దిల్లీ-అమృత్ సర్-కాట్ రా ఎక్స్ ప్రెస్ వే కు శంకుస్థాపనచేయడం జరుగుతుంది; అమృత్సర్ నుంచి దిల్లీ కి, దిల్లీనుంచి కాట్ రా కు ప్రయాణించడానికి పట్టే కాలాన్ని ఇది సగానికి తగ్గిస్తుంది
ప్రధానమైన ధార్మిక కేంద్రాల కు అందుబాటు ను పెంచాలన్నప్రధాన మంత్రి దృష్టి కోణానికి అనుగుణం గా, కీలకమైనటువంటిధార్మిక స్థలాలు మెరుగైన సంధానాన్ని అందుకోనున్నాయి;వైష్ణో దేవి ని చేరుకోవడం కూడా సులభతరం కానుంది
అమృత్ సర్ - ఊనా సెక్శను ను 4దోవలు కలిగివుండేది గా ఉన్నతీకరించడం జరుగుతుంది; నాలుగు ప్రధాన జాతీయ రహదారుల నుజోడించడం జరుగుతుంది
వ్యూహాత్మకమైనటువంటి ముకేరియాఁ- తల్ వాడా కొత్త బ్రాడ్ గేజ్రైలు మార్గాని కి శంకుస్థాపన చేయడం జరుగుతుంది; ఆప్రాంతం లో అన్ని రకాల వాతావరణాలకు అనువుగా ఉండేటటువంటి సంధాన సదుపాయాన్నిసమకూర్చడం జరుగుతుంది
ఆ ప్రాంతం లో ఆరోగ్య సంబంధి మౌలిక సదుపాయాల కు పెద్దప్రోత్సాహం లభించనుంది; ఇదిదేశం లో అన్ని ప్రాంతాలకు ప్రపంచ శ్రేణి వైద్య చికిత్స సదుపాయాల ను సమకూర్చాలన్నప్రధాన మంత్రి ప్రయాసల కు అనుగుణం గా ఉంటుంది
ఫిరోజ్ పుర్ లో పిజిఐ శాటిలైట్ సెంటరు కు, కపుర్ తలా లోను, హోశియార్ పుర్ లోను రెం

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2022వ సంవత్సరం లో జనవరి 5వ తేదీ నాడు పంజాబ్ లోని ఫిరోజ్ పుర్ ను సందర్శించనున్నారు.   42,750 కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ధి పథకాల కు ఆ రోజు న మధ్యాహ్నం సుమారు ఒంటి గంట వేళ కు ప్ర‌ధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.  ఆ పథకాల లో దిల్లీ-అమృత్ సర్-కాట్ రా ఎక్స్ ప్రెస్ వే; అమృత్ సర్ - ఊనా సెక్శను ను 4 దోవలు కలిగివుండేది గా ఉన్నతీకరించడం; ముకేరియాఁ- తల్ వాడా కొత్త బ్రాడ్ గేజ్ రైలు మార్గం; ఫిరోజ్ పుర్ లో పిజిఐ శాటిలైట్ సెంటరు, కపుర్ తలా లోను, హోశియార్ పుర్ లోను రెండు వైద్య కళాశాల లు భాగం గా ఉన్నాయి.

దేశవ్యాప్తం గా సంధానాన్ని మెరుగుపరచాలన్న ప్రధాన మంత్రి నిరంతర ప్రయాస పంజాబ్ రాష్ట్రం లో అనేక జాతీయ రహదారుల అభివృద్ధి కి బాట ను పరచింది.  ఫలితం గా రాష్ట్రం లో జాతీయ రహదారుల మొత్తం పొడవు ను 2014వ సంవత్సరం లో దాదాపు 1700 కిలోమీటర్ ల స్థాయి నుంచి రెట్టింపు కంటే మించిపోయి 2021వ సంవత్సరానికల్లా 4100 కి.మీ. కు పైబడటానికి తోడ్పడింది.  ఆ కోవ కు చెందిన ప్రయత్నాల కు కొనసాగింపు గానే  పంజాబ్ లో రెండు ప్రధానమైన రోడ్ కారిడార్ లకు శంకుస్థాపన జరుగనుంది.  ఇది ప్రధానమైన ధార్మిక కేంద్రాల కు చేరిక ను వృద్ధి చెందింపచేయాలన్న ప్రధాన మంత్రి దృష్టి కోణాన్ని ఆచరణలోకి తీసుకు వచ్చే దిశ లో ఒక అడుగుగా కూడాను పరిణమించనుంది.

సుమారు 39,500 కోట్ల రూపాయల మొత్తం వ్యయం తో 669 కి.మీ. పొడవున ఉండేటటువంటి దిల్లీ-అమృత్ సర్-కాట్ రా ఎక్స్ ప్రెస్ వే ను అభివృద్ధి పరచడం జరుగుతుంది.  అది దిల్లీ నుంచి అమృత్ సర్ కు మరియు దిల్లీ నుంచి కాట్ రా కు ప్రయాణానికి పట్టేటటువంటి కాలాన్ని సగానికి తగ్గించగలుగుతుంది.  ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే సుల్ తాన్ పుర్ లోఢీ, గోయింద్ వాల్ సాహిబ్, ఖదూర్ సాహిబ్, తరణ్ తరణ్ లలోని కీలకమైనటువంటి సిక్ఖు ధార్మిక కేంద్రాలను మరియు కాట్ రా లోని పవిత్ర హిందూ క్షేత్రమైన వైష్ణో దేవి ని కలుపుతుంది.  ఈ ఎక్స్ ప్రెస్ వే మూడు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలైన పంజాబ్, జమ్ము - కశ్మీర్ లతో పాటు హరియాణా, చండీగఢ్ ల లోని అంబాలా చండీగఢ్, మొహాలీ, సంగ్ రూర్, పటియాలా, లుధియానా, జాలంధర్, కపుర్ తలా, కథువా ఇంకా సాంబాల లోని కీలకమైన ఆర్థిక కేంద్రాల ను సైతం జోడిస్తుంది.

దాదాపు 1700 కోట్ల రూపాయల ఖర్చు తో అమృత్ సర్- ఊనా సెక్శను ను నాలుగు దోవలు కలిగివుందేది గా చేయడం జరుగుతుంది.  77 కి.మీ. దూరం తో ఉండే సెక్శన్ అనేది అమృత్ సర్ నుంచి భోటా కారిడార్ ఉత్తర పంజాబ్ మరియు హిమాచల్ ప్రదేశ్ ల యొక్క రేఖాంశం లో విస్తరించి ఉండి, నాలుగు ప్రధాన జాతీయ రహదారుల ను కలుపుతుంది. ఆ నాలుగు ప్రధాన జాతీయ రహదారులు ఏవేవి అంటే అవి అమృత్ సర్ -భటిండ - జామ్ నగర్ ఇకానామిక్ కారిడార్ , దిల్లీ-అమృత్ సర్-కాట్ రా ఎక్స్ ప్రెస్ వే, నార్థ్ -సౌథ్ కారిడార్ ఇంకా కాంగ్ రా-హమీర్ పుర్-బిలాస్ పుర్-శిమ్ లా కారిడార్ లు.  ఇది ఘోమన్ లోను, శ్రీ హర్ గోబింద్ పుర్ లోను, పూల్ పుక్ తా పట్టణం (ప్రసిద్ధ గురుద్వారా పూల్ పుక్ తా సాహిబ్ నెలకొన్నది ఇక్కడే) లోను ఉన్నటువంటి ధార్మిక క్షేత్రాల కు సంధానాన్ని మెరుగుపరచడం లో సహాయకారి కానుంది.

