గుజ‌రాత్ పంచాయ‌త్ మ‌హాస‌మ్మేళ‌న్‌ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి ఈ కార్య‌క్ర‌మానికి రాష్ట్రంనుంచి హాజ‌రుకానున్న లక్ష‌మంది పంచాయ‌తి రాజ్ ప్ర‌తినిధులు
రాష్ట్రీయ ర‌క్షా విశ్వ‌విద్యాల‌యాన్ని దేశానికి అంకితం చేసి, తొలి స్నాత‌కోత్స‌వంలో ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి
పోలిసింగ్‌, నేరాల‌కు సంబంధించిన న్యాయ‌పాల‌న‌, క‌ర‌క్ష‌న‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ వంటి విభాగాల‌లో శిక్ష‌ణ‌పొందిన అత్యంత నాణ్య‌మైన మాన‌వ వ‌న‌రుల‌ను అవ‌స‌రాన్ని తీర్చేందుకు ఆర్ ఆర్ యు ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.
11 వ ఖేల్ మ‌హా కుంభ్ ప్రారంభాన్ని ప్ర‌క‌టించ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి
ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గారి దార్శ‌నిక నాయ‌క‌త్వంలో 2010 వ సంవ‌త్స‌రంలో వారు గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి గా ఉన్న‌ప్పుడు ప్రారంభ‌మైన ఖేల్ మ‌హాకుంభ్ గుజ‌రాత్‌లో క్రీడ‌ల వాతావ‌ర‌ణాన్ని విప్లవాత్మ‌కం చేసింది.

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2022 మార్చి 11-12 తేదీల‌లో గుజ‌రాత్ సంద‌ర్శిస్తారు. మార్చి 11 వ‌తేదీ సాయంత్రం 4 గంట‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి, గుజ‌రాత్ పంచాయ‌త్ మ‌హాస‌మ్మేళ‌న్ లో పాల్గొని వారి నుద్దేశించి ప్ర‌సంగిస్తారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి రాష్ట్రీయ ర‌క్షా యూనివ‌ర్సిటీ ( ఆర్ ఆర్ యు) ను మార్చి 12 ఉద‌యం 11 గంట‌ల‌కు జాతికి అంకితం చేస్తారు. అలాగే ఆర్.ఆర్‌.యు తొలి స్నాత కోత్స‌వంలో ముఖ్యఅతిథిగా ప్ర‌సంగిస్తారు. సాయంత్రం 6.30 గంట‌ల‌కు ప్ర‌ధాన‌మం్ర‌తి 11వ ఖేల్ మ‌హాకుంభ్ ప్రారంభ‌మైన‌ట్టు ప్ర‌క‌టిస్తారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఖేల్ మ‌హాకుంభ్ క్రీడాకారుల‌నుద్దేశించి ప్ర‌సంగిస్తారు.

గుజ‌రాత్ లో్ మూడంచెల పంచాయ‌తి రాజ్ వ్య‌వ‌స్థ ఉంది. ఇక్క‌డ 33 జిల్లా పంచాయ‌త్‌లు , 248 తాలూకా పంచాయ‌త్‌లు, 14,500 గ్రామ పంచాయ‌తి లుఉన్నాయి. గుజ‌రాత్‌పంచాయ‌త్ మ‌హాస‌మ్మేళ‌న్ : అప్న‌ గామ్‌, అప్న‌ గౌర‌వ్  కార్య‌క్ర‌మంలో సుమారు ల‌క్ష‌మంది ప్ర‌తినిధులు గుజ‌రాత్ లోని మూడు అంచెలుగా గ‌ల పంచాయ‌తి రాజ్ వ్య‌వ‌స్థ‌ల‌నుంచి పాల్గొన నున్నారు.
రాష్ట్రీయ ర‌క్షా యూనివ‌ర్సిటీ (ఆర్ ఆర్ యు)ను అత్యంత నాణ్య‌మైన శిక్ష‌ణ క‌లిగిన మాన‌వ వ‌న‌రుల‌ను పోలిసింగ్, క్ర‌మిన‌ల్ జ‌స్టిస్‌, క‌ర‌క్ష‌న‌ల్ ప‌రిపాల‌న రంగాల‌కు సంబంధించి అందించేందుకు నిర్దేశించిన‌ది. 2010లో ఏర్పాటైన ర‌క్షా శ‌క్తి యూనివ‌ర్సిటీని అప్ గ్రేడ్ చేసి జాతీయ పోలీసు యూనివ‌ర్సిటీని  రాష్ట్రీయ ర‌క్షా యూనివ‌ర్సిటీగా తీర్చిదిద్దారు.ఇది జాతీయ ప్రాధాన్య‌త క‌లిగిన విశ్వ‌విద్యాల‌యం. ఇది 2020 అక్టోబ‌ర్ నుంచి త‌న కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించింది. ఈ విశ్వ‌విద్యాల‌యం ప్రైవేటు రంగంతో కూడా క‌లిసి ప‌నిచేస్తుంది. ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన విజ్ఞానం, వ‌న‌రుల‌ను వినియోగించుకుంటూ , వివిధ రంగాల‌కు సంబంధించి సెంట‌ర్స్ ఆఫ్ ఎక్స‌లెన్స్‌ను పోలీసు, భ‌ద్ర‌త‌కు సంబంధించిన రంగాల‌లో ఏర్పాటు చేయ‌నుంది.

ఆర్ ఆర్‌యు, డిప్ల‌మా నుంచి డాక్ట‌రేట్ స్థాయివ‌ర‌కు వివిధ అక‌డ‌మిక్ ప్రోగ్రామ్ ల‌ను నిర్వ‌హిస్తుంది. పోలిసింగ్, అంత‌ర్జాతీయ భ‌ద్ర‌త‌, పోలిస్ సైన్స్‌, మేనేజ్‌మెంట్‌, క్రిమిన‌ల్ లా, జ‌స్టిస్‌, సైబ‌ర్ సైకాల‌జీ, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, కృత్రిమమేథ‌, నేర ద‌ర్యాప్తు, వ్యూహాత్మ‌క విష‌యాలు, అంత‌ర్గ‌త ర‌క్ష‌ణ‌, వ్యూహాలు, ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్‌, క్రీడ‌లు, కోస్తా, స‌ముద్ర భ‌ద్ర‌త‌, వంటి రంగాల‌లో ప్రోగ్రామ్‌ల‌ను నిర్వ‌హిస్తుంది. ప్ర‌స్తుతం ఈ విశ్వ‌విద్యాల‌యంలో 822 మంది విద్యార్థులు 18 రాష్ట్రాల‌నుంచి ఇందులో చ‌దువుకుంటున్నారు.


గుజ‌రాత్‌లో 2010లో ఖేల్ కుంభ్‌ను ప్రారంభించారు. నాడు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ శ్రీ న‌రేంద్ర మోదీ గారి దార్శ‌నిక‌త‌లో ఈ క్రీడాపోటీలు ప్రారంభ‌మ‌య్యాయి. 16 క్రీడ‌లు, 13 ల‌క్ష‌ల మంది ఈ ఖేల్ కుంభ్‌లో పాల్గొంటారు. ప్ర‌స్తుతం ఇందులో 36 సాధార‌ణ క్రీడ‌లు, 26 పారా క్రీడ‌లు ఉన్నాయి. 11వ ఖేల్ కుంభ్‌కు 45 ల‌క్ష‌ల మంది క్రీడాకారులు త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకున్నారు.
ఖేల్ మహాకుంభ్ గుజరాత్‌లోని క్రీడా వాతావ‌ర‌ణాన్ని విప్లవాత్మకంగా మార్చింది. వయోపరిమితి లేకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఒక నెల వ్యవధిలో వివిధ ఈవెంట్‌లలో పాల్గొనే వ్యక్తుల భాగస్వామ్యం ఇందులో క‌నిపిస్తుంది. ఇది కబడ్డీ, ఖో-ఖో, టగ్ ఆఫ్ వార్, యోగాసన, మల్లఖాంబ్ వంటి సాంప్రదాయ క్రీడలు , కస్కేటింగ్, టెన్నిస్ ,ఫెన్సింగ్ వంటి ఆధునిక క్రీడల  ఏకైక  సంగ‌మంగా ఇది రూపుదిద్దుకుంది. అట్టడుగు స్థాయిలో క్రీడల్లో ప్రతిభను గుర్తించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది.  ఇ గుజార్‌లో పారా స్పోర్ట్స్‌కు కూడా దీనితో ఊపందుకున్నాయి.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi