జపాన్ పూర్వ ప్రధాని శ్రీ శింజో ఆబే ఆధికారిక అంత్యక్రియల లో పాలుపంచుకోవడం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టోక్యో కు ఈ రోజు రాత్రి బయలుదేరి వెళ్ళనున్నారు.
ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో -
‘‘నాకు ప్రియమైన ఓ మిత్రుడు మరియు భారతదేశం-జపాన్ మైత్రి కోసం కృషి చేసిన ఒక గొప్ప విజేత అయినటువంటి పూర్వ ప్రధాని శ్రీ శింజో ఆబే యొక్క ఆధికారిక అంత్యక్రియల లో పాలుపంచుకోవడం కోసం నేను నేటి రాత్రి టోక్యో కు బయలుదేరి వెళుతున్నాను’’
‘‘భారతీయులు అందరి పక్షాన శ్రీమతి ఆబే కు మరియు ప్రధాని శ్రీ కిశిదా కు నేను హృదయపూర్వక సంతాపాన్ని వ్యక్తం చేయనున్నాను. శ్రీ ఆబే శాన్ దర్శించిన విధం గా భారతదేశం-జపాన్ సంబంధాల ను మరింత గా బలపరచడం కోసం మనం కృషి చేయడాన్ని కొనసాగిద్దాం. @kishida230’’ అని పేర్కొన్నారు.
I am traveling to Tokyo tonight to participate in the State Funeral of former PM Shinzo Abe, a dear friend and a great champion of India-Japan friendship.
— Narendra Modi (@narendramodi) September 26, 2022