సుమారు రూ. 12,100 కోట్ల విలువైన అనేక అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన , ఆ పథకాలను జాతికి అంకితం చేయనున్న ప్రధాని
ఏఐఐఎమ్ఎస్, దర్భంగా కు శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి;
దీంతో ఆ ప్రాంతంలో ఆరోగ్య సంబంధిత మౌలిక సదుపాయాలకు ఊతం
రహదారి మార్గాల ప్రాజెక్టుల, రైలు మార్గ ప్రాజెక్టుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ
గొట్టపు మార్గం ద్వారా సహజ వాయు సరఫరాకు ఏర్పాట్లు; స్వచ్ఛ ఇంధనం చేరవేత వ్యవస్థను పటిష్టపరచే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 13న బీహార్ లో పర్యటించనున్నారు. ఈ నెల 13న ఉదయం దాదాపు 10 గంటల 45 నిమిషాలకు ఆయన బీహార్ లోని దర్భంగాకు చేరుకొని, సుమారు రూ. 12,100 కోట్ల విలువైన అనేక అభివృద్ధి పథకాలను ప్రారంభించి వాటిని జాతికి అంకితం చేయడమే కాకుండా కొన్ని పథకాలకు శంకుస్థాపన కూడా చేస్తారు.

 

 

బీహార్‌లో ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాల కల్పనకు ఊతాన్ని అందించే దిశలో, రూ.1260 కోట్ల పైచిలుకు విలువ కలిగిన అఖిల భారత వైద్య విజ్ఞ‌ానశాస్త్ర సంస్థ (ఎయిమ్స్), దర్భంగా నిర్మాణ పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఎయిమ్స్ లో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని, ఆయుష్ బ్లాకును, వైద్య కళాశాలను, నర్సింగ్ కళాశాలను, రాత్రి బస చేయడానికి ఉద్దేశించిన వసతి సదుపాయాన్ని, నివాస భవన సముదాయాన్ని, తదితర హంగులను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎయిమ్స్ మూడో అంచె ఆరోగ్య సంరక్షణ సేవలను బీహార్ ప్రజలకు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు అందించనుంది.

 

 

 

రహదారులు, రైలు మార్గాల రంగాలలో కొత్త ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం ద్వారా బీహార్‌లో సంధానాన్ని పెంచడంపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొంటూ ఈ ప్రాజెక్టులను చేపడుతున్నారు. ఇంచుమించు రూ.5,070 కోట్ల విలువైన అనేక జాతీయ రహదారి ప్రాజెక్టులను బీహార్‌లో ప్రధాని ప్రారంభించడంతో పాటు వాటిలో కొన్నింటికి శంకుస్థాపన చేయనున్నారు.

 

ప్రధానమంత్రి 327ఇ నంబరు జాతీయ రహదారిలో భాగం అయిన నాలుగు దోవలతో కూడిన గాల్‌గలియా - అరారియా సెక్షనును ప్రారంభించనున్నారు. ఈ కారిడార్ ఈస్ట్-వెస్ట్ కారిడారో (జాతీయ రహదారి ‘ఎన్ హెచ్’-27)లో అరారియా నుంచి పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్ లోని గాల్‌గలియా వరకు ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. 322వ నంబరు జాతీయ రహదారి, 31వ నంబరు జాతీయ రహదారి మార్గాలలో రెండు రైల్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్ఓబీ) లను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. 110వ నంబరు జాతీయ రహదారి మార్గంలో ఒక ప్రధాన వంతెనను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. బంధుగంజ్ లో నిర్మించిన ఈ వంతెన జహానాబాద్ ను బిహార్‌శరీఫ్ తో కలుపుతుంది.  

 

ఎనిమిది జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. వాటిలో రాంనగర్ నుంచి రోసేరా వరకు ఉండే పక్కా రోడ్డు తో పాటు రెండు దోవలతో కూడిన రోడ్డు నిర్మాణ పనులు, బీహార్ - పశ్చిమ బెంగాల్ సరిహద్దు నుంచి ఎన్‌హెచ్-131ఏ లో భాగంగా మణిహారీ సెక్షన్ నిర్మాణ పనులు, హాజీపూర్ నుంచి మహ్నార్, మొహియుద్దీన్ నగర్ ల మీదుగా బఛ్ వాడా వరకు, సర్వాన్ - చకాయీ సెక్షన్ పనులు కలిసి ఉన్నాయి. ఆయన ఎన్‌హెచ్ – 327ఈ లో రాణిగంజ్ బైపాస్, అలాగే ఎన్‌హెచ్ 333ఏ లో కటోరియా, లఖ్‌పురా, బాంకా, ఇంకా పంజ్‌వారా బైపాస్, ఎన్‌హెచ్-82 నుంచి ఎన్‌హెచ్-33 వరకు నాలుగు దోవలతో కూడి ఉండే ఒక లింకు రోడ్డుకు కూడా శంకుస్థాపన చేయనున్నారు.

