ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘వన్ ఓశన్ సమిట్’ లో భాగం గా ఏర్పాటయ్యే ఒక ఉన్నతస్థాయి సదస్సు ను ఉద్దేశించి ఫిబ్రవరి 11వ తేదీన సుమారు 2:30 గంటల వేళ కు వీడియో సందేశం మాధ్యమంద్వారా ప్రసంగించనున్నారు. ఇదే కార్యక్రమం లో జర్మనీ, యునైటెడ్ కింగ్ డమ్, దక్షిణ కొరియా, జపాన్, కెనడా తదితర అనేక దేశాల అధినేత లుకూడా ప్రసంగిస్తారు.
‘వన్ ఓశన్ సమిట్’ ను ఫ్రాన్స్ ఫిబ్రవరి 9వ తేదీ మొదలుకొని 11వ తేదీ మధ్య ఫ్రాన్స్ లోని బ్రెస్త్నగరం లో ఈ శిఖర సమ్మేళనాన్ని ఐక్యరాజ్య సమితి మరియు ప్రపంచ బ్యాంకు ల సహకారం తోనిర్వహిస్తున్నది. మహా సాగర సంబంధి పర్యావరణ వ్యవస్థల ను ఆరోగ్యదాయకమైన విధం గాను, చిరకాలం మనుగడ లో ఉండే విధం గానుపరిరక్షించే దిశ లో ప్రత్యక్ష కార్యాచరణ కు నడుం కట్టేందుకు అంతర్జాతీయసముదాయాన్ని కూడగట్టాలి అనేది ఈ శిఖర సమ్మేళనం ఉద్దేశం గా ఉంది.