ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అహమదాబాద్ లో 2022 డిసెంబర్ 14వ తేదీ నాడు సాయంత్రం 5:30 గంటల కు ప్రముఖ్ స్వామి మహారాజ్ శతాబ్ది మహోత్సవ్ తాలూకు ప్రారంభ కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు.

పరమ పూజనీయుడు ప్రముఖ్ స్వామి మహారాజ్ ఒక మార్గదర్శి మాత్రమే కాకుండా భారతదేశం అంతటా మరియు ప్రపంచ వ్యాప్తం గా అసంఖ్యాకుల జీవనం పై ప్రభావాన్ని ప్రసరించినటువంటి గురువు కూడాను. ఒక మహా ఆధ్యాత్మిక నేత గా ఆయన కు విస్తృతమైన ఆదరణ కు, అభిమానాని కి పాత్రుడు అయ్యారు. ఆయన తన జీవనాన్ని ఆధ్యాత్మిక వాదాన్ని సేవించడానికి మరియు మానవ జాతి కి సమర్పణం చేసివేశారు. బిఎపిఎస్ స్వామినారయణ్ సంస్థ నాయకుని గా ఆయన అనేక సాంస్కృతిక కార్యక్రమాల కు, సామాజిక కార్యక్రమాల కు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల కు ప్రేరణ ను ఇచ్చి, లక్షల కొద్దీ ప్రజల కు సంరక్షణ ను అందించారు.

హెచ్ హెచ్ ప్రముఖ్ స్వామి మహారాజ్ శత జయంతి సంవత్సరం లో, ప్రపంచం లో అనేక దేశాల ప్రజలు ఆయన జీవనాన్ని మరియు ఆయన ప్రయాసల ను ఒక ఉత్సవం గా జరుపుకొంటున్నారు. ప్రపంచం అంతటా ఏడాది పొడవునా సాగిన ఉత్సవాలు బిఎపిఎస్ స్వామినారాయణ్ సంస్థ ప్రపంచ వ్యాప్త ప్రధాన కార్యాలయం నెలకొన్న శాహీబాగ్ లోని బిఎపిఎస్ స్వామినారాయణ్ మందిర్ ఆధ్వర్యం లో నిర్వహించేటటువంటి ‘ప్రముఖ్ స్వామి మహారాజ్ శతాబ్ది మహోత్సవ్’ తో ముగియనున్నాయి. ఈ మహోత్సవ్ ను ఒక నెల రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. అహమదాబాద్ లో 2022 డిసెంబర్ 15వ తేదీ మొదలుకొని 2023 జనవరి 15వ తేదీ వరకు ప్రతి రోజూ జరిపే కార్యక్రమాలు, ప్రత్యేక ఇతివృత్తం తో కూడిన ప్రదర్శన లు, ఆలోచనల ను రేకెత్తించేటటువంటి మండపాల వంటివి ఈ మహోత్సవ్ లో చోటు చేసుకోనున్నాయి.

బిఎపిఎస్ స్వామినారాయణ్ సంస్థ ను శాస్త్రీజీ మహారాజ్ 1907వ సంవత్సరం లో స్థాపించారు. వేద ప్రబోధాల పై ఆధారపడి మరి ఆచరణాత్మక ఆధ్యాత్మిక వాదం తాలూకు మూలస్తంభాల దన్ను తో స్థాపించిన బిఎపిఎస్ నేటి కాలం లో సామాజికం గా, నైతికం గా, ఆధ్యాత్మికం గా ఎదురవుతున్నటువంటి సవాళ్ళ ను పరిష్కరించడం కోసం విరివి గా పాటుపడుతున్నది. విశ్వాసం, ఏకత్వం మరియు స్వార్థ రహితమైన సేవ అనే విలువల ను కాపాడడం బిఎపిఎస్ ధ్యేయం గా ఉంది. అలాగే జీవనం లో అన్ని రంగాల కు చెందిన ప్రజల యొక్క ఆధ్యాత్మికమైన అవసరాల, సాంస్కృతికపరమైన అవసరాల, భౌతిక అవసరాల మరియు భావోద్వేగ భరిత అవసరాల ను తీర్చడం కోసం బిఎపిఎస్ తన వంతు కృషి ని చేస్తున్నది. ప్రపంచ వ్యాప్త సంపర్కం మరియు ప్రయాస ల ద్వారా ఈ సంస్థ మానవతాపూర్వక కార్యకలాపాల ను సైతం భుజానికి ఎత్తుకొంటున్నది.

 

  • sidhdharth Hirapara February 07, 2024

    Jay Swaminarayan
  • Sanjay Zala December 24, 2022

    🎉🌹🎊 Believed In A Best Wishes Of A Over All In A _ 'WORLDWIDE' Cosponsored On A _ Addresses Of A 'Hon ble' PRADHAN SEVAK In A. 'Swami' _ NARAYAN Gurukul _ Onwards A 75Th' Years Of A _ Amut Mahotshav In A _ Rajkot ( Gujarat ) VIA Video Conference On A. 🎊🌹🎉
  • Sanjay Zala December 22, 2022

    🙏🙏 'My' _ I _ Help You 🙏🙏
  • Sanjay Zala December 21, 2022

    🎉🌹🎊 Believed In A Best Wishes Of A Over All In A _ 'WORLDWIDE' Cosponsored On A Likely On A _ 'UNESCO' Attach 02 A Notes If One India S _ 'VADNAGAR' & Sun ( TEMPLES ) MODHERA Behand In A 'World' _ "HARITAGE" Site & Hub Place Declaration & Declare About At The. 🎊🌹🎉
  • Sanjay Zala December 20, 2022

    🧘🏿‍♂️🧘‍♀️ Asking In A Best Wishes Of A Over All In A _ 'WORLDWIDE' Cosponsored On A _ Make & Made In India Under At The. Likely In A _ Aatmanirbhar & Shwanirbhar Given At The. 'Hon ble' PRADHAN SEVAK Absolutely In A. 🧘‍♀️🧘🏿‍♂️
  • DEBASHIS ROY December 20, 2022

    bharat mata ki joy
  • Sanjay Zala December 19, 2022

    🎊🌹🎉 Making In A Best Wishes Of A Over All In A _ 'WORLDWIDE' Cosponsored On A _ Sab Ka Vishwas & Shyoge @ Help If A _ Support Onwards Of A. Vishwas Given On A In 02 The _ 'Village' Behand _ 'PEOPLE'S' On A. 🎉🌹🎊
  • Sanjay Zala December 18, 2022

    🏏🏏 Remembers In A Best Wishes Of A Over All In A. _ 'WORLDWIDE' Cosponsored On Tnx & SALUTE @ Happy Believed At The Proud 02 A 03Rd' ( Third ) T - 20 ( Twenty ) MENS Cricket _ World Cup Win Of A. 🏏🏏
  • Sanjay Zala December 15, 2022

    🇮🇳\/🇮🇳 Satya MAEVE JAYNTE 🇮🇳\/🇮🇳
  • Nithin December 14, 2022

    jayshriram
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Have patience, there are no shortcuts in life: PM Modi’s advice for young people on Lex Fridman podcast

Media Coverage

Have patience, there are no shortcuts in life: PM Modi’s advice for young people on Lex Fridman podcast
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister attends Raisina Dialogue 2025
March 17, 2025

The Prime Minister, Shri Narendra Modi today attended Raisina Dialogue 2025 in New Delhi.

The Prime Minister, Shri Modi wrote on X;

“Attended the @raisinadialogue and heard the insightful views of my friend, PM Christopher Luxon.

@chrisluxonmp”