రూ.1740 కోట్లకు పైగా విలువైన రైల్వే ప్రాజెక్టులను దేశ ప్రజలకు అంకితం చేయడంతో పాటు, కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన కూడా చేస్తారు. బీహార్ లోని ఔరంగాబాద్ జిల్లాలో చిరాల్ పోతు నుంచి బాఘా బిష్ణుపూర్ వరకు రూ.220 కోట్లకు పైగా విలువైన సోన్‌నగర్ బైపాస్ రైల్వే లైనుకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు.

 

రూ.1520 కోట్లకు పైగా విలువైన రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టులలో ఝాంఝర్‌పూర్ – లౌకాహా బజార్ రైల్ సెక్షను, దర్భంగా బైపాస్ రైల్వే లైన్ గేజి మార్పిడి పనులు కలసి ఉన్నాయి. ఇవి దర్భంగా జంక్షన్ లో రైళ్ళ రాకపోకల రద్దీని కొంత తగ్గించనున్నాయి. రైలుమార్గాల డబ్లింగు ప్రాజెక్టులతో మెరుగైన ప్రాంతీయ అనుసంధానం అందుబాటులోకి రానుంది.

 

ఝాంఝర్‌పూర్ - లౌకాహా బజార్ సెక్షన్ లో రైలు సర్వీసులకు ప్రారంభ సూచక ఆకుపచ్చ జెండాను కూడా చూపెడతారు. ఈ సెక్షనులో ఎమ్ఈఎమ్ యూ (‘మెమూ’) రైలు సర్వీసులను ప్రారంభం అయితే చుట్టుపక్కల పట్టణాలలో, నగరాలలో ఉద్యోగాలు చేసుకొనే వారికి, విద్యార్థులకు, ఆసుపత్రులకు వెళ్ళివచ్చే వారికి ప్రయాణం సులభతరం అవుతుంది.

 

దేశం నలుమూలల వివిధ రైల్వే స్టేషన్ లలో ఏర్పాటు చేసిన 18 ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాలను శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు అంకితం చేయనున్నారు. ఈ కేంద్రాలు రైల్వే స్టేషన్ లలో ప్రయాణికులకు మందులను తక్కువ ధరలకు అందించనున్నాయి. అంతేకాకుండా, ప్రజలు జనరిక్ ఔషధాలను వినియోగించుకొనేలా వారికి అవగాహనను పెంచి, తద్ద్వారా ఆరోగ్య సంరక్షణకు అయ్యే ఖర్చును తగ్గించనున్నాయి.

 

పెట్రోలియమ్, సహజ వాయు రంగంలో రూ.4,020 కోట్లకు పైగా విలువైన అనేక నిర్మాణ పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. గొట్టపు మార్గాల ద్వారా సహజవాయువు (పీఎన్‌జీ)ని ప్రజలకు అందించడంతో పాటు వాణిజ్య రంగానికి, పారిశ్రామిక రంగానికి స్వచ్ఛమైన ఇంధన ప్రత్యామ్నాయాలను అందించాలన్న దార్శనికతకు అనుగుణంగా బీహార్ లోని ఐదు ప్రధాన జిల్లాలు.. దర్భంగా, మధుబని, సుపౌల్, సీతామఢీ, ఇంకా శివ్‌హర్.. లలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) నెట్‌వర్కును అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నెట్ వర్కును భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తున్నది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ బరౌనీ రిఫైనరీకి చెందిన బిట్యమిన్ తయారీ యూనిటుకు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఈ యూనిట్ మన దేశం బిట్యుమెన్ ను దేశీయంగా ఉత్పత్తి చేస్తూ, దేశం బిట్యుమిన్ కోసం దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడంలో తోడ్పడనుంది.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi