సంధానాన్ని పెంచే, భవిష్యత్తు కై సన్నద్ధం గా ఉండేటటువంటి విమానయాన రంగాన్ని సిద్ధం చేసే దిశ లో ప్రధానమంత్రి దృష్టి కోణాని కి అనుగుణం గా ఈ విమానాశ్రయం ఉంది
భారతదేశం లో అయిదు అంతర్జాతీయ విమానాశ్రయాల ను కలిగి ఉండే ఒకేరాష్ట్రం గా ఉత్తర్ ప్రదేశ్ అవుతుంది
ఒకటో దశ నిర్మాణ పనులు 2024 కల్లా పూర్తి కాగలవు
మొట్టమొదటిసారిగా భారతదేశం లో ఒక ఇంటిగ్రేటెడ్ మల్టి-మాడల్ కార్గో హబ్ తో కూడిన ఒక విమానాశ్రయాన్ని నిర్మించాలనే భావన రూపుదిద్దుకొంది
ఈ విమానాశ్రయం భారతదేశం లోని ఉత్తర ప్రాంతాని కి లాజిస్టిక్స్ పరంగా ప్రవేశద్వారం కానున్నది; అదీకాక గ్లోబల్ లాజిస్టిక్స్ చిత్రపటం లో ఉత్తర్ ప్రదేశ్ స్థానాన్ని సంపాదించుకోవడం లో సహాయకారి కానున్నది
పారిశ్రామిక ఉత్పత్తుల నిరంతరాయ రాకపోకల సౌకర్యాన్ని ఈ విమానాశ్రయం అందించడం ద్వారా, ఈ ప్రాంతం లో పారిశ్రామిక వృద్ధి ని వేగం గా పెంచడం లో కీలక పాత్ర ను పోషించగలదు
మల్టి-మాడల్ సీమ్ లెస్ కనెక్టివిటీ తాలూకు ఏర్పాటు అనేది ఈవిమానాశ్రయం తాలూకు ఓ కీలకమైన అంశం
ఇదిభారతదేశం లో ఎలాంటి ఉద్గారాల కు తావు ఇవ్వని తొలి విమానాశ్రయం కానుంది

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ 2021 నవంబర్ 25 న మధ్యాహ్నం ఒంటి గంట వేళ లో ఉత్తర్ప్రదేశ్ లో నోయెడా ఇంటర్ నేశనల్ ఎయర్ పోర్ట్ (ఎన్ఐఎ) కు గౌతమ్ బుద్ధ నగర్ పరిధిలోని జేవర్ లో శంకుస్థాపన చేయనున్నారు. దీనితోఉత్తర్ ప్రదేశ్ భారతదేశం లో అయిదు అంతర్జాతీయ విమానాశ్రయాల ను కలిగి ఉండేటటువంటిఒకే రాష్ట్రం కానున్నది.

సంధానాన్ని పెంపొందించడం తోపాటు విమానయాన రంగాన్ని రాబోయే కాలం అవసరాల ను నెరవేర్చే విధం గా తీర్చిదిద్దే దిశలో ప్రధాన మంత్రి యొక్క దార్శనికత కు అనుగుణం గా ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధిపరచడం జరుగనుంది.  ఈ భవ్యమైన దృష్టి కోణం తాలూకు ప్రత్యేకమైనశ్రద్ధ ఉత్తర్ ప్రదేశ్ పైన ఉంది. ఉత్తర్ ప్రదేశ్ లో ఇటీవల కుశీనగర్ విమానాశ్రయం ప్రారంభంజరిగింది.  మరో పక్క అయోధ్య లో ఓ అంతర్జాతీయవిమానాశ్రయం నిర్మాణ పనులు కొనసాగుతూ ఉన్నాయి. వీటితో పాటు ఈ రాష్ట్రం లో అనేకకొత్త అంతర్జాతీయ విమానాశ్రయాల ను అభివృద్ధి చేయడం జరుగుతోంది.

