ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మే నెల 10 వ తేదీ న రాజస్థాన్ ను సందర్శించనున్నారు. ఉదయం పూట సుమారు 11 గంటల వేళ కు ప్రధాన మంత్రి నాథ్ ద్వారా లో శ్రీనాథ్ జీ ఆలయానికి వెళ్తారు. ఇంచుమించు 11 గంటల 45 నిమిషాల వేళ కు ఆయన నాథ్ ద్వారా లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ను దేశ ప్రజల కు అంకితమివ్వడం తో పాటుగా శంకుస్థాపన చేస్తారు. ఆ తరువాత, మధ్యాహ్నం సుమారు 3 గంటల 15 నిమిషాల వేళ కు ప్రధాన మంత్రి ఆబూ రోడ్ లో గల బ్రహ్మ కుమారీ ల శాంతివన్ భవన సముదాయాని కి వెళ్తారు.
నాథ్ ద్వారా లో ప్రధాన మంత్రి
ప్రధాన మంత్రి 5500 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితమివ్వడం మరియు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ల ప్రధానోద్దేశ్యాలు ఆ ప్రాంతం లో మౌలిక సదుపాయాల ను పెంపొందించడమూ, సంధానాన్ని అధికం చేయడమూను. రహదారులు మరియు రేల్ వే రంగం లోని ప్రాజెక్టుల తో సరకుల మరియు సేవల రాక పోక లు సౌకర్యవంతం గా మారుతాయి. తద్ద్వారా వ్యాపారానికి మరియు వాణిజ్యాని కి ప్రోత్సాహం లభిస్తుంది; అంతేకాక, ఆ ప్రాంతం ప్రజల సామాజిక స్థితిగతులు, ఆర్థిక స్థితి మెరుగు పడతాయి.
రాజ్ సమంద్ లో మరియు ఉదయ్ పుర్ లో రెండు దోవ లు ఉండేటటువంటి రహదారి నిర్మాణ పథకాల కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
ప్రజల కు మరింత ఉన్నతమైనటువంటి సౌకర్యాల ను అందించడం కోసం తలపెట్టిన ఉదయ్ పుర్ రేల్ వే స్టేశన్ యొక్క పునరభివృద్ధి పనుల కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. గేజ్ మార్పిడి పథకాని కి మరియు రాజ్ సమంద్ లోని నాథ్ ద్వారా నుండి నాథ్ ద్వారా పట్టణం వరకు ఒక క్రొత్త మార్గాన్ని వేసే పనులకు కూడాను ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
దీనికి అదనం గా, ప్రధాన మంత్రి మూడు జాతీయ రాజమార్గ పథకాల ను దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు; వాటి లో ఎన్ హెచ్-48 లో భాగం అయినటువంటి ఉదయ్ పుర్ నుండి శ్యామలాజీ వరకు 114 కి.మీ. పొడవైనటువంటి ఆరు దోవ ల ప్రాజెక్టు, ఎన్ హెచ్-25 లోని బార్-బిలారా-జోధ్ పుర్ సెక్శన్ లో ద్విచక్ర వాహనాల కోసం రహదారి ని వెడల్పు చేసే (పేవ్ శోల్డర్) తో కూడిన 110 కి.మీ. పొడవైన రాదారి ని నాలుగు దోవల ను కలిగి ఉండేది గా విస్తరించేమరియు పటిష్ట పరచే ప్రాజెక్టు, ఇంకా ఎన్ హెచ్-58ఇ లో పేవ్డ్ శోల్డర్ సెక్శన్ కలుపుకొని 47 కి.మీ. పొడవు ను కలిగిన రెండు లేన్ లతో కూడివుండే రహదారి నిర్మాణం ప్రాజెక్టు లు భాగం గా ఉన్నాయి.
బ్రహ్మ కుమారీ ల శాంతివన్ కాంప్లెక్స్ లో ప్రధాన మంత్రి
దేశవ్యాప్తం గా ఆధ్యాత్మిక పునర్ జాగరణ కు వేగాన్ని ఇవ్వాలనే అంశం పై ప్రధాన మంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నారు. ఇదే ప్రయాస ను ప్రధాన మంత్రి ముందుకు తీసుకు పోతూ, బ్రహ్మకుమారీ ల కు చెందిన శాంతివన్ భవన సముదాయాన్ని సందర్శించనున్నారు. ఆయన ఒక సూపర్ స్పెశలిటీ చారిటబల్ గ్లోబల్ హాస్పిటల్ కు, శివమణి వృద్ధాశ్రమం రెండో దశ కు మరియు నర్సింగ్ కాలేజీ విస్తరణ కు శంకుస్థాపన చేయనున్నారు. సూపర్ స్పెశలిటీ చారిటబల్ గ్లోబల్ హాస్పిటల్ ను ఆబూ రోడ్ లో ఏభై ఎకరాల క్షేత్రం లో ఏర్పాటు చేయడం జరుగుతుంది; అది ప్రపంచ స్థాయి చికిత్స సదుపాయాల ను అందుబాటు లోకి తీసుకు రావడం తో పాటుగా ఆ ప్రాంతం లోని పేదల కు మరియు ఆదివాసీల కు ప్రత్యేకించి ప్రయోజనకరం గా ఉండగలదు.