ద‌హోద్ లో ఆదిజాతి మ‌హా స‌మ్మేళ‌న్ కు హాజ‌రు కానున్న ప్ర‌ధాన‌మంత్రి; రూ.22,000 కోట్ల‌తో ప‌లు అభివృద్ధి ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న‌
జామ్ న‌గ‌ర్ లో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప్ర‌పంచ కేంద్రానికి శంకుస్థాప‌న చేయ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి; గాంధీన‌గ‌ర్ లో ప్ర‌పంచ ఆయుష్ ఇన్వెస్ట్ మెంట్, ఇన్నోవేష‌న్ కేంద్రం ప్రారంభోత్స‌వం
బ‌న‌స్ కాంత లోని దియోద‌ర్ లోని సంకుల్ ప్రాంతం వ‌ద్ద బ‌న‌స్ డెయిరీ వ‌ద్ద ప‌లు అభివృద్ధి ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న‌; జాతికి అంకితం
గాంధీన‌గ‌ర్ లో క‌మాండ్ అండ్ కంట్రోల్ కేంద్రం సంద‌ర్శించ‌నున్న ప్ర‌ధాన‌మంంత్రి

ఏప్రిల్ 18 నుంచి 20 తేదీల మ‌ధ్య‌న ప్ర‌ధాన‌మంత్రి గుజ‌రాత్ సంద‌ర్శిస్తున్నారు. 18వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌కు గాంధీన‌గ‌ర్ లో పాఠ‌శాల‌ల క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్  ను సంద‌ర్శిస్తారు. 19వ తేదీ ఉద‌యం 9.40కి బ‌న‌స్కాంత‌లోని దియోద‌ర్ లో సంకుల్ వ‌ద్ద బ‌న‌స్ డెయిరీకి శంకుస్థాప‌న చేసి ప‌లు అభివృద్ధి  ప్రాజెక్టుల‌ను జాతికి అంకితం చేస్తారు. మ‌ధ్యాహ్నం 3.30కి జామ్ న‌గ‌ర్  లో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ గ్లోబ‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ ట్రెడిష‌న‌ల్ మెడిసిన్ కు శంకుస్థాప‌న చేస్తారు. 20వ తేదీ ఉద‌యం 10.30కి గాంధీన‌గ‌ర్ లో గ్లోబ‌ల్ ఆయుష్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇన్నోవేష‌న్ స‌ద‌స్సును ప్ర‌ధాన‌మంత్రి ప్రారంభిస్తారు. మ‌ధ్యాహ్నం 3.30కి ద‌హోద్ లో జ‌రుగ‌నున్న ఆదిజాతి మ‌హా స‌మ్మేళ‌న్ లో పాల్గొన‌డంతో పాటు ప‌లు అభివృద్ధి ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న చేస్తారు.

పాఠ‌శాల‌ల క‌మాండ్ కంట్రోల్ కేంద్రం వ‌ద్ద ప్ర‌ధాన‌మంత్రి

18వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌కు గాంధీన‌గ‌ర్ లోని పాఠ‌శాలల క‌మాండ్‌, కంట్రోల్ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌ధాన‌మంత్రి సంద‌ర్శిస్తారు. ఈ కేంద్రం 500 పైగా పాఠ‌శాల‌ల్లోని గ‌ణాంకాల‌ను ఏటా సేక‌రించి బిగ్ డేటా అన‌లిటిక్స్, కృత్రిమ మేథ‌, మెషీన్ లెర్నింగ్  వంటి సాంకేతిక మాధ్య‌మాల‌ను ఉప‌యోగించుకుని  విద్యార్థుల అభ్యాస ఫ‌లితాల‌ను పెంచేందుకు దోహ‌ద‌ప‌డే విధంగా సిద్ధం చేస్తుంది. అలాగే రోజూ పాఠ‌శాల‌ల్లోఉపాధ్యాయులు, విద్యార్థుల ఆన్ లైన్ అటెండెన్స్ ట్రాక్ చేయ‌డంలోస‌హాయ‌ప‌డుతుంది. విద్యార్థుల అభ్యాస ఫ‌లితాలను నిర్దిష్ట గ‌డువులో, సంగ్ర‌హంగా ప‌రీక్షిస్తుంది. ఈ  క‌మాండ్‌, కంట్రోల్ ను అంత‌ర్జాతీయ అత్యుత్త‌మ ప్ర‌మాణాల కేంద్రంగా ప్ర‌పంచ‌బ్యాంకు గుర్తితంచ‌డంతో పాటు ఈ కేంద్రాన్ని సంద‌ర్శించి నేర్చుకోవాల‌ని ఇత‌ర దేశాల‌ను కూడా ఆహ్వానిస్తుంది.

