ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏప్రిల్ 24న జమ్ము కాశ్మీర్ సందర్శిస్తారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పంచాయతి రాజ్ ఉత్సవాలలో పాల్గొంటారు. 2022 ఏప్రిల్ 24 వ తేదీ ఉదయం 11.30 గంటలకు దేశవ్యాప్తంగా గల గ్రామసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆయన సాంబ జిల్లాలోని పల్లి పంచాయత్‌ను సందర్శిస్తారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి 20,000 కోట్ల రూపాయల విలువగల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అమృత్ సరోవర్ ప్రాజెక్టునుకూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ప్రధానమంత్రి ముంబాయిలో మాస్టర్ దీనానాత్ మంగేష్కర్ అవార్డుల ఉత్సవంలో పాల్గొంటారు. అక్కడ లత దీనానాథ్ మంగేష్కర్ తొలి పురస్కారాన్ని స్వీకరిస్తారు.
జమ్ము కాశ్మీర్ లో ప్రధానమంత్రిః
జమ్ము కాశ్మీర్ కు సంబంధించి 2019 ఆగస్టులో రాజ్యాంగ సంస్కరణలు చేపట్టినప్పటినుంచి , ప్రభుత్వం అక్కడ పాలనను చెప్పుకోదగిన స్థాయిలో మెరుగు పరిచేందుకు, సులభతర జీవనాన్ని మరింత పెంపొందించేందుకు శరవేగంతో విస్తృత సంస్కరణలను అమలుచేస్తోంది. ప్రధానమంత్రి తన పర్యటన సందర్భంగా శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసే పలు కార్యక్రమాలు సులభతర ప్రయాణానికి, ఈ ప్రాంతంలో అభివృద్ధికి సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనకు వీలు కల్పిస్తుంది.
ప్రధానమంత్రి 3,100 కోట్ల రూపాయలతో నిర్మించిన బనిహల్ ఖాజిగుండ్ రోడ్ సొరంగమార్గాన్ని ప్రారంభిస్తారు. ఈ 8.5 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గం బనిహల్, ఖాజిగుండ్ మధ్య దూరాన్ని 16 కిలోమీటర్ల మేర తగ్గిస్తుంది. ఫలితంగా ఈ రెండు ప్రదేశాల మధ్య ప్రయాణ సమయం ఒకటిన్నర గంట కలిసి వస్తుంది. ఇది రెండు ట్యూబ్ ల టన్నెల్. ఒక్కోక్క ట్యూబ్ ఒక్కో వైపు వెళ్లడానికి నిర్దేశించినది. ప్రతి 500 మీటర్ల దూరంలో రెండు ట్యూబులనుకలిపే ఏర్పాటు చేశారు. మెయింటినెన్స్, అత్యవసరంగా ఖాళీచేయించడానికి ఈ ఏర్పాటుచేశారు. ఈ టన్నెల్ వల్ల జమ్ము కాశ్మీర్‌కు అన్ని వాతావరణ పరిస్థితులలో అనుసంధానత ఉంటుంది. ఇది రెండు ప్రాంతాలను మరింత దగ్గర చేస్తుంది.
ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ 7,500 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఢిల్లీ- అమృత్‌సర్- కత్రా ఎక్స్‌ప్రెస్ వేకుసంబంధించిన మూడు రోడ్‌పాకేజ్‌లకు శంకుస్థాపన చేస్తారు. ఇది 4/6 లైన్ల మార్గం. జాతీయ రహదారి నెం 44 పై బలుసా వద్దనుంచి గుర్హ బెయిల్‌దరన్, హిరానగర్, గుర్హ బెయిల్‌దరన్, హీరానగర్‌నుంచి జాఖ్, విజయ్‌పూర్, జాక్, విజయపూర్‌నుంచి
ప్రధానమంత్రి రాట్లే, క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేస్తారు. 850 మెగావాట్ల రాట్లే జలవిద్యుత్‌ప్రాజెక్టు ను కిష్టవార్‌జిల్లాలోని చినాబ్ నదిపై నిర్మిస్తారు. దీనిని 5,300 కోట్ల రూపాయలతో నిర్మిస్తారు. 540 మెగావాట్ల క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ను కిష్టవార్ జిల్లాలో చీనాబ్‌నదిపై సుమారు 4500 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తారు. ఈ రెండు ప్రాజెక్టులు ఈ ప్రాంత విద్యుత్ అవసరాలను తీర్చనున్నాయి.
జమ్ముకాశ్మీర్ లో జన ఔషధి కేంద్రాల నెట్ వర్క్ ను మరింత విస్తృతం చేసేందుకు , నాణ్యమైన జనరిక్ మందులను అందుబాటు ధరలో ప్రజలకు చేరువ చేసేందుకు 100 కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు. వీటిని ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. ఈ కేంద్రాలు జమ్ము కాశ్మీర్ లోని మారుమూల ప్రాంతాలలో ఉన్నాయి. అలాగే ప్రధానమంత్రి పల్లిలో 500 కె.డబ్ల్యు సౌర విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. దీని ద్వారా దేశంలో కార్బన్ విడుదల లేని తొలి పంచాయతిగా ఇది పేరు నిలువనుంది.
ప్రధానమంత్రి స్వమిత్వ కార్డులను , ఈ పథకం కింద గల లబ్ధిదారులకు అందజేయనున్నారు. జాతీయ పంచాయతి రాజ్ దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో అవి సాధించిన కృషికి వివిధ విభాగాలలో ఇచ్చే అవార్డులకు సంబంధించి అవార్డులు గెలుపొందిన వారికి అవార్డు మొత్తాన్ని బదలాయించనున్నారు. ప్రధానమంత్రి ఇన్‌టాక్ ఫోటోగ్యాలరీని కూడా సందర్శిస్తారు. ఇది ఈప్రాంతంలోని, గ్రామీణ వారసత్వ సంపదను ప్రతిబింబించనున్నది. అలాగే గ్రామీణ ఎంటర్ ప్రెన్యుయర్‌షిప్ నమూనా అయిన నోకియా స్మార్ట్‌పూర్ ను సందర్శించనున్నారు. దేశంలో ఆదర్శ స్మార్ట్ విలేజ్ కింది దీనికి రూపకల్పన చేశారు.
అమృత్ సరోవర్ :
దేశంలో జలవనరుల పునరుద్ధరణ ఉద్దేశంతో ప్రధానమంత్రి , తన జమ్ము కాశ్మీర్ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి అమృత్ సరోవర్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇది దేశంలోని ప్రతి జిల్లాలో 75 అమృత్ సరోవరాలను పునరుద్ధరించేందుకు, అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించినది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద ప్రభుత్వం చేపడుతున్న మరో కార్యక్రమం ఇది.
ముంబాయి సందర్శించనున్న ప్రధానమంత్రి :
ప్రధానమంత్రి ఏప్రిల్ 24 ,2022 వతేదీ సాయంత్రం 5 గంటలకు ముంబాయిలో జరిగే మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ అవార్డుల బహుకరణ ఉత్సవంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డును స్వీకరిస్తారు. ఈ అవార్డును భారత రత్న లతా మంగేష్కర్ స్మృత్యర్థం ఏర్పాటు చేశారు.ఏటా ,దీనిని దేశనిర్మాణానికి విశేష కృషి చేసిన వ్యక్తికి బహుకరిస్తారు.