ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీ న రాత్రి 9:15 నిమిషాల వేళ కు న్యూ ఢిల్లీ లోని ఎర్రకోట లో జరుగనున్న శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ యొక్క 400వ ప్రకాశ్ పర్వ్ సూచక కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు. ఈ సందర్భం లో మంత్రి అక్కడ హాజరైన జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు; అలాగే ఒక స్మారక నాణేన్ని మరియు తపాలా బిళ్ళ ను కూడా ఆయన ఆవిష్కరిస్తారు.
భారత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని దిల్లీ సిఖ్ గురుద్వారా నిర్వహణ సంఘం సహకారం తో ఏర్పాటు చేస్తున్నది. రెండు రోజుల పాటు (ఏప్రిల్ 20వ తేదీ మరియు 21వ తేదీ లలో) జరిగే ఈ కార్యక్రమం లో భాగం గా దేశం లోని వివిధ ప్రాంతాల నుంచి రాగులు మరియు బాలలు ‘శబ్ద్ కీర్తన్’ లో పాలుపంచుకొంటారు. గురు తేగ్ బహాదుర్ జీ యొక్క జీవనాన్ని గురించి చాటిచెప్పేటటువంటి ఒక భవ్యమైన లైట్ ఎండ్ సౌండ్ శో కూడా ఉంటుంది. దీనికి అదనం గా, సిఖ్కుల సాంప్రదాయక యుద్ధ కళ ‘గత్ కా’ ను కూడా ప్రదర్శించడం జరుగుతుంది.
సిఖ్కుల తొమ్మిదో గురువు అయిన గురు తేగ్ బహాదుర్ జీ యొక్క ఉపదేశాల ను ప్రముఖం గా ప్రకటించడం పై ఈ కార్యక్రమం లో శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. గురు తేగ్ బహాదుర్ జీ ప్రపంచ చరిత్ర లో ధర్మం మరియు మానవీయ విలువలు, ఆదర్శాలు, సిద్ధాంతాల ను రక్షించడం కోసం తన జీవనాన్ని బలిదానం చేశారు. ఆయన ను మొగలాయి పాలకుడు ఔరంగజేబ్ హుకుం పై కశ్మీరీ పండితుల ధార్మిక స్వాతంత్య్రాని కి సమర్ధించినందుకు గాను చంపియేయడమైంది. గురు తేగ్ బహాదుర్ జీ పుణ్యతిథి ని ప్రతి సంవత్సరం లో నవంబర్ 24వ తేదీ నాడు ‘శహీదీ దివస్’ గా పాటించడం జరుగుతోంది. దిల్లీ లో గురుద్వారా సీస్ గంజ్ సాహిబ్ మరియు గురుద్వారా రకాబ్ గంజ్ లకు ఆయన పవిత్ర బలిదానం తో అనుబంధం ఉన్నది. ఆయన వారసత్వం ఈ దేశం కోసం సంఘీభావం తాలూకు ఒక మహా శక్తి రూపం లో వర్ధిల్లుతున్నది.