బ‌న‌స్కాంతలోని దియోద‌ర్ లో సంకుల్ వ‌ద్ద బన‌స్ డెయిరీలో ప్ర‌ధాన‌మంత్రి

బ‌న‌స్కాంత జిల్లాలోని దియోద‌ర్ వ‌ద్ద రూ.600 కోట్ల పెట్టుబ‌డితో నిర్మించిన కొత్త డెయిరీ స‌ముదాయాన్ని, బంగాళాదుంప‌ల   ప్రాసెసింగ్ ప్లాంట్ ను ప్ర‌ధాన‌మంత్రి జాతికి అంకితం చేస్తారు. ఇది పూర్తిగా కొత్త ప్రాజెక్టు. ఇది రోజువారీ 30 ల‌క్ష‌ల లీట‌ర్ల పాలు ప్రాసెసింగ్ చేయ‌డంతో పాటు 80 ట‌న్నుల వెన్న‌, ఒక ల‌క్ష లీట‌ర్ల ఐస్ క్రీమ్‌, 20 ట‌న్నుల కండెన్స్ డ్ పాటు (ఖోయా), 6 ట‌న్నుల చాకొలేట్ త‌యారుచేస్తుంది. ఇందులోని బంగాళాదుంప‌ల ప్రాసెసింగ్ ప్లాంట్ ఫ్రెంచ్ ఫ్రైస్‌, పొటాటో చిప్స్, ఆలూ టిక్కీ, పాటీలు వంటి ప‌లు బంగాళా దుంప‌ల ప్రాసెస్డ్  ఉత్ప‌త్తులు త‌యారుచేస్తుంది. వాటిలో చాలా ఇత‌ర దేశాల‌కు ఎగుమ‌తి అవుతాయి. ఈ ప్లాంట్లు స్థానిక రైతుల‌ను సాధికారం చేయ‌డంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ఉత్తేజితం చేస్తాయి.

బ‌న‌స్ క‌మ్యూనిటీ రేడియో స్టేష‌న్ ను ప్ర‌ధాన‌మంత్రి జాతికి అంకితం చేస్తారు. రైతుల‌కు వ్య‌వ‌సాయం, ప‌శుపోష‌ణ సంబంధిత కీల‌క‌మైన శాస్ర్తీయ స‌మాచారం అందించేందుకు ఈ క‌మ్యూనిటీ రేడియో స్టేష‌న్ ఏర్పాటు చేశారు. 1700 పైగా గ్రామాల‌కు చెందిన 5 ల‌క్ష‌ల మందికి పైగా రైతుల‌ను ఈ రేడియో స్టేష‌న్ అనుసంధానం చేస్తుందని భావిస్తున్నారు.

పాల‌న్ పూర్ ప్లాంట్ లో చీజ్ ఉత్ప‌త్తుల చీజ్ ఉత్ప‌త్తుల త‌యారీ కేంద్రం విస్త‌ర‌ణ స‌దుపాయాలు ప్ర‌ధాన‌మంత్రి జాతికి అంకితం చేస్తారు. గుజ‌రాత్ లోని దామాలో  నిర్మించిన ఆర్గానిక్ ఎరువులు, బ‌యోగ్యాస్ ప్లాంట్ ను జాతికి అంకితం చేస్తారు.

ఖిమామా, ర‌త‌న్ పురా-భిల్డి, రాధ‌న్ పూర్‌, తావ‌ర్ ల‌లో నిర్మించ‌నున్న‌ 100 ట‌న్నుల సామ‌ర్థ్యం గ‌ల నాలుగు గోబ‌ర్ గ్యాస్ ప్లాంట్ల‌కు ప్ర‌ధాన‌మంత్రి శంకుస్థాప‌న చేస్తారు.

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సాంప్ర‌దాయిక వైద్య‌ ప్ర‌పంచ కేంద్రం

జామ్ న‌గ‌ర్ లో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేస్తున్న ప్ర‌పంచ సాంప్ర‌దాయిక వైద్య కేంద్రానికి (జిసిటిఎం) 19వ తేదీ మ‌ధ్యాహ్నం 3.30కి మారిష‌న్ ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌వింద్ కుమార్ జ‌గ‌న్నాథ్‌, ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ డైరెక్ట‌ర్‌-జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ టెడ్రోస్ ఘెబ్రెయీస‌స్ స‌మ‌క్షంలో ప్ర‌ధాన‌మంత్రి శంకుస్థాప‌న చేస్తారు. ప్ర‌పంచంలో సాంప్ర‌దాయిక వైద్యానికి ఏకైక ప్ర‌పంచ శ్రేణి కేంద్రం జిసిటిఎం. ఇది ప్ర‌పంచ వెల్ నెస్ కు అంత‌ర్జాతీయ కేంద్రంగా నిలుస్తుంది.

గ్లోబ‌ల్ ఆయుష్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇన్నోవేష‌న్ స‌ద‌స్సు

గుజ‌రాత్ లోని గాంధీన‌గ‌ర్ లో మ‌హాత్మామందిర్ లో జ‌రుగ‌నున్న ప్ర‌పంచ ఆయుష్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇన్నోవేష‌న్ స‌ద‌స్సును 20వ తేదీ ఉద‌యం 10.30 గంట‌ల‌కు మారిష‌స్ ప్ర‌దాన‌మంత్రి, ప్రపంచ ఆరోగ్య సంస్థ డిజి స‌మ‌క్షంలో ప్ర‌ధాన‌మంత్రి ప్రారంభిస్తారు. మూడు రోజుల పాటు జ‌రిగే ఈ స‌ద‌స్సులో 5 ప్లీన‌రీ సెష‌న్లు, 8 రౌండ్ టేబుల్ స‌మావేశాలు, 6 వ‌ర్క్ షాపులు, 2 సింపోజియంలు జ‌రుగుతాయి. 90 మంది ప్ర‌ముఖ వ‌క్త‌లు, 100 మంది ఎగ్జిబిట‌ర్లు ఇందులో పాల్గొంటారు. ఈ స‌ద‌స్సు పెట్టుబ‌డుల సామ‌ర్థ్యాన్ని వెలుగులోకి తేవ‌డంతోపాటు ఇన్నోవేష‌న్‌, ప‌రిశోధ‌న & అభివృద్దికి ఉత్తేజం ఇచ్చి, స్టార్ట‌ప్ వ్య‌వ‌స్థ‌, వెల్ నెస్ ప‌రిశ్ర‌మ అభివృద్ధికి దోహ‌ద‌ప‌డుతుంది. ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు, విద్యావేత్త‌లు, స్కాల‌ర్లు అంద‌రికీ ఒక వేదిక‌పైకి తెచ్చి భ‌విష్య‌త్ స‌హ‌కారానికి ఆల‌వాలంగా నిలుస్తుంది.

ద‌హోద్ లోని ఆదిజాతి మ‌హాస‌మ్మేళ‌న్ లో ప్ర‌ధాన‌మంత్రి

20వ తేదీ మ‌ధ్యాహ్నం 3.30కి ప్ర‌ధానమంత్రి ద‌హోద్ లో జ‌రుగునున్న ఆదిజాతి మ‌హాస‌మ్మేళ‌న్ కు హాజ‌రై రూ.22,000 కోట్ల పెట్టుబ‌డితో చేప‌డుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న చేస్తారు. 2 ల‌క్ష‌ల మందికి పైగా ఈ స‌మ్మేళ‌న్ ను వీక్షిస్తార‌ని అంచ‌నా.

