ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబరు 19వ, 20వ తేదీల లో గుజరాత్ ను సందర్శించి 15,670 కోట్ల రూపాయలు విలువ కలిగిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు ఆ పథకాలను దేశ ప్రజలకు అంకితం చేయనున్నారు.
ప్రధానమంత్రి డిఫ్ ఎక్స్ పో 22 ను అక్టోబరు 19వ తేదీ నాడు ఉదయం పూట ఇంచుమించు 9గంటల 45 నిమిషాలకు గాంధీనగర్ లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్, అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి సుమారు 12 గంటల వేళలో అదాలత్ లో మిషన్ స్కూల్స్ ఆఫ్ ఎక్స్లెన్స్ ను ప్రారంభిస్తారు. ఆయన మధ్యాహ్నం సుమారు 3 గంటల 15 నిమిషాలకు జూనాగఢ్ లో వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. తదనంతరం సాయంత్రం పూట దాదాపుగా 6 గంటల వేళలో రాజ్ కోట్ లో ఇండియన్ అర్బన్ హౌసింగ్ కాంక్లేవ్ 2022 ను ఆయన ప్రారంభిస్తారు. అలాగే అనేక కీలక పథకాలకు శంకుస్థాపన చేసి, దేశ ప్రజలకు అంకితం ఇస్తారు. ఆయన రాజ్ కోట్ లో దాదాపుగా రాత్రి 7 గంటల 20 నిమిషాలకు వినూత్నమైన నిర్మాణ పద్ధతులతో కూడిన ఒక ప్రదర్శనను కూడా ప్రారంభిస్తారు.
అక్టోబర్ 20వ తేదీ నాడు ఉదయం దాదాపుగా 9 గంటల 45 నిమిషాల వేళలో కేవడియాలో ప్రధానమంత్రి మిషన్ ఎల్ఐఎఫ్ఈ ని ప్రారంభించనున్నారు. మిట్ట మధ్యాహ్నం దాదాపుగా 12 గంటల వేళలో కేవడియాలో పదో హెడ్స్ ఆఫ్ మిషన్ కాన్ఫిరెన్స్ లో ప్రధానమంత్రి పాల్గొననున్నారు. అటు తరువాత మధ్యాహ్నం దాదాపుగా 3 గంటల 45 నిమిషాల వేళలో ఆయన వయారాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.
గాంధీ నగర్ లో ప్రధానమంత్రి
ప్రధానమంత్రి డిఫ్ ఎక్స్ పో 22 ను ప్రారంభిస్తారు. ‘పాత్ టు ప్రైడ్’ ఇతివృత్తంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ ఎక్స్ పోలో ఇంత వరకు ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో స్టాల్స్ ఇండియన్ డిఫెన్స్ ఎక్స్ పో లో కొలువుదీరబోతున్నాయి. మొట్టమొదటిసారిగా విదేశీ ఓఈఎమ్ లయొక్క భారతదేశ అనుబంధ సంస్థలు, భారతదేశంలో నమోదయిన కంపెనీ డివిజన్లు, భారతీయ కంపెనీతో జాయింట్ వెంఛర్ కలిగి ఉన్న ఎగ్జిబిటర్ లు సహా ప్రత్యేకంగా భారతీయ కంపెనీ కోసమే ఉద్దేశించిన రక్షణ సంబంధి ప్రదర్శనను ఇక్కడ ఏర్పాటుచేయడమైంది. ఈ కార్యక్రమం భారతదేశంలోని రక్షణ సంబంధిత తయారీ సామర్థ్యం ఏ మేరకు విస్తరించింది కళ్ళకు కట్టనుంది. ఈ ఎక్స్ పో లో ఒక ఇండియా ఫెవిలియన్ మరియు స్టేట్ పెవిలియన్లు ఏర్పాటు కానున్నాయి. ఇండియా పెవిలియన్ లో ప్రధానమంత్రి హిందూస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) రూపొందించిన స్వదేశీ శిక్షణ విమానం హెచ్ టిటి- 40 ని ఆవిష్కరించనున్నారు. ఈ విమానంలో సమకాలీన అత్యాధునిక వ్యవస్థలను జతపరచడంతో పాటుగా విమాన చోదకులకు స్నేహపూర్వకంగా ఉండేటటువంటి సదుపాయాలను కూడా దీనిలో అమర్చడమైంది.
