ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మే నెల 12వ తేదీ నాడు గుజరాత్ ను సందర్శించనున్నారు. ఉదయం పూట దాదాపు గా 10:30 గంటల వేళ లో గాంధీనగర్ లో జరిగే ‘అఖిల భారతీయ శిక్షా సంఘ్ అధివేశన్’ లో ప్రధాన మంత్రి పాల్గొంటారు. ఆ తరువాత, ఆయన గాంధీ నగర్ లోనే మధ్యాహ్నం 12 గంటల వేళ కు వివిధ ప్రాజెక్టుల ను ప్రారంభించడం తో పాటు శంకుస్థాపన కూడా చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ల విలువ దాదాపు గా 4400 కోట్ల రూపాయలు గా ఉంది. మధ్యాహ్నం ఇంచుమించు 3 గంటల వేళ కు గిఫ్ట్ సిటీ ని ప్రధాన మంత్రి సందర్శిస్తారు.
అభివృద్ధి పథకాల కు ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన
గాంధీ నగర్ లో ఏర్పాటైన ఒక కార్యక్రమం లో భాగం గా, 2450 కోట్ల రూపాయల కు పైగా విలువైన అభివృద్ధి పథకాల ను ప్రధాన మంత్రి ప్రారంభించడం తో పాటు శంకుస్థాపన కూడా చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల లో పట్టణాభివృద్ధి విభాగం, నీటి సరఫరా విభాగం, రహదారి మరియు రవాణా విభాగం, గనులు మరియు ఖనిజాల విభాగం ల ప్రాజెక్టు లు కూడా ఉన్నాయి.
ప్రారంభించనున్న ప్రాజెక్టుల లో బనాస్ కాంఠా జిల్లా లో అనేక గ్రామాల కోసం ఉద్దేశించినటువంటి త్రాగునీటి సరఫరా పథకాల సామర్థ్యాన్ని వృద్ధి చేయడం, అహమదాబాద్ లో నది ఫ్లై ఓవర్ బ్రిడ్జి, నరోదా జిఐడిసి లో మురుగునీటి సేకరణ సంబంధి నెట్ వర్క్, అహమదాబాద్ లో మరియు మహెసాణా లో మురుగు శుద్ధి ప్లాంటు లు, దహెగామ్ లో సభాభవనం తదితర పథకాలు ఉన్నాయి. శంకుస్థాపన జరుగనున్న ప్రాజెక్టుల లో జూనాగఢ్ జిల్లా లో బల్క్ పైప్ లైన్ ప్రాజెక్టు, గాంధీనగర్ జిల్లా లో నీటిసరఫరా పథకాల సామర్థ్యాన్ని వృద్ధి చేయడం, ఫ్లై ఓవర్ బ్రిడ్జి ల నిర్మాణం, జలాన్ని పంపిణీ చేసేందుకు స్థాపించిన నూతన కేంద్రం వంటి వాటితో పాటు వివిధ పట్టణ ప్రణాళిక సంబంధి రహదారులు కూడా ఉన్నాయి.
‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ (పిఎమ్ఎవై - గ్రామీణ మరియు పట్టణ) ప్రాజెక్టుల కు ప్రధాన మంత్రి ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేయనున్నారు. దీనితో పాటు, ఈ పథకం లో భాగం గా నిర్మాణం జరిగిన సుమారు 19,000 ఇళ్ళ తాలూకు ‘గృహ ప్రవేశం’ కార్యక్రమం లో కూడా ఆయన పాలుపంచుకొంటారు. ఈ కార్యక్రమం లో, పథకం లబ్ధిదారుల కు ఇళ్ళ తాళం చెవుల ను ప్రధాన మంత్రి అందజేస్తారు. ఈ ప్రాజెక్టు ల మొత్తం వ్యయం దాదాపు గా 1950 కోట్ల రూపాయలు గా ఉంది.
గిఫ్ట్ సిటీ లో ప్రధాన మంత్రి
గాంధీనగర్ లోని ‘గుజరాత్ ఇంటర్ నేశనల్ ఫైనాన్స్ టెక్-సిటీ’ (జిఐఎఫ్ టి సిటీ) ని ప్రధాన మంత్రి సందర్శిస్తారు. ఆయన తన సందర్శన క్రమం లో జిఐఎఫ్ టి సిటీ లో నిర్మాణాధీన ప్రాజెక్టుల స్థితి ని సమీక్షించనున్నారు. జిఐఎఫ్ టి ఐఎఫ్ఎస్ సి లో సభ్యత్వం కలిగివున్న సంస్థ ల ప్రతినిధుల తో ఒక సమావేశం ఏర్పాటైంది. ఈ కార్యక్రమం లో ఆ సంస్థల ప్రతినిధుల అనుభవాల ను మరియు గిఫ్ట్ సిటీ భావి ప్రణాళికల ను ప్రధాన మంత్రి అడిగి తెలుసుకొంటారు. ప్రధాన మంత్రి ఆ నగరం లోని కీలక మౌలిక సదుపాయాల ను కూడా సందర్శించనున్నారు, ఆ మౌలిక సదుపాయాలలో ‘అండర్ గ్రౌండ్ యుటిలిటీ టనల్’ ఇంకా ‘ఆటోమేటెడ్ వేస్ట్ కలెక్షన్ సెగ్రిగేశన్ ప్లాంట్’ లు ఉన్నాయి.
అఖిల్ భారతీయ శిక్షా సంఘ్ అధివేశన్
ఆల్ ఇండియా ప్రైమరీ టీచర్స్ ఫెడరేశన్ యొక్క 29వ ద్వైవార్షిక (ప్రతి రెండు సంవత్సరాల కు ఒక సారి జరిగేటటువంటి) సమావేశం ‘అఖిల్ భారతీయ శిక్షా సంఘ్ అధివేశన్’ లో ప్రధాన మంత్రి పాలుపంచుకోనున్నారు. ఈ సమావేశం యొక్క ఇతి వృ త్తం గా ‘టీచర్స్ ఆర్ ఎట్ ది హార్ట్ ఆఫ్ ట్రాన్స్ ఫార్మింగ్ ఎడ్ యుకేశన్’ (విద్య రంగం లో చోటు చేసుకొనే మార్పు లలో కేంద్ర స్థానం గురువుల దే) ఉండబోతోంది.