దిల్లీ ఎన్ సిఆర్ ప్రాంతం లోరూపుదిద్దుకోబోయే రెండో అంతర్జాతీయ విమానాశ్రయం గా ఈ విమానాశ్రయం ఉంటుంది.  దీని తో ఐజిఐ ఎయర్ పోర్ట్ పై ఒత్తిడి ని తగ్గించడం లో సహాయం లభిస్తుంది.  ఇది వ్యూహాత్మకం గా కొలువుదీరినటువంటిది. దిల్లీ, నోయెడా, గాజియాబాద్, అలీగఢ్, ఆగ్ రా, ఫరీదాబాద్ లతో సహా పట్టణప్రాంత ప్రజలకు, పరిసర ప్రాంతాల కు సేవల ను అందించగలుగుతుంది.

ఈ విమానాశ్రయం ఉత్తర భారతదేశంతాలూకు లాజిస్టిక్స్ పరమైన ప్రవేశద్వారం కానున్నది.  ఇదితన విస్తృత పరిమాణం, సామర్ధ్యం ల కారణం గా ఉత్తర్ప్రదేశ్ ను ఒక మేలు మలుపు తిప్పివేయగలుగుతుంది.  అదిప్రపంచాని కి ఉత్తర్ ప్రదేశ్ యొక్క సామర్ధ్యాన్ని గురించి చాటి చెబుతుంది.  అంతేకాకుండా రాష్ట్రాన్నిగ్లోబల్ లాజిస్టిక్స్ మేప్ లో నిలబెట్టడం లో తోడ్పడనుంది.  మొట్టమొదటిసారి గా భారతదేశం లో ఒక ఇంటిగ్రేటెడ్ మల్టి మాడల్ కార్గో హబ్ కలిగినటువంటిఒక విమానాశ్రయానికి రూపు దిద్దడమైంది.  అక్కడ లాజిస్టిక్స్సంబంధి ఖర్చులను మరియు సమయాన్ని తగ్గించడం పైన పూర్తి శ్రద్ధ ను వహించడం జరుగనున్నది.  డెడికేటెడ్ కార్గో టర్మినల్ కు 20లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం ఉంటుంది.  ఈసామర్ధ్యాన్ని పెంచి 80లక్షల మెట్రిక్ టన్నుల కు విస్తరించడం జరుగుతుంది. పారిశ్రామిక ఉత్పత్తుల కునిరంతరాయ రాకపోక ల సౌకర్యాన్ని  కలుగజేయడం ద్వారా ఈవిమానాశ్రయం ఈ ప్రాంతం లోకి పెద్ద ఎత్తున పెట్టుబడుల ను  ఆకర్శించడం లోను, పారిశ్రామిక వృద్ధి గతి ని పెంచడం లోను, స్థానికఉత్పత్తుల ను జాతీయ బజారుల కు, అంతర్జాతీయబజారుల కు చేరవేయడం లోను ఒక కీలక పాత్ర ను పోషించనుంది.  దీనితో కొత్త వాణిజ్య సంస్థల కు  మరిన్ని అవకాశాలులభిస్తాయి. భారీ సంఖ్య లో ఉద్యోగ అవకాశాలు సైతం ఏర్పడుతాయి.

ఈ విమానాశ్రయం ఒక గ్రౌండ్ ట్రాన్స్ పోర్టేశన్ సెంటర్ను అభివృద్ధి చేయడం జరుగుతుంది.  దానిలో ఒక మల్టి- మాడల్ ట్రాన్సిట్ హబ్ యే కాకుండా మెట్రో,  హై-స్పీడ్ రైల్ వే తాలూకు స్టేశన్ లు ఉంటాయి; టాక్సీ సేవ లు, బస్సు సేవ లు, ప్రైవేటు వాహనాల ను నిలిపి ఉంచేందుకు సదుపాయం వంటివి ఉంటాయి. ఈ విధం గా విమానాశ్రయంరోడ్డు, రైలు, మెట్రో ల తో నేరు గా కలవడం లో యోగ్యత ను అందుకోగలదు. ఎలాంటిఇబ్బందుల కు తావు ఉండనటువంటి మెట్రో సర్వీసు ద్వారా నోయిడా ను మరియు దిల్లీ ని  జోడించడం జరుగుతుంది.  సమీప ప్రాంతాల లోని అన్ని ప్రముఖ మార్గాల ను, యమునా ఎక్స్ ప్రెస్- వే, వెస్ట్రన్ పెరిఫరల్ఎక్స్ ప్రెస్- వే, ఈస్టర్న్ పెరిఫరల్ఎక్స్ ప్రెస్- వే, దిల్లీ-ముంబయి ఎక్స్ప్రెస్- వే ల వంటి రాజమార్గాలు, ఇంకా ఇతర మార్గాలను కూడా ఈవిమానాశ్రయాని కి కలపడం జరుగుతుంది.  ఈవిమానాశ్రయాన్ని ప్రతిపాదిత దిల్లీ-వారాణసీ హై స్పీడ్ రైల్ తో కూడా కలిపే పథకమంటూ కూడామరొక పథకం ఉంది. దీని ద్వారా దిల్లీ కిమరియు విమానాశ్రయాని కి మధ్య ప్రయాణానికి 21 నిమిషాలే పడుతుంది.

