ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 వ సంవత్సరం ఫిబ్రవరి 3 వ తేదీ నాడు సాయంత్రం పూట 4:30 గంటల వేళ లో వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా కృష్ణగురు ఏక్ నామ్ అఖండ కీర్తన్ కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రపంచ శాంతి ని ఆకాంక్షిస్తూ అసమ్ లోని బార్ పేటా లో గల కృష్ణగురు సేవాశ్రమ్ లో ఏర్పా చేయడమైంది. ప్రధాన మంత్రి కృష్ణగురు సేవాశ్రమ్ యొక్క భక్త జనాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు కూడాను.
పరమగురు కృష్ణగురు ఈశ్వర్ 1974 వ సంవత్సరం లో కృష్ణగురు సేవాశ్రమ్ ను అసమ్ లోని బార్ పేటా లో గల నస్ తరా గ్రామం లో స్థాపించారు. ఆయన మహావైష్ణవ్ మనోహర్ దేవ్ యొక్క తొమ్మిదో వంశస్థుడు. కాగా, ఆయన గొప్ప వైష్ణవ సాధువు శ్రీ శంకరదేవ్ యొక్క అనుయాయి గానూ ఉండే వారు. ప్రపంచ శాంతి ని ఆకాంక్షిస్తూ కృష్ణగురు ఏక్ నామ్ అఖండ కీర్తన కార్యక్రమాన్ని జనవరి 6 వ తేదీ మొదలుకొని ఒక నెల రోజుల పాటు కొనసాగించే విధం గా కృష్ణగురు సేవాశ్రమ్ లో ఏర్పాటు చేయడమైంది.