వ్యూహాత్మక షింకున్ లా సొరంగ ప్రాజెక్టు మొదటి పేలుడును ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
ఈ ప్రాజెక్టు లేహ్ కు అన్ని రుతువులలోనూ సంధానాన్ని సమకూర్చనుంది
నిర్మాణ పనులు పూర్తి అయిన తరువాత ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తయిన సొరంగ మార్గం గా పేరు తెచ్చుకోనుంది

ఇరవై అయిదో కార్గిల్ విజయ్  దివస్ సందర్భంగా రేపు 2024 జులై 26న ఉదయం పూట సుమారు 9 గంటల 20 నిమిషాల వేళలో కార్గిల్ యుద్ధ స్మారకానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేరుకోనున్నారు.  కార్గిల్ యుద్ధం లో ప్రాణాలను ఆహుతి ఇచ్చిన అమర వీరులకు ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి ఘటించనున్నారు.  షింకున్ లా సొరంగ మార్గ ప్రాజెక్టులో భాగంగా తొలి పేలుడు ఘట్టాన్ని ప్రధాన మంత్రి వర్చువల్ మాధ్యమం ద్వారా ఆరంభించనున్నారు.

 

 

లేహ్ కు ప్రతి రుతువులోనూ సంధానాన్ని సమకూర్చడానికి ఉద్దేశించిన శింకున్ లా ప్రాజెక్టు లో 4.1 కిలో మీటర్ ల పొడవైన రెండు మార్గాల సొరంగాన్ని నిర్మించనున్నారు. దీని నిర్మాణం నిమూ - పదుమ్ - దార్చా రహదారిలో సుమారు 15,800 అడుగుల ఎత్తున జరుగనుంది.  శింకున్ లా సొరంగం  ఒకసారి నిర్మాణాన్ని పూర్తి చేసుకుందా అంటే గనక ఇది ప్రపంచంలో  అత్యంత ఎత్తయిన ప్రదేశంలో రూపుదిద్దుకొన్న సొరంగ మార్గంగా పేరు తెచ్చుకోనుంది.  షిన్ కున్ లా సొరంగ మార్గం మన సాయుధ దళాలకు, పరికరాలకు  శీఘ్రగతిన, నిరంతరాయ రాకపోకల సౌకర్యాన్ని అందించడం ఒక్కటే కాకుండా లడఖ్ లో ఆర్థిక, సామాజిక అభివృద్ధిని కూడా ప్రోత్సహించనుంది.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Indian economy ends 2024 with strong growth as PMI hits 60.7 in December

Media Coverage

Indian economy ends 2024 with strong growth as PMI hits 60.7 in December
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 17 డిసెంబర్ 2024
December 17, 2024

Unstoppable Progress: India Continues to Grow Across Diverse Sectors with the Modi Government