ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 23 వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీలోని ఎర్రకోటవద్ద జరిగే పరాక్రమ దివస్లో పాల్గొంటారు. స్వాతంత్ర్యోద్యమంలో విశేషపాత్ర వహించిన ప్రముఖులను తగినవిధంగా గౌరవించుకుని వారిని స్మరించుకునేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ , దార్శనికతకు అనుగుణంగా , నేతాజీ సుభాష్చంద్రబోస్ జయంతిని 2021 నుంచి పరాక్రమ దివస్ గా పాటిస్తున్నారు..
ఈ కార్యక్రమం ఈ ఏడాది ఎర్రకోటలో జరుగుతోంది. ఈ ఉత్సవాలలో భారతీయ బహుముఖ సాంస్కృతిక వైభవాన్ని, చారిత్రక ఘట్టాలను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమాలలో భాగంగా నేతాజీ సుభాష్ చంద్ర బోస్, ఆజాద్ హింద్ ఫౌజ్ ఘన వారసత్వాన్ని ప్రతిబింబిచే ఘట్టాలను ప్రదర్శిస్తారు.నేతాజీకి , అజాద్ హింద్ ఫౌజ్ కు సంబంధించిన అరుదైన చిత్రాలు,డాక్యుమెంట్లు, నేతాజీ జివిత ముఖ్య ఘట్టాలను ప్రతిబింబించే లా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. జనవరి 31 వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. సందర్శకులు వీటిని తిలకించి దేశ ఘనవారసత్వాన్ని తెలుసుకోవచ్చు.ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి బారత్ పర్వ్ను కూడా ఆవిష్కరిస్తారు. ఇది కూడాజనవరి 23 నుంచి జనవరి 31 వరకు జరుగుతుంది. ఇందులో దేశ సుసంపన్న వైవిధ్యతతో పాటు రిపబ్లిక్ దినోత్సవం లో పాల్గొనే శకటాల ప్రదర్శన ఉంటుంది. సంస్కృతికి సంబంధించిన వస్తువుల ప్రదర్శన ఉంటుంది. 26 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, విభాగాలు, చేపడుతున్న పౌరకేంద్రిత కార్యక్రమాల గురించి కూడా ఇందులో ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శనను ఎర్రకోట ఎదురుగా ఉన్న రామ్ లీలా మైదాన్, మాధవ్ దాస్ పార్క్ లో ఏర్పాటు చేశారు.