ఈ దార్శనికతకు యువత ఆలోచనలను జోడించే వేదిక సమకూర్చడమే దీని లక్ష్యం;
దేశంలోని రాజ్‌భ‌వ‌న్లలో కార్యశాలల నిర్వహణ సందర్భంగా విశ్వవిద్యాలయాల ఉప-కులపతులు.. విద్యా సంస్థల అధిపతులను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని

   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2023 డిసెంబర్ 11న ఉదయం 10:30 గంటలకు ‘వికసిత భారతం@2047: యువగళం’ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయం ద్వారా ప్రారంభిస్తారు. కార్యక్రమ ప్రారంభ సూచికగా దేశంలోని రాజ్‌భ‌వ‌న్లలో నిర్వహించే కార్యశాలలకు హాజరయ్యే విశ్వవిద్యాలయాల ఉప-కులపతులు, విద్యా సంస్థల అధిపతులు, బోధకులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.

   దేశ ప్రగతికి సంబంధించి జాతీయ ప్రణాళికల రూపకల్పన, ప్రాధాన్యాలు, లక్ష్యాల విషయంలో యువతరం చురుగ్గా పాల్గొనాలన్న దూరదృష్టితో ప్రధానమంత్రి దీనికి శ్రీకారం చుడుతున్నారు. ఈ దృక్కోణానికి యువతీయువకులు తమ ఆలోచనలను జోడించడం కోసం ‘వికసిత భారతం@2047: యువగళం’ కార్యక్రమం ఒక వేదికను సమకూరుస్తుంది. ఈ వేదికను ఉపయోగించుకోవడంపై వారికి అవగాహన కల్పించడంతోపాటు వికసిత భారతం@2047 కోసం సూచనలు, సలహాల స్వీకరణలో కార్యశాలల నిర్వహణ  కీలక దశగా ఉంటుంది.

   మనం 2047లో స్వాతంత్ర్య శతాబ్ది వేడుకలు నిర్వహించుకునే నాటికి దేశాన్ని వికసిత భారతంగా రూపుదిద్దడమే ‘వికసిత భారతం@2047’ లక్ష్యం. ఇందులో ఆర్థిక వృద్ధి, సామాజిక ప్రగతి, పర్యావరణ సుస్థిరత, సుపరిపాలన సహా అభివృద్ధి సంబంధిత వివిధ అంశాలు అంతర్భాగంగా ఉంటాయి.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India Inc hails 'bold' Budget with 'heavy dose of reforms' to boost consumption, create jobs

Media Coverage

India Inc hails 'bold' Budget with 'heavy dose of reforms' to boost consumption, create jobs
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 2 ఫెబ్రవరి 2025
February 02, 2025

Appreciation for PM Modi's Visionary Leadership and Progressive Policies Driving India’s Growth