అరవై ఎనిమది వేల కోట్ల కు పైగా విలువ కలిగిన ప్రాజెక్టుల ను ఒడిశా లోని సంబల్ పుర్ లో ప్రారంభించి, దేశ ప్రజల కు అంకితం చేయనున్న ప్రధాన మంత్రి; కొన్ని ప్రాజెక్టుల కు ఆయన శంకుస్థాపన చేస్తారు
సహజ వాయువు, బొగ్గు మరియు విద్యుత్తు ఉత్పాదన లతో ముడిపడ్డ వివిధ ప్రాజెక్టుల నుప్రారంభించడం, దేశ ప్రజల కుఅంకితం చేయడం మరియు శంకుస్థాపన ల ద్వారా శక్తి రంగాని కి లభించనున్న అండదండలు
రహదారులు, రైల్ వే మరియు ఉన్నత విద్య లకు చెందిన ముఖ్యమైన ప్రాజెక్టుల ను ప్రారంభించడంతో పాటు గా వాటిని దేశ ప్రజల కు అంకితం ఇవ్వడం జరుగుతుంది
సంబల్ పుర్ రైల్ వే స్టేశన్ యొక్క పునరభివృద్ధి పనులకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు; ఈ రైల్ వే స్టేశన్ యొక్క వాస్తు కళ శైలశ్రీ పేలిస్నుండి ప్రేరణ ను పొందింది
పదకొండు వేల కోట్ల రూపాయల కుపైగా విలువ కలిగిన ప్రాజెక్టుల ను గువాహాటీ లో ప్రారంభించడం తో పాటు, శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి
కామాఖ్య దేవాలయానికి వచ్చే తీర్థయాత్రికుల కు ప్రపంచశ్రేణి సౌకర్యాల ను సమకూర్చడం కోసం మాత కామాఖ్య దివ్య పరియోజన కు కూడాను శంకుస్థాపనచేయనున్న ప్రధాన మంత్రి
క్రీడలు & చిక

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరి 3 వ తేదీ మరియు 4 వ తేదీల లో ఒడిశా ను మరియు అసమ్ ను సందర్శించనున్నారు.

 

ఒడిశా లోని సంబల్ పుర్ లో జరుగనున్న ఒక సార్వజనిక కార్యక్రమం లో ప్రధాన మంత్రి 68,000 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక మౌలిక సదుపాయాల రంగ సంబంధి ప్రాజెక్టుల ను ప్రారంభించడం , దేశ ప్రజల కు అంకితం ఇవ్వడం మరియు శంకుస్థాపన చేయనున్నారు. దీని తరువాత ప్రధాన మంత్రి అసమ్ కు వెళ్తారు. ఫిబ్రవరి 4 వ తేదీ నాడు ఉదయం పూట సుమారు 11:30 గంటల కు గువాహాటీ లో జరిగే ఒక సార్వజనిక కార్యక్రమం లో 11,000 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల కు ప్రధాన మంత్రి ప్రారంభోత్సవం తో పాటు శంకుస్థాపన చేయనున్నారు.

 

సంబల్‌పుర్ లో ప్రధాన మంత్రి

దేశం లో శక్తి సంబంధి భద్రత ను పటిష్ట పరచాలన్న ప్రధాన మంత్రి దృష్టి కోణాని కి అనుగుణం గా, శక్తి రంగాని కి దన్ను గా నిలచేందుకు ఉద్దేశించినటువంటి అనేక ప్రాజెక్టుల కు ఒడిశా లోని సంబల్ పుర్ లో ఏర్పాటైన ఒక సార్వజనిక కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రారంభోత్సవం, దేశ ప్రజల కు అంకితం ఇవ్వడం మరియు శంకుస్థాపన లు చేయనున్నారు.

 

 

‘జగ్‌దీశ్‌పుర్-హల్దియా & బోకారో - ధామ్‌రా పైప్ లైన్ ప్రాజెక్టు (జెహెచ్‌బిడిపిఎల్)’ లో భాగం అయినటువంటి ‘ధామ్‌రా - అంగుల్ పైప్ లైన్ సెక్శన్’ (ఇది 412 కి.మీ. మేరకు ఉంటుంది) ని ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ‘ప్రధాన్ మంత్రి ఊర్జా గంగా’ లో భాగం గా 2450 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు తో నిర్మాణం అయినటువంటి ఈ ప్రాజెక్టు ఒడిశా ను జాతీయ గ్యాస్ గ్రిడ్ తో కలుపుతుంది. ముంబయి-నాగ్ పుర్-ఝార్ సుగుడా గొట్టపు మార్గం లో భాగం గా ఉండే ‘నాగ్‌పుర్ ఝార్ సుగుడా నేచురల్ గ్యాస్ పైప్ లైన్ సెక్శన్’ (ఇది 692 కి.మీ. లు గా ఉంటుంది) కి కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. 2,660 కోట్ల రూపాయల కు పైచిలుకు వ్యయం తో అభివృద్ధి పరుస్తున్న ఈ ప్రాజెక్టు తో ఒడిశా, మహారాష్ర్ట మరియు ఛత్తీస్‌ ‌గఢ్ ల వంటి రాష్ట్రాల లో సహజ వాయువు యొక్క లభ్యత లో చాలావరకు మెరుగుదల చోటు చేసుకోనుంది.

 

 

ఇదే కార్యక్రమం లో భాగం గా, సుమారు రమారమి 28,980 కోట్ల రూపాయల వ్యయం అయ్యేటటువంటి అనేక విద్యుత్తు ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి దేశ ప్రజల కు అంకితం ఇవ్వడం తో పాటు గా శంకుస్థాపన కూడా చేయనున్నారు. దేశ ప్రజల కు అంకితం ఇవ్వబోయే ప్రాజెక్టుల లో ఒడిశా లోని సుందర్‌గఢ్ జిల్లా లో ఎన్‌టిపిసి దర్‌ లీపాలీ సూపర్ థర్మల్ పవర్ స్టేశన్ (800 మెగావాట్ ల సామర్థ్యం కలిగిన రెండు పథకాలు) మరియు ఎన్ఎస్‌పిసిఎల్ రావుర్‌కెలా పిపి-II విస్తరణ పథకాన్ని (ఇది 250 మెగా వాట్ ల సామర్థ్యం కలిగి ఉంటుంది) భాగం గా ఉన్నాయి. ప్రధాన మంత్రి ఒడిశా లో అంగుల్ జిల్లా లో ఎన్ టిపిసి తాల్‌చేర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు యొక్క మూడో దశ (660 మెగా సామర్థ్యం తో కూడిన రెండు ప్లాంటు లు ఉంటాయి) కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఈ విద్యుత్తు ప్రాజెక్టు లు ఒడిశా తో పాటు అనేక ఇతర రాష్ట్రాల కు కూడాను తక్కువ ఖర్చు లో విద్యుత్తు ను సరఫరా చేస్తాయి.

 

ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల కు పైగా వ్యయమైన నెవేలీ లిగ్నైట్ కార్పొరేశన్ (ఎన్ఎల్ సి) కి చెందిన తాలాబీరా థర్మల్ పవర్ ప్రాజెక్టు కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాన మంత్రి యొక్క ఆత్మనిర్భర్ భారత్ దృష్టికోణాని కి బలాన్ని సంతరిస్తూ, ఈ అత్యాధునిక ప్రాజెక్టు దేశ ప్రజల కు శక్తి సంబంధి భద్రత ను గణనీయం గా పెంచుతుంది. మరి ఇది విశ్వసనీయమైనటువంటి, తక్కువ ఖర్చు తో కూడినటువంటి , ఇంకా 24 గంటల పాటు అందేటటువంటి విద్యుత్తు ను సరఫరా చేస్తూ దేశం యొక్క ఆర్థిక ప్రగతి, ఇంకా సమృద్ధి లో ఒక కీలకమైన పాత్ర ను పోషిస్తుంది.

