సహజ వాయువు మరియు ఉన్నత విద్య ల వంటి ముఖ్య రంగాల లో 13,500 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయడం తో పాటుగా వాటిని దేశ ప్రజల కు అంకితం కూడా చేస్తారు. కార్యక్రమం లో ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ఒక రైలు సర్వీసు కు కూడా ప్రారంభ సూచక ఆకుపచ్చటి జెండా ను చూపి ఆ రైలు ప్రయాణాన్ని మొదలుపెట్టడాన్ని తిలకిస్తారు.
దేశం అంతటా, ఆధునికమైన రహదారుల సంబంధి మౌలిక సదుపాయాల ను అభివృద్ధి పరచాలన్న ప్రధాన మంత్రి దార్శనికత కు ఉత్తేజాన్ని అందించే చర్యలో భాగం గా, అనేక రోడ్డు ప్రాజెక్టుల కు ఈ కార్యక్రమం లో శంకుస్థాపన చేయడంతో పాటు వాటి ని దేశ ప్రజల కు అంకితం ఇవ్వడం జరుగుతుంది. నాగ్ పుర్ - విజయవాడ ఇకానామిక్ కారిడార్ లో భాగం గా ఉన్న ముఖ్యమైన రోడ్డు ప్రాజెక్టుల కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల లో 108 కిలో మీటర్ ల పొడవైనటువంటి వరంగల్ నుండి జాతీయ రాజమార్గం (ఎన్ హెచ్)-163జి లో ఖమ్మం సెక్శన్ వరకు నాలుగు దోవల ఏక్సెస్ తో కూడిన కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ హైవే తో పాటు 90 కి.మీ. పొడవైన నాలుగు దోవల ఏక్సెస్ తో కూడిన ఖమ్మం నుండి విజయవాడ సెక్శన్ లోని కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ హై వే కూడా ఉంది. ఈ రోడ్డు ప్రాజెక్టుల ను సుమారు 6,400 కోట్ల రూపాయల మొత్తం వ్యయం తో అభివృద్ధి పరచడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టుల తో వరంగల్ మరియు ఖమ్మం ల మధ్య ప్రయాణ దూరం సుమారు 14 కి.మీ. లు, అలాగే ఖమ్మం నుండి విజయవాడ ల మధ్య ప్రయాణ దూరం రమారమి 27 కి.మీ. లు తగ్గిపోతుంది.
‘ఎన్ హెచ్-365బిబి కి చెందిన 59 కిమీ పొడవైన సూర్యాపేట నుండి ఖమ్మం సెక్శన్ తాలూకు నాలుగు దోవల తో కూడినటువంటి ఒక రోడ్డు ప్రాజెక్టు ను కూడా దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేయనున్నారు. దాదాపు గా 2,460 కోట్ల రూపాయల ఖర్చు తో నిర్మాణం పూర్తి అయినటువంటి ఈ ప్రాజెక్టు హైదరాబాద్ - విశాఖపట్నం కారిడార్ లో ఒక భాగం గా ఉంది. దీనిని భారత్ మాల పరియోజన లో భాగం గా అభివృద్ధి పరచడమైంది. ఇది ఖమ్మం జిల్లా కు మరియు ఆంధ్ర ప్రదేశ్ లో కోస్తా తీరప్రాంతాల కు మెరుగైన కనెక్టివిటీ ని అందించనుంది.
ఈ కార్యక్రమం లో, ప్రధాన మంత్రి ‘37 కిమీ ల జక్లేరు-కృష్ణా న్యూ రైల్ వే లైన్’ ను కూడా దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. 500 కోట్ల రూపాయల కు పైచిలుకు వ్యయం తో నిర్మాణం జరిగినటువంటి ఈ క్రొత్త రైలు మార్గం వెనుకబడిన జిల్లా నారాయణపేట లోని ప్రాంతాల ను మొట్టమొదటి సారిగా రైలు మార్గాల చిత్రపటం లోకి తీసుకు రానుంది. ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా కృష్ణ స్టేశన్ నుండి హైదరాబాద్ (కాచిగూడ) - రాయ్ చూర్ - హైదరాబాద్ (కాచిగూడ) రైలు యొక్క తొలి సర్వీసు కు ప్రారంభ సూచక ఆకుపచ్చటి జెండా ను చూపి ఆ రైలు ను బయలుదేరేటట్టు చూడనున్నారు. ఈ రైలు సర్వీసు తెలంగాణ లో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణ పేట జిల్లాల ను కర్నాటక లోని రాయ్ చూర్ జిల్లా తో కలుపుతుంది. ఈ రైలు సర్వీసు వెనుకబడిన జిల్లాలైనటువంటి మహబూబ్ నగర్ మరియు నారాయణపేట లలోని అనేక ప్రాంతాల కు మొట్టమొదటి సారిగా రైల్ కనెక్టివిటీ ని అందించనుంది. ఈ రైలుమార్గ సంధానం ద్వారా ఆ ప్రాంతం లో విద్యార్థుల కు, నిత్యం ప్రయాణించే వ్యక్తుల కు, శ్రమికుల కు మరియు అక్కడి చేనేత పరిశ్రమ కు ప్రయోజనం కలుగుతుంది.
- లో లాజిస్టిక్స్ సంబంధి సామర్థ్యాన్ని మెరుగు పరచాలన్న ప్రధాన మంత్రి యొక్క దార్శనికత కు అనుగుణం గానే ముఖ్యమైన చమురు మరియు గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టుల కు శంకుస్థాపన తో పాటు ఆ ప్రాజెక్టుల కు దేశ ప్రజల కు అంకితమివ్వడం కూడా ఇదే కార్యక్రమం లో భాగం గా జరగనుంది. ‘హసన్ - చర్లపల్లి ఎల్ పిజి పైప్ లైన్ ప్రాజెక్టు’ను దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అకింతం చేయనున్నారు. సుమారు 2,170 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మాణం జరిగినటువంటి ఈ ప్రాజెక్టు కర్నాటక లోని హాసన్ నుండి హైదరాబాద్ శివార్ల లో గల చర్లపల్లి వరకు ఎల్ పిజి ని సురక్షితమైనటువంటి, తక్కువ ఖర్చు తో కూడినటువంటి మరియు పర్యావరణ మిత్రపూర్వకమైనటువంటి పద్ధతి లో రవాణా, ఇంకా పంపిణీ చేయనుంది. కృష్ణ పట్నం నుండి హైదరాబాద్ లోని మల్కాపూర్ వరకు భారత్ పెట్రోలియమ్ కార్పొరేశన్ లిమిటెడ్ (బిపిసిఎల్) కు చెందిన బహుళ ఉత్పాదక పెట్రోలియమ్ పైప్ లైన్ నిర్మాణాని కి కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. 425 కిమీ మేర పొడవుతో ఉండేటటువంటి ఈ పైప్ లైను ను 1940 కోట్ల రూపాయల ఖర్చు తో నిర్మించడం జరుగుతుంది. ఈ పైప్ లైన్ ఆ ప్రాంతం లో పెట్రోలియమ్ ఉత్పాదనల ను సురక్షితం గా, వేగవంతం గా, తక్కువ ఖర్చు తో, సమర్థం గా మరియు పర్యావరణ మిత్రపూర్వకమైనటువంటి పద్ధతి లో అందజేయనుంది.
హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన అయిదు క్రొత్త భవనాల’ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. వాటి లో స్కూల్ ఆఫ్ ఇకానామిక్స్; స్కూల్ ఆఫ్ మేథమేటిక్స్ ఎండ్ స్టాటిస్టిక్స్; స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ స్టడీస్; లెక్చర్ హాల్ కాంప్లెక్స్ – III , ఇంకా సరోజిని నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ & కమ్యూనికేశన్ (ఏనెక్స్) లు ఉన్నాయి. హైదరాబాద్ యూనివర్సిటీ యొక్క మౌలిక సదుపాయాల ఉన్నతీకరణ అనేది విద్యార్థుల కు మరియు ఫేకల్టీ కి మెరుగైన సదుపాయాల ను అందించే దిశ లో ఒక అడుగు కానుంది.