ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 25న తమిళ నాడు ను, పుదుచ్చేరి ని సందర్శించనున్నారు. ఆ రోజు న ఉదయం 11:30 గంటల కు పుదుచ్చేరి లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. మరికొన్ని పథకాల కు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. 12,400 కోట్ల రూపాయల కు పైగా విలువ గల అనేక మౌలిక సదుపాయాల రంగ సంబంధిత ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి అదే రోజు న సాయంత్రం 4 గంటల కు కోయంబత్తూరు లో దేశానికి అంకితం చేయడమే గాక మరికొన్ని పథకాల కు శంకుస్థాపన చేస్తారు.
తమిళ నాడు లో ప్రధాన మంత్రి
ప్రధాన మంత్రి నైవేలీ లో ఒక నూతన తాప ఆధారిత విద్యుత్తు పథకాన్ని దేశానికి అంకితం చేస్తారు. ఆ ప్రాజెక్టు ను 1000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పాదక సామర్ధ్యం కలిగినటువంటి లిగ్నైట్ ఆధారితంగా పనిచేసే పవర్ ప్లాంటు గా రూపొందించడం జరిగింది. ఈ ప్లాంటు లో ఒక్కొక్కటి 500 ఎండబ్ల్యు సామర్ధ్యం కలిగిన రెండు యూనిట్ లను ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 8000 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మాణం పూర్తి చేసుకొన్న ఈ పిట్ హెడ్ పవర్ ప్లాంటు నైవేలీ లో ఇప్పుడు ఉన్న గనుల నుంచి దొరికే లిగ్నైటు ను ఇంధనం గా ఉపయోగించుకోనుంది. ఈ గనుల లో ప్రాజెక్టు జీవిత కాలానికి సరిపడ చాలినన్ని లిగ్నైట్ నిక్షేపాలు ఉన్నాయి. ఈ ప్లాంటు ను 100 శాతం బూడిద వినియోగాన్ని దృష్టి లో పెట్టుకొని తీర్చిదిద్దడమైంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తు తమిళ నాడు, కేరళ, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ లకు లబ్ధి ని చేకూర్చగలదు. తమిళ నాడు కు ఈ విద్యుత్తు లో దాదాపు 65 శాతం వాటా దక్కనుంది.
ప్రధాన మంత్రి ఎన్ఎల్‌సిఐఎల్ కు చెందిన 709 ఎండబ్ల్యు సౌర విద్యుత్తు పథకాన్ని కూడా దేశానికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టు తిరునెల్ వేలి, ట్యుటికోరిన్, రామనాథపురం, విరుధునగర్ జిల్లాల లో విస్తరించిన సుమారు 2670 ఎకరాల విస్తీర్ణం లో ఏర్పాటైంది. ఈ ప్రాజెక్టు ను 3000 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో స్థాపించడం జరిగింది.
ప్రధాన మంత్రి లోయర్ భవానీ ప్రాజెక్ట్ సిస్టమ్ తాలూకు విస్తరణ, పునర్ నవీకరణ, ఆధునీకరణ పనుల కు శంకుస్థాపన చేస్తారు. భవానీ సాగర్ ఆనకట్ట, దానికి సంబంధించిన కాలవ వ్యవస్థల పనులు 1955వ సంవత్సరం లో పూర్తి అయ్యాయి. లోయర్ భవానీ ప్రాజెక్ట్ కెనాల్ సిస్టమ్, అరకన్‌కోట్టై, తాడపల్లి చానల్స్, కళింగరాయన్ ఛానల్ లు లోయర్ భవానీ సిస్టమ్ లో భాగం గా ఉన్నాయి.
ఇది ఈరోడ్, తిరుపూర్, కరూర్ జిల్లాల లో 2 లక్షల ఎకరాలకు పైగా భూమి కి సాగునీటి ని అందజేస్తున్నది. లోయర్ భవానీ సిస్టమ్ విస్తరణ, పునర్ నవీకరణ, ఆధునీకరణ పనుల ను నాబార్డ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంబంధిత సహాయం పథకం లో భాగం గా 934 కోట్ల రూపాయల ఖర్చు తో చేపట్టడమైంది. ఈ సిస్టమ్ లో ఇప్పటికే కొనసాగుతున్న నీటిపారుదల సంబంధిత నిర్మాణాల కు తగిన మరమ్మత్తులు చేసి, తద్వారా కాలవ ల నీటిపారుదల సామర్ధ్యాన్ని పెంచాలన్నది ఈ పథకం ప్రధానోద్దేశ్యం గా ఉంది. కాలవ ల గట్ల పనులకు తోడు 824 తూములు, 176 మురుగునీటి కాలవలు, 32 వంతెన ల తాలూకు మరమ్మత్తుల ను, పునర్ నిర్మాణ పనుల ను కూడా చేపడుతారు.
ప్రధాన మంత్రి వి.ఒ. చిదంబరనార్ పోర్టు లో కోరమ్ పల్లమ్ బ్రిడ్జ్ తాలూకు 8- దోవల ను, రైల్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్ఒబి) ని ప్రారంభిస్తారు. ఇది భారతదేశం లోని ప్రధానమైన నౌకాశ్రయాల లో ఒక నౌకాశ్రయం గా ఉంది. ప్రస్తుతం ఓడ సరుకు లో 76 శాతం సరుకుల ను రహదారి మార్గం ద్వారా/ గుండా నౌకాశ్రయానికి
ఈసరికే ఉన్నటువంటి కోరమ్ పల్లమ్ వంతెన ను ఉపయోగించుకొని చేరవేస్తున్నారు. కోరమ్ పల్లమ్ వంతెన ను 1964 లో 14 మీటర్ల వెడల్పాటి క్యారేజివే తో పాటు నిర్మించారు. ప్రతి రోజూ సగటు న దాదాపు 3,000 వరకు భారీ గా సామాను తో నిండిన ట్రక్కు లు ఈ బ్రిడ్జ్ పై నుంచి రాకపోక లు జరుపుతూ ఉంటాయి. దీనితో రహదారి మీద రద్దీ బాగా ఎక్కువ గా ఉంటూ, తత్పర్యవసానం గా జాప్యాలకు కారణమవుతున్నది. అంతేకాదు, ట్రక్కులు తిరిగివచ్చేందుకు ఎక్కువ కాలం పడుతోంది. ఓడ సరకు ను ఎలాంటి అంతరాయం లేకుండా తరలించేందుకు, నౌకాశ్రయం ప్రాంతం లో వాహనాల రద్దీ ని తప్పించేందుకు ఇప్పటి కోరమ్ పల్లమ్ బ్రిడ్జ్ ని 8-దోవల తో కూడినది గా మలచే పథకాన్ని, రైల్ ఓవర్ బ్రిడ్జ్ ని ప్రవేశపెట్టడమైంది. దీనికి గాను బ్రిడ్జి కి అటూ ఇటూ విస్తరణ పనులు చేపట్టడం తో పాటు, బ్రిడ్జి కి ఇరు ప్రక్కల రెండు దోవల ను (8.5 మీటర్ల మేర) జతపరచడమైంది. టిటిపిఎస్ సర్కిల్ నుంచి సిటీ లింక్ సర్కిల్ వరకు ఇప్పటికే ఉన్న బిటి రోడ్డు ను కూడా విశాలం చేయడమైంది. దాదాపు గా 42 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మాణం జరిగిన ఈ ప్రాజెక్టు కు ‘సాగరమాల’ కార్యక్రమం లో భాగం గా నిధుల ను ఇవ్వడమైంది.
వి.ఒ చిదంబరనార్ పోర్టు లో 5 ఎండబ్ల్యు గ్రిడ్ సంధానిత క్షేత్రాధారిత సౌర విద్యుత్తు ప్లాంటు డిజైన్, సరఫరా, స్థాపన, ప్రారంభం తాలూకు పనుల కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు. సుమారు 20 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టు ఒక్కో సంవత్సరానికి 80 లక్షలకు పైగా యూనిట్ ల (కెడబ్ల్యుహెచ్) ను ఉత్పత్తి చేస్తూ, నౌకాశ్రయానికి అవసరపడే మొత్తం శక్తి వినియోగ అవసరాల లో 56 శాతం వరకు సమకూర్చుతూ, నౌకాశ్రయం కార్యకలాపాల లో కర్బన పాదముద్ర కుంచించుకు పోవడం లో తన వంతుగా సాయపడుతుంది.
జీవనాన్ని సరళతరం చేసే ప్రక్రియ లో భాగం గా, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) పథకం లో భాగం గా నిర్మించిన అద్దె ఇళ్ళను శ్రీ మోదీ ప్రారంభించనున్నారు. తమిళ నాడు స్లమ్ క్లియరెన్స్ బోర్డు నిర్మించిన ఈ గృహాల లో తిరుప్పూర్ లోని వీరపాండి ప్రాంతం లో 1280 ఇళ్లు; తిరుకుమరన్ నగర్ లో 1248 ఇళ్లు; మదురై లోని రాజక్కూర్ ఫేజ్-II లో 1088ఇళ్లు; త్రిచీ లోని ఇరుంగలూర్ లో 528 ఇళ్ళు కూడా ఉన్నాయి. ఈ అద్దె ఇళ్ల ను 330 కోట్ల రూపాయల కు పైగా వ్యయంతో నిర్మించడం జరిగింది. పట్టణ ప్రాంత పేదల కు, మురికివాడ నివాసుల కు కేటాయించబోయే ఈ అద్దె ఇళ్ళ లో ఒక్కొక్క ఇల్లు 400 చదరపు అడుగుల ప్లింథ్ ఏరియా తో, ఒక హాలు, పడక గది, వంటిల్లు, స్నానపు గది, టాయిలెట్ వంటి సౌకర్యాల తో తయారయ్యాయి. వీటికి తారు రోడ్డు ను, వీధి దీపాలను, మురుగునీటి శుద్ధి ప్లాంటు ను, రేషన్ దుకాణాన్ని, ఆంగన్ వాడీ కేంద్రాన్ని, గ్రంథాలయాన్ని, దుకాణాలు తదితర సామాజిక సౌకర్యాన్ని కూడా సమకూర్చడం జరిగింది.
