ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఐఐఎమ్ సంబల్ పుర్ శాశ్వత కేంపస్ కు జనవరి 2 న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేయనున్నారు.
ఈ కార్యక్రమం లో కేంద్ర మంత్రులు శ్రీ రమేశ్ పోఖ్ రియాల్ ‘నిశంక్’, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, శ్రీ ప్రతాప్ చంద్ర సారంగీ లతో పాటు ఒడిశా గవర్నరు, ఒడిశా ముఖ్యమంత్రి లు కూడా పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి అధికారులు, పరిశ్రమ సారథులు, విద్యావేత్తలు, ఐఐఎమ్ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఫేకల్టి సహా 5000 కు పైగా ఆహ్వానితులు వర్చువల్ పద్థతి లో హాజరు కానున్నారు.
ఐఐఎమ్ సంబల్ పుర్ ను గురించి
ఐఐఎమ్ సంబల్ పుర్ మొట్టమొదటి సారి గా ఫ్లిప్ డ్ క్లాస్ రూమ్ ఆలోచన ను అమలులోకి తెచ్చిన ఐఐఎమ్. మౌలిక భావనల ను గురించి డిజిటల్ పద్ధతి లో నేర్చుకోవడం, పరిశ్రమ నుంచి లైవ్ ప్రాజెక్ట్ స్ సాయం తో తరగతి లో అనుభవపూర్వకంగా జ్ఞానాన్ని ఆర్జించడం అనేవి ఫ్లిప్ డ్ క్లాస్ రూమ్ ప్రత్యేకతలు. ఈ విద్యాసంస్థ ఎమ్ బిఎ (2019-21) బ్యాచ్ లో 49 శాతం విద్యార్థినులు, ఎమ్ బిఎ 2020-22 బ్యాచ్ లో 43 శాతం విద్యార్థినుల తో అత్యధిక జెండర్ డైవర్సిటీ పరంగా అన్ని ఇతర ఐఐఎమ్ ల పైన పైచేయి ని కూడా సాధించింది.