రూ.1,400 కోట్ల‌కు పైగా విలువ గ‌ల ప్రాజెక్టుల‌ను ప్ర‌ధాన‌మంత్రి ప్రారంభిస్తారు. రూ.840 కోట్ల‌తో న‌ర్మ‌దా న‌దిపై నిర్మించిన ద‌హోద్ జిల్లా ద‌క్షిణ ప్రాంతీయ నీటి స‌ర‌ఫ‌రా ప‌థ‌కాన్ని ప్ర‌ధాన‌మంత్రి ప్రారంభిస్తారు. ద‌హోద్ జిల్లాలోని 280 గ్రామాలు, దేవ‌గ‌ఢ్ బ‌రియా న‌గ‌రం నీటి అవ‌స‌రాలు ఇది తీర్చుతుంది. అలాగే ద‌హోద్ స్మార్ట్ సిటీకి చెందిన రూ.335 కోట్ల విలువ గ‌ల ఐదు ప్రాజెక్టుల‌ను ప్ర‌ధాన‌మంత్రి ప్రారంభిస్తారు. వాటిలో ఇంటిగ్రేటెడ్ క‌మాండ్ అండ్ కంట్రోల్ సెంట‌ర్ (ఐసిసిసి) భ‌వ‌నం, తుపాను నీటి డ్రైనేజి వ్య‌వ‌స్థ‌, మురుగునీటి పారుద‌ల వ‌స‌తులు, ఘ‌న వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ‌, వాన నీటి సంర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ ఉన్నాయి. ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న ప‌థ‌కం కింద ద‌హోద్ జిల్లాలో 10,000 మంది గిరిజ‌నుల‌కు రూ.120 కోట్ల ప్ర‌యోజ‌నాలు అంద‌చేస్తారు.

66 కెవి ఘోడియా స‌బ్ స్టేష‌న్‌, పంచాయ‌తీ ఇళ్లు, అంగ‌న్ వాడీలు కూడా ప్ర‌ధాన‌మంత్రి ప్రారంభించ‌నున్న వాటిలో ఉన్నాయి. ద‌హోద్ లో 9000 హెచ్ పి విద్యుత్ లోకోమోటివ్ ల త‌యారీ కేంద్రానికి కూడా ప్ర‌ధానంమంత్రి శంకుస్థాప‌న చేస్తారు. ఈ ప్రాజెక్టు వ్య‌యం సుమారు రూ.20,000 కోట్లు.1926లో స్టీమ్ లోకోమోటివ్ ల ఓవ‌ర్ హాల్ కేంద్రంగా ఏర్పాటైన ద‌హోద్ వ‌ర్క్ షాప్ ను మౌలిక వ‌స‌తుల మెరుగుద‌ల ద్వారా విద్యుత్ లోకోమోటివ్  ల త‌యారీ యూనిట్ గా అప్ గ్రేడ్ చేస్తారు. ఇది 10,000 మందికి పైగా ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్య‌క్ష, ప‌రోక్ష ఉద్యోగావ‌కాశాలు క‌ల్పిస్తుంది.  అలాగే రూ.550 కోట్ల  పెట్టుబ‌డితో రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌డుతున్న వివిధ ప్రాజెక్టుల‌కు కూడా ప్ర‌ధాన‌మంత్రి శంకుస్థాప‌న చేస్తారు. వీటిలో రూ.300 కోట్ల విలువ గ‌ల నీటి స‌ర‌ఫ‌రా ప్రాజెక్టులు, రూ.175 కోట్ల పెట్టుబ‌డితో చేప‌డుతున్న ద‌హోద్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, దుధిమ‌తి రివ‌ర్ ప్రాజెక్టు ప‌నులు, ఘోడియాలో గెట్కో స‌బ్ స్టేష‌న్ ఉన్నాయి.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi