న్యూఢిల్లీ ‘తాజ్ ప్యాలెస్’ హోటల్ లో రేపు సాయంత్రం ఆరున్నర గంటలకు ప్రారంభమయ్యే ‘కౌటిల్య ఆర్ధిక సదస్సు’ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగిస్తారు.
‘కౌటిల్య’ ఆర్థిక సదస్సు మూడో సంచిక అక్టోబర్ 4 నుంచి 6 వరకూ మూడు రోజుల పాటు కొనసాగుతుంది. హరిత వ్యవస్థ వైపు మళ్ళేందుకు ఆర్థిక సహకారం, భౌగోళిక ఆర్థిక పరమైన విభజనలు, వృద్ధి పై ఈ అంశాల ప్రభావం, బలమైన ఆర్థిక వ్యవస్థ కొనసాగేందుకు తగిన మార్గదర్శకాలతో కూడిన విధాన నిర్ణయాలు తదితర అంశాలపై ఈ దఫా సదస్సు దృష్టి సారిస్తుంది.
అనేక దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సులో, దేశ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధికి నోచుకోని ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాళ్ళు, అంశాలను భారత, అంతర్జాతీయ నిపుణులు, విధానకర్తలు చర్చిస్తారు.
కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ సహకారంతో ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్’ సంస్థ, కౌటిల్య ఆర్ధిక సదస్సును నిర్వహిస్తోంది.