Quoteఈ పథకం సాంప్రదాయక చేతివృత్తుల లో నిమగ్నమైన వారికిసమర్థన ను మరియు నైపుణ్యాల ను అందించాలన్న ప్రధాన మంత్రి యొక్క దృష్టికోణం నుండిప్రేరణ ను పొందింది
Quote‘పిఎమ్ విశ్వకర్మ’ కు కేంద్ర ప్రభుత్వం 13,000 కోట్ల రూపాయల నిధులను తానే సమకూర్చనుంది
Quote‘పిఎమ్ విశ్వకర్మ’ పరిధి విశాలమైంది గా ఉంటుంది – దీనిలో పద్దెనిమిదివిధాల చేతివృత్తుల ను చేర్చడం జరుగుతుంది
Quoteపిఎమ్ విశ్వకర్మ సర్టిఫికెట్ మరియు ఐడి కార్డు లతో విశ్వకర్మ లకు గుర్తింపు ను ఇవ్వడం జరుగుతుంది
Quoteవిశ్వకర్మల కు నైపుణ్యాల ను పెంపొందింప చేసుకోవడం కోసం రుణ సహాయం తో పాటు మరియు శిక్షణ ను కూడా ఇవ్వడం జరుగుతుంది

విశ్వకర్మ జయంతి సందర్భం లో 2023 సెప్టెంబర్ 17 వ తేదీ నాడు ఉదయం సుమారు 11 గంటల కు న్యూ ఢిల్లీ లోని ద్వారక లో గల ఇండియా ఇంటర్ నేశనల్ కన్ వెన్శన్ ఎండ్ ఎక్స్ పో సెంటర్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘పిఎమ్ విశ్వకర్మ’ అనే పేరు తో ఒక క్రొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు.

 

సాంప్రదాయక చేతివృత్తుల లో నిమగ్నం అయిన వారి కి సాయాన్ని అందించాలన్నది ప్రధాన మంత్రి యొక్క నిరంతర ప్రయాస గా ఉంది. ఈ శ్రద్ధ లో చేతివృత్తిదారుల కు మరియు శిల్పకారుల కు ఆర్థిక పరం గా సహాయాన్ని అందించడం ఒక్కటే కాకుండా స్థానిక ఉత్పాదనలు, కళ లు, మరియు చేతివృత్తి కళాకారుల ఉత్పత్తుల మాధ్యం ద్వారా శతాబ్దాల నాటి ప్రాచీన సంప్రదాయాన్ని, సంస్కృతి ని మరియు వివిధ వారసత్వాలను బ్రతికించుకోవడం తో పాటు సమృద్ధం చేసుకోవాలన్న అభిలాష కూడా ఇమిడిపోయి ఉంది.

 

పిఎమ్ విశ్వకర్మ కు 13,000 కోట్ల రూపాయల తో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి లో నిధుల ను అందించడం జరుగుతుంది. ఈ పథకం లో భాగం గా, ‘పిఎమ్ విశ్వకర్మ పోర్టల్’ ద్వారా బయోమెట్రిక్ విధానాన్ని ఉపయోగించి కామన్ సర్వీసెస్ సెంటర్స్ మాధ్యం లో విశ్వకర్మల పేరుల ను ఉచితం గా నమోదు చేయనున్నారు. వారి కి పిఎమ్ విశ్వకర్మ సర్టిఫికెట్ ను మరియు ఐడి కార్డు ను అందించడం, ప్రాథమిక శిక్షణ తోను, ఉన్నత శిక్షణ తోను నైపుణ్యాల కు మెరుగుల ను దిద్దడం, 15,000 రూపాయల టూల్ కిట్ సంబంధి ప్రోత్సాహకాన్ని ఇవ్వడం, 5 శాతం గా ఉండే తగ్గింపు వడ్డీ రేటు కు ఒకటో విడత లో ఒక లక్ష రూపాయల వరకు మరియు రెండో విడత లో రెండు లక్షల రూపాయల వరకు పూచికత్తు లేకుండానే రుణం రూపం లో సహాయాన్ని అందించడం, డిజిటల్ ట్రాన్సాక్శన్స్ కై ప్రోత్సాహం తో పాటు మార్కెటింగ్ పరమైన సమర్థన మాధ్యం ద్వారా గుర్తింపు ను ఇవ్వడం జరుగుతుంది.

 

గురు-శిష్య సంప్రదాయం, లేదా సాంప్రదాయక నైపుణ్యాలు కలిగిన కుటుంబం ద్వారా ఆయా కార్యాల ను పూర్తి చేయడం లో నేర్పు ను అలవరచుకొనేటట్టు చూస్తూ, ఈ విధం గా వారి లోని కళ ను పెంచి పోషించాలనేదే ఈ పథకం యొక్క లక్ష్యం గా ఉంది. పిఎమ్ విశ్వకర్మ యొక్క ముఖ్య ధ్యేయం చేతివృత్తి కళాకారుల, శిల్పకారుల ఉత్పాదనల ను మరియు సేవల ను విస్తృత పరచడమూ, వాటి నాణ్యత ను మెరుగు పరచడమూ, ఆయా ఉత్పాదనల మరియు సేవల ను దేశీయ మరియు ప్రపంచ వేల్యూ చైన్ లతో ఏకీకృతం చేయడమూ ను.

 

ఈ పథకం భారతదేశం లో గ్రామీణ ప్రాంతాలు మరియు మరియు పట్టణ ప్రాంతాల లో చేతివృత్తిదారుల కు, శిల్పకారుల కు అండదండల ను ఇస్తుంది. పిఎమ్ విశ్వకర్మ పథకం పరిధి లోకి పద్దెనిమిది సాంప్రదాయక హస్తకళల ను చేర్చడం జరుగుతుంది. వీటిలో (i) వడ్రంగి పనివారు; (ii) పడవ ల తయారీదారులు; (iii) ఆయుధాల ను రూపొందించే వారు; (iv) కమ్మరులు; (v) సుతారి పని మరియు టూల్ కిట్ తయారీదారులు; (vi) తాళాల తయారీదారులు; (vii) స్వర్ణకార వృత్తి పని వారు; (viii) కుమ్మరి వృత్తిదారులు; (ix) శిల్పకారులు, రాళ్ళ ను కొట్టే పని లో నిమగ్నం అయ్యే వారు ; (x) పాదరక్ష ల తయారీదారులు (బూట్ల ను తయారు చేసే వారు); (xi) తాపీమేస్త్రీ లు; (xii) బుట్ట లు/చాప లు/చీపురుల ను తయారు చేసే వారు; (xiii) కొబ్బరి నార / కొబ్బరి పీచు అల్లిక తో వస్తువుల ను తయారు చేసే వారు & సాంప్రదాయక ఆటబొమ్మ ల తయారీదారులు(xiv) క్షురకర్మ లో నిమగ్నం అయ్యే వారు; (xv) పూల దండల ను సిద్ధం చేసే వారు; (xvi) రజకులు; (xvii) దర్జీ లు; మరియు (xviii) చేపల వలల తయారీదారులు ఉంటారు.

 

  • Jitendra Kumar May 19, 2025

    🙏🙏
  • Vívek Paturakar March 28, 2024

    viswakarma yojana sabhi ko di jarahi par isaka labh karagiro ko nahi mil raha ho karagiro nahi o labh utha rahe or karagiro ke hat kuch nahi aa raha is yojana ki barakai se jyach kare
  • Babla sengupta December 31, 2023

    Babla sengupta
  • Mahendra singh Solanki Loksabha Sansad Dewas Shajapur mp December 09, 2023

    नमो नमो नमो नमो नमो नमो नमो नमो
  • Tilwani Thakurdas Thanwardas November 12, 2023

    दीपावली की की शुभकामनाएं देते हैं👌👌👌👌👌
  • Tilwani Thakurdas Thanwardas November 11, 2023

    तेलंगाना राज्य में सफेद राशन कार्ड धारकों को लेकर के कहना है कि इनको आप जितना लाभ देंगे तो आपके वोट में भी बहुत हिजाबे होने की संभावना रहती है👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
  • Tilwani Thakurdas Thanwardas November 10, 2023

    मोदीजी का मकसद है कि देश में से गरीबी रेखा के रहने वाले लोगों को भी ऐसे स्थान पर लाना है जिससे वह भी भूलें की गरीबी होती किया चीज़ है👍👍👍👍👍👍👍👍इसलिए उन्हें 5 साल के लिए राशन वितरण किया जा रहा है कि वह लोग कुछ रकम जमा करने में सख्यम हो सकता है👌👌👌👌👌👌👌👌👌👌
  • Tilwani Thakurdas Thanwardas November 09, 2023

    विरोधियों में किसी के पास भी इतना सा भी दम नहीं है कि मोदीजी का मुकाबला करने में सख्यम हो👍👍👍👍👍👍👍👍
  • Tilwani Thakurdas Thanwardas November 09, 2023

    देश सेवा सीखनी है तो वह सिर्फ मोदीजी से सीखी जा सकती है👍👍👍👍👍👍👍👍👍👍👍👍
  • Tilwani Thakurdas Thanwardas November 08, 2023

    विदेश जो भी काला धन है अब वह एक देश से दूसरे देश में घूमने में लगा हुआ है और मोदीजी की नज़रों में आते जा रही है और 2024 के बाद में ही एक बम की तरह फट सकता है और वापस लाने में कोई भी तकलीफ नहीं हो सकती है👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
FSSAI trained over 3 lakh street food vendors, and 405 hubs received certification

Media Coverage

FSSAI trained over 3 lakh street food vendors, and 405 hubs received certification
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 11 ఆగష్టు 2025
August 11, 2025

Appreciation by Citizens Celebrating PM Modi’s Vision for New India Powering Progress, Prosperity, and Pride