ముకేరియాఁ కు, తల్ వాడా కు మధ్య సుమారు 27 కి.మీ.  పొడవైన ఒక సరికొత్త బ్రాడ్ గేజ్ రైల్ వే లైను కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. దీనిని 410 కోట్ల రూపాయలకు పైగా వ్యయం తో నిర్మించనున్నారు.  ఈ రైల్ వే లైనను నాంగల్ ఆనకట్ట-దౌలత్ పుర్ చౌక్ రైల్ వే సెక్శను కు పొడిగింపు గా ఉంటుంది. ఇది ఆ ప్రాంతం లో అన్ని రకాల వాతావరణం లోనూ అనువు గా ఉండే రవాణా మాధ్యమాన్ని అందిస్తుంది.  ఈ ప్రాజెక్టు కు వ్యూహాత్మకమైనటువంటి ప్రాధాన్యం కూడా ఉంటుంది. అది ఏమిటి అంటే ఇది జమ్ము కశ్మీర్ కు ఒక ప్రత్యామ్నాయ మార్గం గా కూడా ఉపయోగపడుతుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి జాలంధర్- జమ్ము రైల్ వే లైను లో ముకేరియాఁ వద్ద కలుస్తుంది.  ఈ ప్రాజెక్టు ప్రత్యేకించి పంజాబ్ లోని హోశియార్ పుర్ ప్రజల కు మరియు హిమాచల్ ప్రదేశ్ లోని ఊనా ల ప్రజల కు ప్రయోజనకరం గా ఉండగలదు.  ఇది ఆ ప్రాంతం లో పర్యటన రంగానికి దన్ను గా నిలుస్తుంది.  అలాగే పర్వత ప్రాంత పట్టణాల తో పాటు గా ధార్మిక ప్రాధాన్యం కలిగిన క్షేత్రాల కు కూడాను సులభతర సంధానాన్ని సమకూర్చగలదు.

దేశం లో అన్ని ప్రాంతాల లో ప్రపంచ శ్రేణి వైద్య చికిత్స సదుపాయాల ను కల్పించాలి అనేటటువంటి ప్రధాన మంత్రి కృషి కి అనుగుణం గా, పంజాబ్ లోని మూడు పట్టణాల లో నూతన వైద్య రంగ సంబంధి మౌలిక సదుపాయాల కు పునాదిరాయిని వేయడం జరుగుతుంది.  ఫిరోజ్ పుర్ లో 100 పడకల తో పిజిఐ శాటిలైట్ సెంటరు ను 490 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో నిర్మించడం జరుగుతుంది.  దీనిలో ఇంటర్నల్ మెడిసిన్, సాధారణ శస్త్ర చికిత్స, ఎముకలకు, వేళ్ల కు సంబంధించిన చికిత్స,  ప్లాస్టిక్ సర్జరీ, నాడీశస్త్రచికిత్స, ప్రసూతిశాస్త్రం మరియు స్త్రీ రోగ శాస్త్రం, శిశువైద్య చికిత్స, నేత్రవైద్యశాస్త్రం, కన్ను-ముక్కు -చెవి మరియు మనోరోగచికిత్స శాస్త్రం- మాదకద్రవ్యాల వ్యసనాన్ని పారదోలడం సహా 10 ప్రత్యేక విభాగాల తో సేవల ను అందించడం జరుగుతుంది.  ఇక శాటిలైట్ సెంటరు ఫిరోజ్ పుర్ లోను, చుట్టుపక్కల ప్రాంతాల లోను ప్రపంచ స్థాయి వైద్య చికిత్స సదుపాయాల ను సమకూర్చనుంది.

కపుర్ తలా లోను, హోశియార్ పుర్ లోను రెండు మెడికల్ కాలేజీల ను సుమారు 325 కోట్ల రూపాయల ఖర్చు తో అభివృద్ధిపరచడం జరుగుతుంది.  వాటి సామర్థ్యం సుమారు 100 సీట్లు ఉంటుంది.  ఈ కళాశాలల కు కేంద్ర ప్రాయోజిత పథకం అయినటువంటి ‘జిల్లా\రిఫరల్ ఆసుపత్రుల కు అనుబంధపరచిన కొత్త మెడికల్ కాలేజీ ల స్థాపన’ తాలూకు మూడో దశ లో భాగం గా ఆమోదం తెలపడం జరిగింది.  ఈ పథకం లో పంజాబ్ కు మూడు మెడికల్ కాలేజీల స్థాపన కు ఆమోదం ఇవ్వడమైంది.  ఒకటో దశ లో అనుమతి ఇచ్చిన కళాశాల ఎస్ఎఎస్ నగర్ లో ఇప్పటికే నడుస్తోంది.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi