ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బుందేల్‌ఖండ్ ఎక్సెప్రెస్ వే కు చిత్రకూట్ లో 2020వ సంవత్సరం ఫిబ్రవరి 29వ తేదీ న శంకుస్థాపన చేయనున్నారు.
భారత ప్రభుత్వం 2018వ సంవత్సరం ఫిబ్రవరి లో ప్రకటించిన ఉత్తర్ ప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడోర్ తాలూకు నోడ్స్ కు ఈ ఎక్స్ ప్రెస్ వే అనుబంధం గా ఉంటుంది.
బుందేల్‌ఖండ్ ఎక్స్ ప్రెస్ వే ను ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఈ ఎక్స్ ప్రెస్ వే చిత్రకూట్, బాందా, హమీర్ పుర్ మరియు జాలౌన్ జిల్లా ల గుండా సాగుతుంది. ఈ ఎక్స్ ప్రెస్ వే బుందేల్ ఖండ్ ప్రాంతాన్ని ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్ ప్రెస్ వే మరియు యమునా ఎక్స్ ప్రెస్ వే ల మీదుగా జాతీయ రాజధాని ఢిల్లీ కి జోడిస్తుంది. అంతేకాదు, ఈ ఎక్స్ ప్రెస్ వే బుందేల్‌ఖండ్ ప్రాంతం యొక్క అభివృద్ధి లో ఒక కీలకమైన పాత్ర ను కూడా పోషిస్తుంది.
296 కిలో మీటర్ల పొడవున సాగే ఈ ఎక్స్ ప్రెస్ వే చిత్రకూట్, బాందా, మహోబా, హమీర్ పుర్, జాలౌన్, ఔరైయా మరియు ఇటావా జిల్లాల కు లబ్ధి ని చేకూర్చుతుందని ఆశిస్తున్నారు.
భారతదేశాని కి భూతల వ్యవస్థ లు, నౌకలు, జలాంతర్గాములు, యుద్ధ విమానాలు, హెలీకాప్టర్ లు, ఆయుధాలు మరియు సెన్సర్ ల వరకు విస్తృతమైన రక్షణ పరికరాల ఆవశ్యకత ఎంతయినా ఉంది. వీటికి 2025వ సంవత్సరం కల్లా 250 బిలియన్ యుఎస్ డాలర్లకు పైగానే ఖర్చవుతుంది.
ఆ ఆవశ్యకతల ను తీర్చే క్రమం లో ప్రభుత్వం డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడోర్ ను ఉత్తర్ ప్రదేశ్ లో ఏర్పాటు చేయనున్నట్లు 2018వ సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీ నాడు లఖ్‌నవూ లో ఇన్వెస్టర్స్ సమిట్ జరిగిన సందర్భం లో ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం మొదట ఆరు నోడ్స్ ను గుర్తించడం ద్వారా ఈ కారిడోర్ ను ఏర్పాటు చేయాలని తలపెట్టింది. ఈ ఆరు నోడ్స్ లో లఖ్‌నవూ, ఝాన్సీ, చిత్రకూట్, అలీగఢ్, కాన్ పుర్, ఆగ్ రా ఉన్నాయి. వీటి లో రెండు నోడ్స్ ను బుందేల్‌ఖండ్ ప్రాంతం లోని ఝాన్సీ లో మరియు చిత్రకూట్ లో నెలకొల్పుతున్నారు.
నిజాని కి అతి పెద్ద క్లస్టర్ ను ఝాన్సీ లో స్థాపిస్తారు. సాగుబడి పనులు జరుగకుండా ఉన్నటువంటి భూమి ని చిత్రకూట్ లోను, ఝాన్సీ లోను కొనుగోలు చేయడమైంది. దీని ద్వారా ఈ ప్రాంతాని కి చెందిన పేద రైతులు లాభపడ్డారు.
ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేశన్స్ (ఎఫ్‌పిఒ స్) కు నాంది
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అదే రోజు న చిత్రకూట్ లో దేశవ్యాప్తం గా 10,000 పార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేశన్స్ ను కూడా ప్రారంభించనున్నారు.
దేశం లో దాదాపు 86 శాతం రైతులు చిన్న మరియు సన్నకారు రైతులే. సగటు భూ కమతాల విస్తీర్ణం 1.1 హెక్టేర్ కన్నా తక్కువగా ఉంది. ఈ చిన్న, సన్నకారు రైతులు మరియు భూమి లేని రైతులు వ్యవసాయ ఉత్పాదన కాలం లో భారీ సవాళ్ళ ను ఎదుర్కొంటున్నారు. ఈ సవాళ్ళ లో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, తగినంత నిధులు మరియు సాంకేతిక విజ్ఞానం లభ్యత వంటివి ఉన్నాయి. వారు ఆర్థిక శక్తి లోపం కారణం గా వారి యొక్క దిగుబడి ని సరిగా మార్కెట్ చేసుకోవడం లోనూ అనేక సవాళ్ళ కు ఎదురొడ్డవలసి వస్తోంది.
ఈ విధమైన సమస్యల ను పరిష్కరించుకొనేందుకు చిన్న, సన్నకారు రైతులు మరియు భూమి లేని రైతుల ను సమీకరించడం లో, తద్వారా వారికి ఉమ్మడి శక్తి ని ఇవ్వడం లో ఎఫ్‌పిఒ లు సహాయకారి గా ఉంటాయి. ఎఫ్‌పిఒ సభ్యులు ఉత్తమమైన సాంకేతిక విజ్ఞానం, పనిముట్లు, ఆర్థిక సహాయం మరియు మార్కెటింగ్ ల తాలూకు మెరుగైన అందుబాటు సౌలభ్యాన్ని కల్పించి రైతుల ఆదాయం త్వరిత గతి న వృద్ధి చెందడం లో తోడ్పనున్నారు.
‘రైతుల ఆదాయాన్ని రెండింతలు’ చేయడం కోసం సమష్టి కృషి దిశ గా సాగేందుకు 2022వ సంవత్సరం కల్లా 7,000 ఎఫ్‌పిఒ ల ను ఏర్పాటు చేయాలని ‘డబ్లింగ్ ఆఫ్ పార్మర్స్ ఇన్‌కమ్’ (డిఎఫ్ఐ) నివేదిక సిఫార్సు చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం రాబోయే అయిదు సంవత్సరాల కాలం లో రైతుల కు పరిమాణం పరంగా ఆర్థికం గా కలసి వచ్చేటట్లు చూసేందుకు 10,000 నూతన ఎఫ్‌పిఒ లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
విలువ జోడింపు, మార్కెటింగ్, మరియు ఎగుమతి ని ప్రోత్సహించడం కోసం ‘వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రాడక్ట్’ వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా తోట పంటల దిగుబడి విషయం లో ఒక క్లస్టర్ ఆధారిత విధానాన్ని అనుసరిస్తామని కూడా ప్రభుత్వం 2020-2021 కేంద్ర బడ్జెటు లో ప్రతిపాదించింది.
మరి ఈ కారణం గా నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘‘ఫార్మేశన్ ఎండ్ ప్రమోశన్ ఆఫ్ ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేశన్స్ (ఎఫ్‌పిఒ స్)’’ పేరు తో ఒక క్రొత్త కేంద్రీయ రంగ పథకాన్ని దేశ ప్రజల కు అంకితం చేయదలచుకొంది.