ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బిహార్ లో 14,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన తొమ్మిది హైవే ప్రాజెక్టులకు 2020 సెప్టెంబర్ 21న సోమవారం వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేయనున్నారు.
శ్రీ నరేంద్ర మోదీ బిహార్ లోని మొత్తం 45,945 గ్రామాల ను ఆప్టికల్ ఫైబర్ ఇంటర్ నెట్ సేవల తో కలిపే ప్రాజెక్టు ను కూడా ప్రారంభిస్తారు.
హైవే ప్రాజెక్టులు
ఈ తొమ్మిది హైవే ప్రాజెక్టుల లో భాగం గా సుమారు 350 కిలోమీటర్ల పొడవైన రోడ్ల ను 14,258 కోట్ల ఖర్చు తో నిర్మించడం జరుగుతుంది.
బిహార్ అభివృద్ధి కి బాటను వేస్తూ, ఈ రోడ్లు ఉత్తమమైన సంధానాన్ని, అనుకూలతను అందించి, రాష్ట్ర ఆర్థిక వృద్ధి కి అండదండలను అందిస్తాయి. ప్రజల రాకపోకలు, సరకు రవాణా సైతం, ప్రత్యేకించి ఇరుగుపొరుగు రాష్ట్రాలైన ఝార్ ఖండ్, ఉత్తర్ ప్రదేశ్ లతో, చెప్పుకోదగ్గ విధం గా మెరుగుపడతాయి.
ప్రధాన మంత్రి బిహార్ లో మౌలిక సదుపాయాలను అర్థవంతంగా అభివృద్ధి చేయడానికి ఒక ప్రత్యేక ప్యాకేజీ ని 2015 వ సంవత్సరం లో ప్రకటించారు. 54,700 కోట్ల రూపాయల విలువ చేసే 75 ప్రాజెక్టులు ఈ ప్యాకేజీ లో భాగం గా ఉన్నాయి. వీటిలో 13 ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తి అయ్యాయి; 38 ప్రాజెక్టుల పనులు పురోగతిలో ఉన్నాయి; మిగతా ప్రాజెక్టులు డిపిఆర్/బిడ్డింగ్/మంజూరు దశల్లో ఉన్నాయి.
ఈ ప్రాజెక్టులు పూర్తి అయితే బిహార్ లోని అన్ని నదులపై 21వ శతాబ్ద ప్రత్యేకతలకు తులతూగే వంతెనలు అమరుతాయి. అంతేకాక, అన్ని ప్రధాన జాతీయ రహదారులు వెడల్పాటివి గా రూపు దిద్దుకోవడంతో పాటు పటిష్టం గా కూడా అవుతాయి.
ప్రధాన మంత్రి ప్యాకేజీ లో భాగం గా, గంగా నది పైన మొత్తం వంతెనల సంఖ్య 17 కు చేరుకోనుంది. వీటి లేన్ కెపాసిటీ 62 గా ఉంటుంది. ఈ పద్ధతిలో, రాష్ట్రం లో నదుల మీద సగటున ప్రతి 25 కిలోమీటర్ల కు ఒక వంతెన ఏర్పడుతుందన్న మాట.
ఈ ప్రాజెక్టుల్లో-
1149.55 కోట్ల రూపాయల ఖర్చు తో ఎన్ హెచ్-31 లోని బఖ్తియార్ పుర్-రజౌలీ సెక్షన్ ను 47.23 కిలోమీటర్ల మేర 4 దోవలు కలిగివుండేది గా తీర్చిదిద్దే పని,
ఇదే ఎన్ హెచ్-31 లోని బఖ్తియార్ పుర్-రజౌలీ సెక్షన్ సెక్షన్ లో 2650.76 కోట్ల ఖర్చు తో 50.89 కి.మీ. మేర సైతం 4 దోవలు కలిగివుండేది గా తీర్చిదిద్దే పని,
ఇపిసి పద్ధతిన 885.41 కోట్ల రూపాయల వ్యయం తో ఎన్ హెచ్-30 లోని ఆరా-మోహనియా సెక్షన్ లో 54.53 కి.మీ. మేర 4 దోవలు కలిగివుండేది గా తీర్చిదిద్దే పని,
అలాగే ఇపిసి పద్ధతిన ఇదే ఎన్ హెచ్-30 లోని ఆరా-మోహనియా సెక్షన్ లో 855.93 కోట్ల రూపాయల వ్యయం తో 60.80 కి.మీ. మేర 4 దోవలు కలిగివుండేది గా తీర్చిదిద్దే పని,
హెచ్ఎఎమ్ పద్ధతిన 2288 కోట్ల రూపాయల ఖర్చు తో ఎన్ హెచ్-131ఎ లోని నరేన్ పుర్- పూర్ణియా సెక్షన్ లో 49 కి.మీ. మేర 4 దోవలు కలిగివుండేది గా తీర్చిదిద్దే పని,
ఇపిసి పద్ధతిన 913.15 కోట్ల రూపాయల ఖర్చు తో ఎన్ హెచ్-131జి లోని పట్నా- రింగ్ రోడ్డు (కాన్హౌలీ-రాం నగర్) కు చెందిన 39 కి.మీ. మేర 6 దోవలు కలిగివుండేది గా తీర్చిదిద్దే పని,
2926.42 కోట్ల రూపాయల వ్యయం తో 14.5 కి.మీ. పొడవుండే ఒక కొత్త 4 దోవల వంతెన ను (ఇప్పుడు ఉన్న ఎం జి సేతు కు సమాంతరంగా) పట్నా వద్ద ఎన్ హెచ్-19 లో గంగానది కి అటు నుంచి ఇటు చేరే దారులతో నిర్మించడం,
ఇపిసి పద్ధతిన 1478.40 కోట్ల రూపాయల ఖర్చు తో ఎన్ హెచ్-106 లో కోసీ నది కి అటు నుంచి ఇటు 28.93 కి.మీ. పొడవు ఉండే ఒక కొత్త 4 దోవల వంతెన (దీనిలో 2 దారులతో కూడిన భాగం కలిసి ఉంటుంది) ని నిర్మించడం తో పాటు
1110.23 కోట్ల రూపాయల ఖర్చు తో ఎన్ హెచ్ -131బి లో గంగా నది కి అటు నుంచి ఇటు 4.4445 కిలోమీటర్ల పొడవుండే ఒక కొత్త 4 దోవల వంతెన (ఇప్పుడు ఉన్న విక్రమశిల సేతు కు సమాంతరం గా) ని నిర్మించడం అనేవి –