పరాక్రమ దివస్ సందర్బంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అండమాన్ నికోబార్దీవులలోని 21 దీవులకు , పరమవీర చక్ర అవార్డు పొందిన 21 మంది పేర్లను పెట్టే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం 2023 జనవరి 23న ఉదయం 11గంటలకు జరుగుతుంది.
వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధానమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి , నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపంలో నిర్మించనున్న నేతాజీ స్మారక నమూనాను ఆవిష్కరిస్తారు.
అండమాన్ నికోబార్ దీవులకు గల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని , నేతాజీ సుభాష్ చంద్ర బోస్ను గౌరవించుకుంటూ వారి స్మారకార్థం రాస్ దీవులను నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్గా 2018లో అక్కడికి వెళ్లిన సందర్భంగా ప్రధానమంత్రి నామకరణం చేశారు.
నీల్ ఐలండ్, హావ్లాక్ ఐలండ్లను కూడా సాహీద్ ద్వీప్, స్వరాజ్ ద్వీప్లుగా నామకరణం చేశారు.
మన దేశ నిజ జీవిత హీరోలను గౌరవించుకోవడానికి ప్రధానమంత్రి ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యత నిస్తూ వస్తున్నారు.
నిజ జీవిత హీరోల స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకుపోతూ, ఇప్పుడు అండమాన్ నికోబార్ దీవులలోని 21 దీవులకు 21 మంది పరమ వీర చక్ర అవార్డు పొందిన వీరుల పేర్లను పెట్టాలని నిర్ణయించారు.
పేరు పెట్టని పెద్ద దీవులకు మొదటి దానికి మొదటి పరమ వీర చక్ర అవార్డు పొందిన వారి పేరు, రెండవ పెద్ద దీవికి రెండవ పరమ వీర చక్ర అవార్డు పొందిన ఆరి పేరు ఇలా 21 దీవులకు 21 మంది పేర్లను పెడతారు.
ఇలా పరమ వీర చక్ర అవార్డు పొందిన వారి పేర్లు పెట్టడం వారికి మనమిచ్చే చిరకాల నివాళి. వీరిలో ఎంతో మంది దేశ సార్వభౌమత్వం, సమగ్రత పరిరక్షణకు తమ ప్రాణాలను త్యాగం చేసిన వారు.
ఈ దీవులకు 21 మంది పరమ వీర చక్ర అవార్డు పొందిన వీరుల పేర్లను ఇలా పెడతారు. వారి పేర్లు, మేజర్ సోమనాథ్ శర్మ,సుబేదార్ , హానరరీ కెప్టెన్ ( అప్పటి లాన్స్ నాయక్) కరమ్ సింగ్, ఎంఎం, రెండవ లెఫ్టినెంట
రామా రఘోబా రాణే, నాయక్ జాదునాథ్ సింగ్,కంపెనీ హవల్దార్ మేజర్ పీరూ సింగ్, కెప్టెన్ జి.ఎస్.సలారియా,
లెఫ్టినెంట్ కల్నల్ ( అప్పటి మేజర్) ధన్ సింగ్ థాపా, సుబాదార్ జోగిందర్ సింగ్, మేజర్ షాయితాన్ సింగ్, సి.క్యు.ఎం.హెచ్, అబ్దుల్ హమీద్, లెఫ్టినెంట్ కల్నల్ అర్దేషిర్ బుర్జోర్ జి తారాపోర్, లాన్స్ నాయక్ అల్ బర్ట్ ఎక్కా
మేజర్ హొషియార్ సింగ్, సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ క్షేత్రపాల్, ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్ జిత్ సింగ్ షెకాన్, మేజర్ రామస్వామి పరమేశ్వరన్, నాయిబ్ సుబేదార్ బాణా సింగ్, కెప్టెన్ విక్రం బత్రా, లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే,
సుబేదార్ మేజర్ ( అప్పటి రైఫిల్ మాన్ ) సంజయ్ కుమార్, సుబేదార్ మేజర్ రిటైర్డ్ ( హానరరీ కెప్టెన్ ) గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్.