ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 జూన్ 20,21 తేదీలలో కర్ణాటకను సందర్శిస్తారు. 20 వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటల్ ప్రాంతంలో ప్రధానమంత్రి బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్‌సి) బెంగళూరును సందర్శిస్తారు. అక్కడ సెంటర్ ఫర్ బ్రెయిన్ రిసెర్చ్ (సిబిఆర్)ను ఆయన ప్రారంభిస్తారు. అలాగే బగ్చి- పార్థసార్థి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 1.45 గంటలకు ఆయన బెంగళూరులో డాక్టర్ బి.ఆర్ .అంబేడ్కర్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ (బిఎఎస్ఇ)ను సందర్శిస్తారు. అక్కడ బిఎఎస్ఇ నూతన క్యాంపస్ ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. డాక్టర్ బి.ఆర్ .అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. కర్ణాటకలో పరివర్తనాత్మక పారిశ్రామిక శిక్షణా సంస్థలు (ఐటిఐ) అభివృద్ధి చేసిన 150 టెక్నాలజీ హబ్‌లను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. అనంతరం ప్రధానమంత్రి మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతలో బెంగళూరులోని కొమ్మఘట్ట చేరుకుంటారు. అక్కడ ఆయన 27,000 కోట్ల రూపాయల విలువగల పలు రైలు, రోడ్డు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. సాయంత్రం 5.30 గంటలకు ప్రధానమంత్రి మైసూరు మహారాజా కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటయ్యే ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ నాగన్‌హల్లి రైల్వేస్టేషన్ వద్ద కోచింగ్ టెర్మినల్‌కు శంకుస్థాపన చేస్తారు. ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్, హియరింగ్ (ఎఐఐఎస్ హెచ్ )లో కమ్యూనికేషన్ ఇబ్బందులు క లిగిన వారికోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు ప్రధానమంత్రి సుత్తూర్ మఠ్‌ను సందర్శిస్తారు. రాత్రి 7.45 గంటలకు ప్రధానమంత్రి మైసూరు చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శిస్తారు.
జూన్ 21 వ తేదీ ఉదయం 6.30 గంటలకు ప్రధానమంత్రి,8 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా మైసూర్ లోని మైసూర్ పాలెస్ గ్రౌండ్ లో ఏర్పాటు చేస్తున్న భారీ యోగా ప్రదర్శనలో పాల్గొంటారు.
బెంగళూరులో ప్రధానమంత్రి
బెంగళూరులో ప్రయాణం, అనుసంధానతను మరింత మెరుగుపరిచేందుకు ప్రధానమంత్రి బెంగళూరు సబర్బన్ రైల్ ప్రాజెక్టు (బిఎస్ ఆర్‌పి)కి ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇది బెంగళూరు సిటీని దాని శివారు ప్రాంతాలు, శాటిలైట్ టౌన్ షిప్ లతో అనుసంధానం చేస్తుంది. ఈ ప్రాజెక్టును 15,700 కోట్ల రూపాయల వ్యయంతో చేపడతారు. ఇందులో 4 కారిడార్లు ఉన్నాయి. దీని మొత్తం పొడవు 148 కిలోమీటర్లు. అలాగే ప్రధానమంత్రి 500 కోట్ల రూపాయల వ్యయంతో బెంగళూరు కంటోన్మెంట్ పునర్ అభివృద్ధి, 375 కోట్ల రూపాయల వ్యయంతో యశ్వంత్ పూర్ రైల్వే జంక్షన్ అభివృద్ధికి శంకుస్థాపన చేస్తారు.
ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి బయ్యప్పన హళ్లిలో దేశంలోనే తొలిసారిగా ఏర్పాటైన ఎయిర్ కండిషన్డ్ రైల్వే స్టేషన్ - సర్ ఎం.విశ్వేశ్వరయ్య రైల్వేష్టేషన్‌ను జాతికి అంకితం చేస్తారు. ఆధునిక విమానాశ్రయాల మాదిరి 315 కోట్ల రూపాల వ్యయంతో దీనిని అభివృద్ధి చేశారు. కొంకణ్ రైల్వే లైన్ కు సంబంధించి 740 కిలోమీటర్ల లైన్ నును మహారాష్ట్రలోని రోహా నుంచి కర్ణాటకలోని తోకుర్ వరకు నూరుశాతం విద్యుదీకరణ ను జాతికి అంకితం చేస్తారు. ఇందుకు సంబంధించి ఉడుపి, మడగాన్, రత్నగిరి విద్యుత్ రైలును ప్రధానమంత్రి జండా ఊపి ప్రారంభిస్తారు.కోంకణ్ రైల్వే లైన్ విద్యుదీకరణ పనులు 1280 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టారు.అలాగే ప్రధానమంత్రి రెండు రైల్వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్టులైన అరిసికెరె నుంచి తుముకూరు (సుమారు 96 కిలోమీటర్లు), యలహంక నుంచి పెనుకొండ (120 కిలోమీటర్లు)ను జాతికి అంకితం చేస్తారు. ఈ సందర్బంగా పాసింజర్ రైళ్లు, మెము సర్వీసులను జెండా వూపి ప్రారంభిస్తారు. ఈ రెండు రైల్వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్టులను వరుసగా 750 కోట్ల రూపాయలు ,1100కోట్ల రూపాయలతో చేపట్టారు.
ఈ కార్యక్రమం సందర్బంగా ప్రధానమంత్రి బెంగళూరు రొడ్ కు సంబంధించిన రెండు సెక్షన్ లకు శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టును 2,280 కోట్ల రూపాయల వ్యయంతో చేపడతారు. ఇది నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఉపకరిస్తుంది. వివిధ ఇతర రోడ్డు ప్రాజెక్టులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపనలు చేస్తారు. అవి ఎన్‌హెచ్ 48 కి సంబంధించి ఆరు లేన్ల నీలమంగళ- తుముకూరు సెక్షన్ రోడ్ ప్రాజెక్టు, ఎన్.హెచ్ 73 లోని పుంజాల్ కట్టే- చాముండి సెక్షన్, ఎన్‌హెచ్ 69 అభివృద్ధి, పునరవాస పనులకు ప్రధానమంత్రి శంకు స్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులు చేపట్టేందుకు సుమారు 3,150 కోట్ల రూపాయలు వ్యయం అవుతుంది. బెంగళూరుకు 40 కిలోమీటర్ల దూరంలో 1800 కోట్ల రూపాయల వ్యయంతో ముద్దలింగనహల్లి వద్ద మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్‌కు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. దీనివల్ల రవాణా, సరకు పంపడం, దించుకోవడం, సెకండరీ రవాణా చార్జీలు తగ్గుతాయి.
బెంగళూరులో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ (బిఎఎస్ఇ) యూనివర్సిటీ నూతన క్యాంపస్‌కు ప్రధానమంత్రి ప్రారంభోత్సవం చేస్తారు. ఈ రెసిడెన్షియల్ యూనివర్సిటీని 2017లో ప్రారంభించారు. స్వతంత్రభారత అభివృద్ధికి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చేసన అద్భుత కృషికి నివాళిగా ఆయన స్మారకార్థం ఆయన 125 వ జయంతి సందర్బంగా దీనిని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా బిఎ ఎస్ ఇ యూనివర్సిటీలో ఏర్పాటయ్యే కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొని , 150 టెక్నాలజీ హబ్ లను జాతికి అంకితం చేస్తారు. వీటిని కర్ణాటకలోని పరివర్తనాత్మక ఐటిఐల ద్వారా అభివృద్ధి చేశారు. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని 4600 కోట్ల రూపాయలతో చేపట్టారు. ప్రధానంగా దీనిని పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో చేపట్టారు. ఇండస్ట్రీ 4.0 అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన వారిని తీర్చిదిద్దేందుకు ఈ ప్రాజెక్టును ఉద్దేశించారు. ఈ టెక్నాలజీ హబ్‌లు వివిధ వినూత్న కోర్సుల ద్వారా అత్యున్నత ప్రమాణాలు కలిగిన నైపుణ్యాల శిక్షణు అందిస్తాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని వారికి అందిస్తాయి. ఇది ఐటిఐ గ్రాడ్యుయేట్లు ఉపాధి, ఎంటర్‌ప్రెన్యుయర్ షిప్ పొందడానికి ఇది వీలు కల్పిస్తుంది.
బెంగళూరు ఐఐఎస్‌సిలో ప్రధానమంత్రి సెంటర్ ఫర్ బ్రెయిన్ రిసెర్చ్ (సిబిఆర్)ను ప్రారంభిస్తారు. ఈ సెంటర్ కు గతంలో ప్రధానమంత్రే శంకుస్థాపన చేశారు. వయసుపైబడిన రీత్యా మెదడులో వచ్చే అవకరణాలపై కీలక పరిశోధనలు చేయడానికి ఈ కేంద్రం ఉపకరిస్తుంది. ఈ కార్యక్రమంలోనే ప్రధానమంత్రి 832 పడకల బాగ్చి పార్థసారథి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన చేస్తారు. ఈ ఆస్పత్రిని బెంగళూరు ఐఐఎస్ సి కాంపస్‌లో అభివృద్ధి చేస్తారు. ఈ కేంద్రంలో సైన్సు, ఇంజనీరింగ్, మెడిసిన్‌ను సమన్వయం చేసేందుకు దీనిని అభివృద్ధి చేస్తారు. ఇది దేశంలో క్లినికల్ పరిశోదనలకు ఊతం ఇస్తుంది. దేశంలో ఆరోగ్య సేవలు మెరుగుపడడానికి , వినూత్న పరిష్కారాలు కనుగొనడానికి ఉపకరిస్తుంది.
మైసూరు లో ప్రధానమంత్రి
మైసూరులోని మహారాజా కాలేజ్‌గ్రౌండ్‌లో జరిగే అధికారిక కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. నాగన్ హల్లి రైల్వేస్టేషన్ వద్ద సబర్బన్ ట్రాఫిక్ కోచింగ్ టెర్మినల్‌కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. దీనిని 480 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. ఈ కోచింగ్ టెర్మినల్ లో మెము షెడ్ ఉంటుంది. ఇది ప్రస్తుత మైసూరు యార్డ్‌లో రద్దీ తగ్గించడానికి ఉపకరిస్తుంది. అలాగే మరిన్ని మెమూ రెళ్లు నడపడానికి ఉపయోగపడుతుంది. అలాగే మైసూరు నుంచి దూరప్రాంత రైళ్లు నడపడానికి, అనుసంధానత, పర్యాటక సామర్థ్యాన్ని ఈ ప్రాంతంలో మరింత పెంచడానికి దోహదపడుతుంది. ఇది దూరప్రాంత ప్రయాణికులకు, రోజువారి ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి కమ్యూనికేషన్ వైకల్యాలు కలిగిన వ్యక్తుల కోసం ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ , హియరింగ్ (ఎఐఐఎస్ హెచ్) ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ ఎక్సలెన్సును ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. అత్యధునాతన లేబరెటరీలు, చికిత్సా సదుపాయాలతో దీనిని తీర్చిదిద్దారు. కమ్యూనికేషన్ వైకల్యాలు కలగిని వారి స్థితిని అంచనావేయడానికి చికిత్స అందించడానికి ఉపకరిస్తుంది.
జూన్ 21న ప్రధానమంత్రి కార్యక్రమం.
2022 జూన్ 21న 8 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడివై) సందర్భంగా ప్రధానమంత్రి మైసూరులోని, మైసూరు పాలెస్ గ్రౌండ్ లో జరిగే భారీ యోగా ప్రదర్శనలో పాల్గొంటారు. 8 వ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి తోపాటు, దేశవ్యాప్తంగా 75 ఐకానిక్ ప్రదేశాలలో 75 మంది కేంద్ర మంత్రుల నాయకత్వంలో యోగా కార్యక్రమాలు జరుగుతాయి.వివిధ విద్యాసంస్థలు , సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, కార్పొరేట్ సంస్థలు, పౌరసమాజంతోపాటు దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు ఈ కార్యక్రమాలలో పాల్గొంటారు.
ప్రధానమంత్రి యోగా కార్యక్రమం మైసూరులో నిర్వహించే కార్యక్రమం, గార్డియన్ యోగ రింగ్ కార్యక్రమంలో భాగంగా వినూత్నంగా చేపడుతున్న కార్యక్రమం ఇది. 79 దేశాలు, ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో కొలాబరేటివ్ చేపడుతున్న కార్యక్రమం ఇది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ మిషన్ లతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేశాల సరిహద్దులకు ఆవల అందరినీ ఒక్కటి చేసే శక్తిని యోగా ప్రతిబింబిస్తుంది..
సూర్యుడు తూర్పు నుంచి పశ్చిమానికి కదులుతున్నరీతిలో , యోగా ప్రదర్శనలు ఒక దేశం తర్వాత ఒకటిగా సూర్య గమనానికి అనుగుణంగా నిర్వహించనున్నారు. ఇది ఒక సూర్యుడు, ఒక భూమి భావనకు అనుగుణంగా రూపుదిద్దుకున్నది. ఈ వినూత్న కార్యక్రమాన్ని డిడి ఇండియాలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. వేకువజాము 3 గంటలకు ఫిజీలో ప్రారంభం నుంచి రాత్రి 10 గంటల కు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగే కార్యక్రమం వరకు ప్రసారం చేస్తారు. ప్రధానమంత్రి మైసూరు కార్యక్రమం ఉదయం ఆరున్నరకు డిడి ఇండియాలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
2015 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (ఐడివై) 2015 నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది జూన్ 21న నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం యోగా దినోత్సవ థీమ్, మానవాళికి యోగా . కోవిడ్ మహమ్మారి సమయంలో బాధలను తొలగించడానికి మానవాళికి యోగా ఎంతగా ఉపయోగపడిందో ఇది తెలియజేస్తుంది.