ప్రధాన మంత్రి తొమ్మిది స్మార్ట్ సిటీస్ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ ఎండ్ కంట్రోల్ సెంటర్స్ (ఐసిసిసి) ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ స్మార్ట్ సిటీస్ లో కోయంబత్తూరు, మధురై, సేలం, తంజావూరు, వెల్లూరు, తిరుచిరాపల్లి, తిరుప్పుర్, తిరునెల్ వేలీ, తూత్తుకుడి ఉన్నాయి. ఈ ఐసిసిసి లను సుమారు 107 కోట్ల రూపాయల వ్యయం తో ఏర్పాటు చేస్తారు. ఇవి సత్వర సేవల కు సంబంధించిన రియల్ టైమ్ స్మార్ట్ సొల్యూషన్స్ ను అందిస్తాయి. ప్రభుత్వ సేవల ను, సమాచార ఆధారిత నిర్ణయ రూపకల్పన ప్రక్రియ ను జోడించాలన్నదే ఐసిసిసి ల స్థాపన లో ఉద్దేశ్యంగా ఉంది.
పాండిచ్చేరీ లో ప్రధాన మంత్రి
ప్రధాన మంత్రి ఎన్‌హెచ్45-ఎ తాలూకు నాలుగు దోవల విస్తరణ పనుల కు శంకుస్థాపన చేస్తారు. ఈ పనులు కరైకాల్ జిల్లా పరిధిలో, విల్లుపురం నుంచి నాగపట్టినమ్ ప్రాజెక్టు లో భాగంగా ఉన్న సత్తనాథపురం- నాగపట్టినమ్ ప్యాకేజీ కి చెందినవి. ఈ పనుల కు సుమారు 2426 కోట్ల రూపాయలు వ్యయం కానుంది. ఆయన కరైకాల్ జిల్లా లోని కరైకాల్ న్యూ కేంపస్ ఒకటో దశ కు చెందిన వైద్య కళాశాల (జిఐపిఎమ్ఇఆర్) భవనానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కు 491 కోట్ల రూపాయలు వ్యయం కాగలదని అంచనా.
ప్రధాన మంత్రి పాండిచ్చేరీ లో ఒక మైనర్ పోర్టు అభివృద్ధి కి సంబంధించిన శంకుస్థాపన ను చేయనున్నారు. సాగర్ మాల పథకం లో భాగం గా ఈ పనుల ను చేపడతారు. 44 కోట్ల రూపాయల నిధుల తో ఏర్పాటుచేసే ఈ మైనర్ పోర్టు చెన్నై కి సంధానాన్ని సమకూర్చడం తో పాటు, పాండిచ్చేరీ లోని పరిశ్రమల కు సరకు చేరవేసేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఆయన పాండిచ్చేరీ లోని ఇందిరా గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ కు కూడా శంకుస్థాపన చేస్తారు. అక్కడ ఇప్పటికే ఉన్న 400 మీటర్ల సిండర్ ట్రాకు ఉపరితలం బాగా పాతబడి పదును తేలింది.
ప్రధాన మంత్రి పాండిచ్చేరీ లోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ ఎండ్ రిసర్చ్ (జిఐపిఎమ్ఇఆర్) లో బ్లడ్ సెంటర్ ను ప్రారంభించనున్నారు. ఇది ఒక పరిశోధన ప్రధానమైనటువంటి ప్రయోగశాల గాను, రక్త మార్పిడికి సంబంధించిన అన్ని అంశాల లో బ్లడ్ బ్యాంక్ సిబ్బందికి శిక్షణ ఇచ్చే కేంద్రం గాను పని చేస్తుంది. దీనిని 28 కోట్ల రూపాయల వ్యయం తో నెలకొల్పారు.
ప్రధాన మంత్రి పాండిచ్చేరీ లోని లాస్‌పేట్ లో 100 పడకల తో ఏర్పాటైన బాలికల వసతి గృహాన్ని ప్రారంభిస్తారు. దీనిని స్పోర్ట్స్ అథారటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యం లో దాదాపుగా 12 కోట్ల రూపాయల వ్యయం తో మహిళా క్రీడాకారుల కోసం నిర్మించడం జరిగింది. ఆయన పునర్ నిర్మాణం జరిగిన హెరిటేజ్ మేరీ బిల్డింగ్ కూడా ప్రారంభిస్తారు. పాండిచ్చేరీ చరిత్ర లో ఒక ప్రముఖ ప్రతీకగా ఉన్న మేరీ బిల్డింగ్ ను ఫ్రెంచి వారు నిర్మించారు. దానినే ఇప్పుడు అదే విధమైన వాస్తు శిల్పకళ తో సుమారు 15 కోట్ల రూపాయల వ్యయం తో పునర్ నిర్మించడం జరిగింది.