Quoteతిరుచిరాపల్లిలోని శ్రీ రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించనున్న ప్రధాన మంత్రి; ఈ ఆలయంలో పండితులు కంబ రామాయణం నుండి శ్లోకాలు పఠించడాన్ని చూస్తారు
Quoteశ్రీ అరుల్మిగు రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించనున్న పీఎం; బహుళ భాషలలో రామాయణ పఠన, భజన సంధ్యలో పాల్గొంటారు
Quoteప్రధానమంత్రి ధనుష్కోడి కోదండరామస్వామి ఆలయాన్ని కూడా సందర్శించనున్నారు; ప్రధాన మంత్రి అరిచల్ మునైను కూడా సందర్శించనున్నారు

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 జనవరి 20-21 తేదీలలో తమిళనాడులోని వివిధ ముఖ్యమైన దేవాలయాలను సందర్శిస్తారు.

జనవరి 20వ తేదీ ఉదయం 11 గంటలకు తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో జరిగే కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. ఈ ఆలయంలో వివిధ పండితులు కంబ రామాయణం నుండి పద్యాలను పఠించడాన్ని కూడా ప్రధాన మంత్రి వింటారు.

ఆ తర్వాత, ప్రధాని మధ్యాహ్నం 2 గంటలకు రామేశ్వరం చేరుకుని, శ్రీ అరుల్మిగు రామనాథస్వామి ఆలయంలో దర్శనం చేసుకుని  పూజలు నిర్వహిస్తారు. గత కొన్ని రోజులుగా ప్రధానమంత్రి పలు దేవాలయాలను సందర్శిస్తున్న నేపథ్యంలో, ఈ ఆలయంలో వివిధ భాషలలో (మరాఠీ, మలయాళం మరియు తెలుగు వంటి) రామాయణ పఠనానికి హాజరవుతున్నప్పుడు పాటించే ఆచారాన్ని కొనసాగిస్తూ, ఆయన ఒక కార్యక్రమానికి హాజరవుతారు - 'శ్రీ రామాయణ పర్యాణ '. కార్యక్రమంలో, ఎనిమిది వేర్వేరు సంప్రదాయ మండలులు సంస్కృతం, అవధి, కాశ్మీరీ, గురుముఖి, అస్సామీ, బెంగాలీ, మైథిలి మరియు గుజరాతీ రామకథలను (శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భాన్ని వివరిస్తారు) పఠిస్తారు. ఇది 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్'లో ప్రధానమైన భారతీయ సాంస్కృతిక తత్వానికి & బంధానికి అనుగుణంగా ఉంటుంది. శ్రీ అరుల్మిగు రామనాథస్వామి ఆలయంలో, సాయంత్రం ఆలయ సముదాయంలో బహుళ భక్తి గీతాలు పాడే భజన సంధ్యలో కూడా ప్రధాన మంత్రి పాల్గొంటారు.

జనవరి 21వ తేదీన ధనుష్కోడిలోని కోదండరామస్వామి ఆలయంలో ప్రధానమంత్రి దర్శనం, పూజలు చేస్తారు. ధనుష్కోడి సమీపంలో, రామసేతు నిర్మించిన ప్రదేశంగా చెప్పబడే అరిచల్ మునైని కూడా ప్రధాని సందర్శిస్తారు.

శ్రీ రంగనాథస్వామి దేవాలయం

శ్రీరంగం, తిరుచ్చిలో ఉన్న ఈ ఆలయం దేశంలోని అత్యంత పురాతన ఆలయ సముదాయాలలో ఒకటి. పురాణాలు, సంగం యుగం గ్రంథాలతో సహా వివిధ పురాతన గ్రంథాలలో ప్రస్తావనను పొందింది. ఇది దాని నిర్మాణ వైభవానికి మరియు అనేక ఐకానిక్ గోపురాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పూజించబడే ప్రధాన దైవం శ్రీ రంగనాథ స్వామి, భగవాన్ విష్ణువు యొక్క శయన రూపం. వైష్ణవ గ్రంధాలు ఈ ఆలయంలో పూజించే విగ్రహానికి, అయోధ్యకు మధ్య ఉన్న సంబంధాన్ని పేర్కొంటున్నాయి. శ్రీరాముడు, పూర్వీకులు పూజించే విష్ణుమూర్తి విగ్రహాన్ని లంకకు తీసుకెళ్లడానికి విభీషణుడికి ఇచ్చాడని నమ్మకం. దారిలో ఈ విగ్రహం శ్రీరంగంలో స్థిరపడింది.

గొప్ప తత్వవేత్త, సన్యాసి శ్రీ రామానుజాచార్యులు కూడా ఈ ఆలయ చరిత్రతో లోతైన సంబంధం కలిగి ఉన్నారు. అంతేకాకుండా, ఈ ఆలయంలో అనేక ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి - ఉదాహరణకు, ప్రసిద్ధ కంబ రామాయణం ఈ కాంప్లెక్స్‌లోని ఒక నిర్దిష్ట ప్రదేశంలో తమిళ కవి కంబన్ చేత మొదటిసారిగా బహిరంగంగా ప్రదర్శించబడింది.

శ్రీ అరుల్మిగు రామనాథస్వామి దేవాలయం, రామేశ్వరం

ఈ ఆలయంలో ప్రధాన దైవం శ్రీ రామనాథస్వామి, ఇది భగవాన్ శివ స్వరూపం. ఈ ఆలయంలోని ప్రధాన లింగం శ్రీరాముడు, సీత మాతచే ప్రతిష్టించబడి పూజించబడిందని విస్తృతంగా నమ్ముతారు. ఈ ఆలయంలో పొడవైన ఆలయ కారిడార్ ఒకటి ఉంది, ఇది అందమైన వాస్తుశిల్పానికి కూడా ప్రసిద్ధి చెందింది. ఇది చార్ ధామ్‌లలో ఒకటి - బద్రీనాథ్, ద్వారక, పూరి మరియు రామేశ్వరం. 12 జ్యోతిర్లింగాలలో ఇది కూడా ఒకటి.

కోతండరామస్వామి దేవాలయం, ధనుష్కోడి
 

ఈ ఆలయం శ్రీ కోతండరామ స్వామికి అంకితం చేయబడింది. కోతండరాముడు అంటే విల్లుతో ఉన్న రాముడు. ఇది ధనుష్కోడి అనే ప్రదేశంలో ఉంది. విభీషణుడు శ్రీరాముడిని మొదటిసారిగా కలుసుకుని శరణు కోరింది ఇక్కడే అని చెబుతారు. శ్రీరాముడు విభీషణుని పట్టాభిషేకం జరిపించిన ప్రదేశం ఇదేనని కూడా కొన్ని పురాణాలు చెబుతున్నాయి.

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
PM Modi’s longest foreign tour: At 74, what keeps him going?

Media Coverage

PM Modi’s longest foreign tour: At 74, what keeps him going?
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Mizoram meets PM Modi
July 14, 2025