 

 

ప్రధాన మంత్రి అంగుల్ జిల్లా లో తాల్‌చేర్ కోల్ ఫీల్డ్‌స్ పరిధి లో ఫస్ట్ మైల్ కనెక్టివిటి (ఎఫ్ఎమ్‌సి) ప్రాజెక్టుల ను ప్రారంభించనున్నారు. వీటిలో భువనేశ్వరి ఒకటో దశ మరియు లాజ్‌కురా రేపిడ్ లోడింగ్ సిస్టమ్ (ఆర్ఎల్ఎస్) సహితం గా మహానది కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ కు చెందిన బొగ్గు సంబంధి మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు కలిసి ఉన్నాయి. సుమారు 2145 కోట్ల రూపాయల ఖర్చు తో తయారు అయిన ఈ ప్రాజెక్టు లు ఒడిశా నుండి పొడి ఇంధనం యొక్క నాణ్యత మరియు సరఫరాలను పెంచేందుకు దోహద పడనున్నాయి. ఒడిశా లోని ఝార్‌సుగుడా జిల్లా లో 550 కోట్ల రూపాయల కు పైచిలుకు వ్యయం తో నిర్మించినటువంటి ఐబి వేలీ వాశరీ ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఇది బొగ్గు శుద్ధి ప్రక్రియ లో నూతన ఆవిష్కరణ మరియు దీర్ఘకాలికత కు ప్రతీక గా ఉంటుంది. మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ 878 కోట్ల రూపాయల పెట్టుబడి తో నిర్మాణం పూర్తి చేసిన ఝార్‌సుగుడా-బార్‌పాలీ-సర్‌డేగా రైలు మార్గం ఒకటో దశ లో భాగం అయినటువంటి 50 కి.మీ. పొడవైన రెండో రైలు మార్గాన్ని కూడా ప్రధాన మంత్రి దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు.

 

 

సుమారు 2110 కోట్ల రూపాయల మొత్తం వ్యయం తో అభివృద్ధి పరచినటువంటి జాతీయ రహదారుల తాలూకు ప్రాజెక్టులు మూడిటి ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుల లో ఎన్‌హెచ్ 215 (క్రొత్త ఎన్‌హెచ్ సంఖ్య 520) లో భాగం అయినటువంటి రిములీ- కోయిదా సెక్శను ను నాలుగు దోవలు కలిగివుండేది గా విస్తరించడం, ఎన్‌హెచ్-23 (క్రొత్త ఎన్‌హెచ్ సంఖ్య 143) లో భాగం అయినటువంటి బీర్ మిత్రపుర్ - బ్రాహ్మణీ బైపాస్ ఎండ్ సెక్శను ను నాలుగు దోవలు కలిగివుండేది గా విస్తరించం మరియు ఎన్‌హెచ్ 23 (క్రొత్త ఎన్‌హెచ్ సంఖ్య 143) లో భాగం అయినటువంటి బ్రాహ్మణి బైపాస్ ఎండ్ - రాజాముండా సెక్శను ను నాలుగు దోవ లు కలిగివుండేది గా విస్తరించడం వంటి పనులు కలిసి ఉన్నాయి. ఈ ప్రాజెక్టు లు కనెక్టివిటీని వ‌ృద్ధి చెందింప చేసి మరి ఆ ప్రాంతం లో ఆర్థిక అభివృద్ధి కి వాటి వంతు తోడ్పాటు ను అందించగలవు.

 

 

దీనికి తోడు, ప్రధాన మంత్రి దాదాపు గా 2146 కోట్ల రూపాయలు వ్యయం అయ్యేటటువంటి రైల్ వే ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితం చేయడం తో పాటు గా శంకుస్థాపన చేస్తారు. ఆయన సంబల్‌పుర్ రైల్ వే స్టేశన్ యొక్క పునర్ అభివృద్ధి పనుల కు శంకుస్థాపన చేయనున్నారు. దీని వాస్తుకళ శైలశ్రీ పేలిస్ నుండి ప్రేరణ ను పొందింది. ఆయన ఈ ప్రాంతం లో రైలు నెట్ వర్క్ యొక్క సామర్థ్యాన్ని పెంచడ కోసం సంబల్‌పుర్- తాల్‌చేర్ రైలు మార్గం డబ్లింగ్ పనులు (దీని నిడివి 168 కి.మీ. లు) మరియు ఝార్‌తర్‌భా మొదలుకొని సోన్ పుర్ క్రొత్త రైలు మార్గం (దీని నిడివి 21.7 కి.మీ. లు) లను కూడా దేశ ప్రజల కు అంకితం చేస్తారు. ప్రధాన మంత్రి పురీ-సోనేపురి పురీ వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు కు కూడా ప్రారంభ సూచకం గా జెండా ను చూపెడతారు. దీనితో ఆ ప్రాంతం లో రైలు ప్రయాణికుల కు కనెక్టివిటీ మెరుగుపడనుంది.

 

ఐఐఎమ్ సంబల్‌పుర్ యొక్క శాశ్వత పరిసరాల ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. దీనికి అదనం గా, ఆయన ఝార్‌సుగుడా ప్రధాన తపాలాకార్యాలయం యొక్క వారసత్వ భవనాన్ని సైతం దేశ ప్రజల కు అంకితం ఇవ్వనున్నారు.

 

 

గువాహాటీ లో ప్రధాన మంత్రి

పదకొండు వేల కోట్ల రూపాయల విలువ కలిగిన ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి గువాహాటీ లో ప్రారంభించడం మరియు శంకుస్థాపన చేయనున్నారు.

 

తీర్థ స్థలాల కు యాత్ర జరిపేటటువంటి ప్రజల కు ప్రపంచ శ్రేణి సౌకర్యాల ను అందుబాటు లోకి తీసుకు రావడం ప్రధాన మంత్రి అమిత శ్రద్ధ ను తీసుకొంటున్న రంగాల లో ఒకటి గా ఉంది. ఈ కృషి లో మరొక చర్యయా అన్నట్లుగా, ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్న ప్రాజెక్టుల లో మాత కామాఖ్య దివ్య పరియోజన (మా కామాఖ్య ఏక్సెస్ కారిడర్) ఒకటి గా ఉంది. దీనిని ప్రైమ్ మినిస్టర్స్ డెవలప్‌మెంట్ ఇనిశియేటివ్ ఫార్ నార్థ్ ఈస్టర్న్ రీజియన్ (పిఎమ్ -డిఇవిఐఎన్ఇ) పథకం లో భాగం గా మంజూరు చేయడమైంది. ఈ ప్రాజెక్టు కామాఖ్య దేవాలయానికి వచ్చేటటువంటి తీర్థయాత్రికుల కు ప్రపంచ శ్రేణి సదుపాయాల ను అందుబాటు లోకి తీసుకు వస్తుంది.

 

మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో కూడినటువంటి అనేక రహదారి ఉన్నతీకరణ పథకాల కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. వీటి లో 38 వంతెనలు సహా 43 రహదారులు భాగం గా ఉన్నాయి. వీటిని సౌథ్ ఏశియా సబ్ రీజినల్ ఇకానామిక్ కోఆపరేశన్ (ఎస్ఎఎస్ఇసి) కారిడర్ కనెక్టివిటీ లో భాగం గా ఉన్నతీకరించడం జరుగుతుంది. డోలాబారీ మొదలుకొని జముగురి వరకు మరియు బిశ్వనాథ్ చారియాలీ నుండి గోహ్‌ పుర్ వరకు నాలుగు దోవల తో కూడినటువంటి రెండు ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టులు ఈటా నగర్ నుండి కనెక్టివిటీ ని మెరుగు పరచడం తో పాటు ఆ ప్రాంతం లో సమగ్ర ఆర్థికాభివృద్ధి ని పెంచడం లో తోడ్పడుతాయి.

 

 

 

ఈ ప్రాంతం యొక్క క్రీడా సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకొనే లక్ష్యం తో, ప్రధాన మంత్రి రాష్ట్రం లో క్రీడా సంబంధి మౌలిక సదుపాయాల ను పెంపొందింప చేయడం కోసం అనేక ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల లో చంద్రపుర్ లో అంతర్జాతీయ ప్రమాణాల తో కూడిన క్రీడా స్టేడియమ్ తో పాటు నెహ్ రూ స్టేడియమ్ ను ఎఫ్ఐఎఫ్ఎ ప్రమాణాలను కలిగివుండేటటువంటి ఫుట్‌బాల్ స్టేడియమ్ గా ఉన్నతీకరించడం వంటివి ఉన్నాయి.

 

 

ప్రధాన మంత్రి గౌహాటీ మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్ తాలూకు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. దీనికి అదనం గా, ఆయన కరీమ్‌గంజ్ లో ఒక వైద్య కళాశాల యొక్క అభివృద్ధి పనుల కు కూడా శంకుస్థాపన చేస్తారు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Double engine govt becoming symbol of good governance, says PM Modi

Media Coverage

Double engine govt becoming symbol of good governance, says PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 17 డిసెంబర్ 2024
December 17, 2024

Unstoppable Progress: India Continues to Grow Across Diverse Sectors with the Modi Government