ఇదే కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మిషన్ డిఫ్ స్పేస్ ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం లక్ష్యం ఏమిటి అంటే అది రక్షణ బలగాల కోసమని పరిశ్రమ మరియు స్టార్ట్ అప్స్ ల అండదండలతో అంతరిక్ష రంగానికి సంబంధించి వినూత్నమైన సొల్యూషన్స్ ను అభివృద్ధి పరచాలి అనేదే. ప్రధానమంత్రి గుజరాత్ లోని దీసా వాయు క్షేత్రానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఫార్వర్డ్ ఎయిర్ ఫోర్స్ బేస్ దేశంలో భద్రత పరమైన సంబంధమైన స్వరూపానికి ఒక అదనపు హంగును సంతరిస్తుంది.
ఈ ఎక్స్ పోలో ఇండియా - ఆఫ్రికా: అడాప్టింగ్ స్ట్రాటజీ ఫర్ సినర్గైజింగ్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కో ఆపరేషన్ ఇతివృత్తంతో జరిగే రెండో ఇండియా - ఆఫ్రికా డిఫెన్స్ డైలాగ్ కూడా చోటు చేసుకుంటుంది. రెండో ఇండియన్ ఓషన్ రీజియన్ + (ఐవోఆర్ +) కాంక్లేవ్ కూడా ఈ ఎక్స్ పోలోనిర్వహించడం జరుగుతుంది. ఇది శాంతి, వృద్ధి, స్థిరత్వం మరియు, సమృద్ధి లను ప్రధానమంత్రి యొక్క ‘సాగర్ (సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్) దృష్టి కోణానికి అనుగుణంగా ఐవోఆర్ + దేశాల పరమైన రక్షణ సహకారాన్ని వృద్ధి పరచడానికి ఒక సమగ్రమైన చర్చ జరిగేందుకు వేదికను సమకూర్చనుంది. ఈ ఎక్స్ పోలోనే మొట్టమొదటి సారిగా రక్షణ రంగం కోసం ఇన్వెస్టర్స్ మీట్ ను కూడా నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది వందకు పైగా స్టార్టప్ లు వాటి యొక్క నూతన ఆవిష్కరణలను మంథన్ 2022లో ప్రదర్శించేందుకు ఒక అవకాశాన్ని చేజిక్కించుకోనున్నాయి. అలాగే ఈ ఎక్స్ పోలో ఐడిఈఎక్స్ (ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్స్ లెన్స్ ) అనే రక్షణ రంగ సంబంధిత వినూత్నమైన కార్యక్రమం కూడా చోటుచేసుకొంటుంది. ఈ కార్యక్రమం బంధన్ పేరిట నిర్వహించే ఒక కార్యక్రమం ద్వారా 451భాగస్వామ్యాల్ని / ప్రారంభాలకు కూడా సాక్షిభూతం కానుంది.
ప్రధానమంత్రి అదాలజ్ లోని త్రిమందిర్ లో మిషన్ స్కూల్స్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను కూడా ప్రారంభించనున్నారు. ఈ మిషన్స్ ను మొత్తం 10 వేల కోట్ల రూపాయల వ్యయంతో రూపుదిద్దడమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి దాదాపుగా 4260 కోట్ల రూపాయల విలువ కలిగిన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఈ మిషన్ గుజరాత్ లో కొత్త తరగతి గదులు, స్మార్ట్ క్లాస్ రూంలు, కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు రాష్ర్టంలోని పాఠశాలలకు చెందిన మౌలిక సదుపాయాల సమగ్ర ఉన్నతీకరణకు తోడ్పడనుంది.
జూనాగఢ్ లో ప్రధానమంత్రి
ప్రధానమంత్రి దాదాపుగా 3580 కోట్ల రూపాయల విలువ కలిగిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.
కోస్తా తీర ప్రాంతాలలో హైవేల మెరుగుదల పనులు అలాగే మరికొన్ని లంకె రహదారుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టు యొక్క ఒకటో దశలో 13 జిల్లాల గుండా సాగేటటువంటి 270 కిలోమీటర్లకు పైబడిన హైవే రూపుదాల్చనుంది. ప్రధానమంత్రి జూనాగఢ్ లో రెండు నీటి సరఫరా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.
అంతేకాకుండా వ్యవసాయిక ఉత్పాదనలను నిలువ చేయడం కోసం ఉద్దేశించిన ఒక గిడ్డంగి భవనాల సముదాయ నిర్మాణానికి కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు. ప్రధానమంత్రి పోరుబందర్ లో మాధవ్ పూర్ కు చెందిన శ్రీ కృష్ణ రుక్షమందిర్ సమగ్ర అభివృద్ధికి గాను శంకుస్థాపన చేయనున్నారు. పోరుబందర్ ఫిషరీ హార్బర్ లో ఇసుక పూడికతీత పనులకు మరియు నీటి సరఫరా ఇంకా మురుగు పారుదల ప్రాజెక్టులకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. గీర్ సోమ్ నాథ్ లో రెండు ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులలో మధ్వాడ్ లో ఒక ఫిషింగ్ పోర్ట్ అభివృద్ధి పథకం కూడా ఒకటిగా ఉంది.
రాజ్ కోట్ లో ప్రధానమంత్రి
ప్రధానమంత్రి రాజ్ కోట్ లో దాదాపుగా 5860 కోట్ల రూపాయల విలువ కలిగిన ప్రాజెక్టులను దేశ ప్రజలకు అంకితం చేయడంతో పాటు శంకుస్థాపన కూడా చేయనున్నారు. ఆయన ఇండియా అర్బన్ హౌసింగ్ కాంక్లేవ్ 2022 ను కూడా ప్రారంభిస్తారు. ఈ కాంక్లేవ్ లో భారతదేశంలో గృహ నిర్మాణానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చోపచర్చలు జరుగనున్నాయి. వాటిలో భాగంగా ప్రణాళిక రచన, ఆకృతి, రూపకల్పన, నియమనిబంధనలు అమలు మరింత మన్నికను ఆవిష్కరించడం విధాన రూపకల్పన తదితర విషయాలు ప్రధానంగా ఉండబోతున్నాయి. సార్వజనిక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ప్రధానమంత్రి వినూత్న నిర్మాణ పద్ధతులపై ఏర్పాటయిన ఒక ప్రదర్శనను కూడా ప్రారంభిస్తారు.
సార్వజనిక కార్యక్రమంలో ప్రధానమంత్రి లైట్ హౌస్ ప్రాజెక్టు లో భాగంగా నిర్మాణం పూర్తి అయిన 1100 లకు పైగా ఇళ్ళను, ప్రజలకు అప్పగిస్తారు. ఈ గృహాల తాళంచెవులను కూడా లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది. బ్రహ్మణి -2 ఆనకట్ట నుండి నర్మదా కెనాల్ పంపిగ్ స్టేషన్ వరకు నిర్మించిన మోర్బి - బల్క్ పైప్ లైన్ ప్రాజెక్టును ఆయన ప్రజలకు అంకితం చేస్తారు. ఇది ప్రధానంగా ఒక నీటి సరఫరా పథకం. ప్రధానమంత్రి ద్వారా దేశ ప్రజలకు అంకితం కాబోయే ప్రాజెక్టులలో రీజినల్ సైన్స్ సెంటర్ , ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ లతో పాటు రహదారి రంగానికి సంబంధించిన ఇతర ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.
ప్రధానమంత్రి గుజరాత్ లో ఎన్ హెచ్ 27 లో భాగంగా ఉన్న రాజ్ కోట్ -గోండాల్-జేట్పూర్ సెక్షన్ ను నాలుగు దోవలు కలది కాస్తా ఆరు దోవలు కలిగి ఉండేదిగా విస్తరించే పనులకు శంకుస్తాపన చేయనున్నారు. ఆయన మోర్బీ, రాజ్ కోట్, బోతాద్, జామ్ నగర్ మరియు కచ్ లలో వేరువేరు స్థలాలలో దాదాపుగా 2950 కోట్ల రూపాయల విలువ కలిగిన జీఐడీసీ పారిశ్రామిక వాడల నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాకుండా గఢ్కాలో అమూల్ నుండి ముడిపదార్థాలు సరఫరా అయ్యేటటువంటి ఒక పాడి ఉత్పత్తుల ప్లాంటు కు, రాజ్ కోట్ లో ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణాకి, రెండు నీటి సరఫరా ప్రాజెక్టులకు మరియు రహదారులు ఇంకా రైల్వేల రంగానికి చెందినటువంటి ఇతర ప్రాజెక్టులకు సైతం శంకుస్థాపనలు జరుగనున్నాయి.
కేవడియాలో ప్రధానమంత్రి
ప్రధానమంత్రి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జెనరల్ శ్రీ ఆంటోనియో గటెర్రెస్ థెరిఫ్టర్ తో జరిగే ఒక ద్వైపాక్షిక సమావేశంలో పాలుపంచుకొంటారు. తదనంతరం ఐరాస సెక్రటరీ జనరల్ సమక్షంలో కేవడియాలోని ఏక్తా నగర్ లో గల ఏక్తా విగ్రహం వద్ద మిషన్ ఎల్ఐఎఫ్ఈని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి మదిలో రూపుదిద్దుకొన్న ఈ కార్యక్రమం భారతదేశం నాయకత్వంలో ప్రపంచం అంతటా అమలయ్యే ఒక సామూహిక ఉద్యమం అని చెప్పాలి. ఈ ఉద్యమం పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం వ్యక్తిగతంగానూ మరియు ఉమ్మడిగానూ తగిన కార్యాచరణను చేపట్టేందుకు స్ఫూర్తిని అందిచనుంది.
దీర్ఘకాలం మనుగడ సాధించే దిశలో మన సామూహిక వైఖరిలో తగిన మార్పులను తీసుకురావడం కోసం ఒక త్రిముఖ వ్యూహాన్ని అవలంభించేటట్లు చూడడమే మిషన్ ఎల్ఐఎఫ్ఈ ధ్యేయంగా ఉంది. ఒకటో దశలో భాగంగా వ్యక్తులకు వారి దైనందిన జీవనంలో సీదాసాదా గా ఉంటూనే ప్రభావశీలమైనటువంటి పర్యావరణ మైత్రీ పూర్వక కార్యాలను చేస్తూ ఉండేటట్లుగా వారిలో స్ఫూర్తిని నింపడం. రెండో దశలో మారుతున్న డిమాండ్ పట్ల మార్కెట్లు మరియు బజారులు శీఘ్రంగా ప్రతిస్పందించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించడం ఇక మూడో దశలో భాగంగా వినియోగం మరియు ఉత్పత్తి.. ఈ రెంటికీ సమర్థన లభించేటట్లుగా ప్రభుత్వాన్ని మరియు పారిశ్రామిక విధానాన్ని ప్రభావితం చేయడం.. ఈ మిషన్ ఉద్దేశాలలో ప్రధానమైనవి.
ప్రధానమంత్రి కేవడియాలో 2022 అక్టోబరు 20వ తేదీ మొదలుకొని 22వ తేదీ ల మధ్య విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయనున్న పదవ హెడ్స్ ఆఫ్ మిషన్స్ కాన్ఫరెన్స్ లో కూడా పాలుపంచుకోనున్నారు. ఈ సమావేశంలో ప్రపంచం నలుమూలల నుండి 118 ఇండియన్ మిషన్స్ యొక్క అధిపతులు (వీరిలో రాయబారులు మరియు హై కమిషనర్ లు ఉంటారు) పాలుపంచుకోనున్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 23 సదస్సులు జరుగుతాయి. వర్తమాన భౌగోళిక రాజకీయ ఆర్థిక స్థితిగతులు కనెక్టివిటి భారతదేశం విదేశాంగ విధాన ప్రాధన్యాలు మొదలైన అంశాలపై కూలంకషమైన ఆంతరంగిక చర్చలను చేపట్టడం కోసం ఈ సమావేశం ఒక అవకాశాన్ని అందించనుంది. మిషన్ ల ప్రధానాధికారులు ప్రస్థుతం తమతమ రాష్ట్రాలలో భారతదేశం యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమాల పట్ల మంచి అవగాహనను సాధించడం కోసం సందర్శనలో నిమగ్నమై ఉన్నారు. ఆ కార్యక్రమాలు ఏవేవీ అంటే ఆకాంక్ష యుక్త జిల్లాలు, ఒక జిల్లా ఒక ఉత్పాదన, అమృత్ సరోవర్ మిషన్ తదితర కార్యక్రమాలు ఉన్నాయి.
వయారాలో ప్రధానమంత్రి
ప్రధానమంత్రి 1970 కోట్ల రూపాయల పైచిలుకు విలువ కలిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు వయారాలో, తాపీలో శంకుస్థాపన చేయనున్నారు. సపుతారా నుండి ఏక్తా విగ్రహం వరకు రహదారిని మెరుగుపరచడంతో పాటు కొన్ని లంకె రహదారులను నిర్మించడానికి సంబంధించిన పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అలాగే శంకుస్థాపన జరుగనున్న ఇతర ప్రాజెక్టులలో తాపీ మరియు నర్మద జిల్లాలలోని 300 లకోట్ల రూపాయల పైచిలుకు విలువ కలిగిన నీటి సరఫరా పథకాలు కూడా కలిసి ఉన్నాయి.
Prime Minister Shri Narendra Modi will participate in the ‘Odisha Parba 2024’ programme on 24 November at around 5:30 PM at Jawaharlal Nehru Stadium, New Delhi. He will also address the gathering on the occasion.
Odisha Parba is a flagship event conducted by Odia Samaj, a trust in New Delhi. Through it, they have been engaged in providing valuable support towards preservation and promotion of Odia heritage. Continuing with the tradition, this year Odisha Parba is being organised from 22nd to 24th November. It will showcase the rich heritage of Odisha displaying colourful cultural forms and will exhibit the vibrant social, cultural and political ethos of the State. A National Seminar or Conclave led by prominent experts and distinguished professionals across various domains will also be conducted.