ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 మార్చి నెల 25 వ తేదీ నాడు కర్నాటక ను సందర్శించనున్నారు. ఉదయం పూట ఇంచుమించు 10 గంటల 45 నిమిషాల వేళ కు ప్రధాన మంత్రి చిక్కబళ్ళాపుర లో శ్రీ మధుసూదన్ సాయి ఇన్స్ టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎండ్ రిసర్చ్ ను ప్రారంభిస్తారు. బెంగళూరు మెట్రో లో భాగం గా ఉన్న వైట్ ఫీల్డ్ (కడుగోడి) నుండి కృష్ణరాజపుర మెట్రో లైను ను మధ్యాహ్నం పూట దాదాపు గా ఒంటి గంట వేళ కు ప్రధాన మంత్రి ప్రారంభించి, మెట్రో లో ప్రయాణిస్తారు కూడాను.
చిక్కబళ్ళాపుర లో ప్రధాన మంత్రి
ఈ ప్రాంతం లోని విద్యార్థులకు కొత్త అవకాశాల ను అందుకోవడం లో తోడ్పాటు ను అందించేందుకు మరియు తక్కువ ఖర్చు తో కూడిన ఆరోగ్య సంరక్షణ ను అన్ని వర్గాల వారి కి అందుబాటు లోకి తెచ్చేందుకు ఉద్దేశించినటువంటి ఒక కార్యక్రమం లో భాగం గా, శ్రీ మధుసూదన్ సాయి ఇన్స్ టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎండ్ రిసర్చ్ (ఎస్ఎమ్ఎస్ఐఎమ్ఎస్ఆర్) ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. దీనిని చిక్కబళ్ళాపుర లోని ముద్దెనహళ్ళి వద్ద గల సత్య సాయి గ్రామం లో శ్రీ సత్య సాయి యూనివర్సిటీ ఫార్ హ్యూమన్ ఎక్స్ లెన్స్ ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతం లో నెలకొన్నటువంటి మరియు వైద్య విద్య ను, ఆరోగ్య సంరక్షణ ను వ్యాపార పరిధి నుండి తప్పించాలి అనేటటువంటి దృష్టికోణం తో ఏర్పాటు చేసినటువంటి ఎస్ఎమ్ఎస్ఐఎమ్ఎస్ఆర్ వైద్య విద్య ను మరియు నాణ్యత కలిగిన వైద్య చికిత్స సంబంధి సంరక్షణ ను అందరికీ పూర్తి ఉచితం గా అందజేయనుంది. ఈ సంస్థ 2023 విద్య సంవత్సరం నుండి పని చేయడం ప్రారంభిస్తుంది.
బెంగళూరు లో ప్రధాన మంత్రి
దేశం అంతటా ప్రపంచ శ్రేణి పట్టణ ప్రాంత గతిశీలత సంబంధి మౌలిక సదుపాయాల ను అభివృద్ధి పరచే విషయం లో ప్రధాన మంత్రి ప్రత్యేక శ్రద్ధ ను తీసుకొంటున్నారు. దీనికి అనుగుణం గానే, బెంగళూరు మెట్రో రెండవ దశ లో భాగం గా13.71 కిలో మీటర్ ల మేర వైట్ ఫీల్డ్ (కడుగోడి) మెట్రో నుండి కృష్ణరాజపుర మెట్రోలైన్ రీచ్-1 విస్తరణ పథకాన్ని వైట్ ఫీల్డ్ (కడుగోడి) మెట్రో స్టేశన్ లో ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. సుమారు గా 4250 కోట్ల రూపాయల ఖర్చు తో నిర్మాణం అయిన ఈ మెట్రో లైను ను ప్రారంభించడం బెంగళూరు లో ప్రయాణికుల కు స్వచ్ఛమైనటువంటి, సురక్షితమైనటువంటి, వేగవంతం అయినటువంటి మరియు సౌకర్యవంతం అయినటువంటి ప్రయాణ సదుపాయాన్ని అందుబాటు లోకి తీసుకు రావడం తో పాటు గతిశీలత లో సౌలభ్యాన్ని వృద్ధి చెందింప చేస్తూ నగరం లో ట్రాఫిక్ రద్దీ ని కూడాను తగ్గిస్తుంది.