ఈ విమానాశ్రయం లో అత్యాధునికఎమ్ఆర్ఒ (మేంటనన్స్, రిపేర్, ఓవర్ హాలింగ్) సర్వీసు కూడా ఉంటుంది.   విమానాశ్రయం నమూనా నురూపొందించడం లో నిర్వహణ ఖర్చు లు తక్కువ గా ఉండేటట్టు, ప్రయాణికుల రాక పోక లు నిరంతరాయంగాను, వేగవంతమైనవి గాను ఉండేటట్టు తగినజాగ్రతలు తీసుకోవడం పట్ల శ్రద్ధ వహించడం జరిగింది.  ఈవిమానాశ్రయం లో టర్మినల్ కు దగ్గరగానే విమానాల ను నిలిపి ఉంచే సదుపాయం ఏర్పాటుఅవుతుంది, అదే స్థానం నుంచి దేశీయ విమానాల, లేదా అంతర్జాతీయ విమానాల నిర్వహణ లో వాయు సేవలు సులభతరం గా ఉండాలన్నదే దీనిఉద్దేశ్యం గా ఉంది. ఈ కారణం గా విమానాశ్రయంలో విమానాలు త్వరగా వాటి పని లో నిమగ్నం కాగలుగుతాయి; ప్రయాణికుల కు రాక పోకలలోఎలాంటి అంతరాయాలు గాని, ఆలస్యం గాని తలెత్తవన్న మాట. ఇది భారతదేశం లోకెల్లా మొదటి నెట్జీరో ఎమిశన్స్ ఎయర్ పోర్ట్ కానున్నది.  విమానాశ్రయంఒక ప్రత్యేక భూభాగాన్ని కేటాయించింది; ప్రాజెక్టు స్థలం నుంచి తొలగించే మొక్కల ను ఆప్రత్యేకమైనటువంటి భూభాగం లో ఉంచడం జరుగుతుంది. ఈ విధం గా ఆ భూమి భాగాన్ని అడవితోకూడిన పార్కు గా మలచడం జరుగుతుంది.  ఎన్ఐఎ అక్కడినుంచి అన్ని మూల జంతువుల సంరక్షణ బాధ్యత ను స్వీకరిస్తుంది. విమానాశ్రయాన్నినిర్మించే కాలం లో ప్రకృతి ని పరిరక్షించడం పట్ల పూర్తి శ్రద్ధ ను తీసుకోవడంజరుగుతుంది.

విమానాశ్రయం ఒకటో దశ ను 10,050 కోట్ల రూపాయల కు పైగా ఖర్చుతో అభివృద్ధి పరచడం జరుగుతుంది.  ఇది 1300 హెక్టేర్ల పైగా విస్తీర్ణం లోనెలకొని ఉంది. ఒకటో దశ పూర్తి అయిన తరువాతవిమానాశ్రయం సంవత్సరం లో సుమారు గా 1.2కోట్ల మంది ప్రయాణికుల కు సేవల ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.  మరి, ఈ విమానాశ్రయం తాలూకుపనులు 2024 వ సంవత్సరం కల్లాపూర్తి చేయాలి అని నిర్దేశించుకోవడం జరిగింది. దీనినిఅంతర్జాతీయ వేలం దారు జ్యూరిఖ్ ఎయర్ పోర్ట్ ఇంటర్ నేశనల్ ఎజి ఒక కన్ సెశనేర్ గా నిర్మించనుంది.  ఒకటో దశ కు సంబంధించిన మైదాన పనులు, అంటే భూమి సేకరణ ప్రక్రియ తో పాటు ప్రభావితకుటుంబాల పునరావాసాన్ని ఈసరికే ముగించడమైంది. 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi