ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ 2021 ఏప్రిల్ 24న, జాతీయ పంచాయతీరాజ్‌దినోత్సవం సందర్భంగా స్వమిత్వ పథకం కింద ఈ ప్రాపర్టీ కార్డుల పంపిణీని మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా4.09 లక్షల మంది ఆస్తి స్వంతదారులు ఈ ప్రాపర్టీకార్డులను అందుకోనున్నారు. దేశవ్యాప్తంగా స్వమిత్వ పథకం అమలు కూడా దీనితో ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనరేంద్రసింగ్ తోమర్ కూడా పాల్గొంటారు.
జాతీయ పంచాయతి రాజ్‌దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి 2021 సంవత్సరానికి జాతీయ పంచాయత్ అవార్డులనుకూడా బహుకరిస్తారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తీకరణ్‌పురస్కార్ (224 పంచాయతీలకు), నానాజీ దేశ్ ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామ్ సభా పురస్కార్ (30 గ్రామ పంచాయతీలకు), గ్రామ పంచాయతి డవలప్‌మెంట్ ప్లాన్ అవార్డు (29గ్రామ పంచాయతీలకు) చిన్నపిల్లలపట్ల స్నేహభావం చూపే గ్రామపంచాయతీలకు అవార్డు ( 30 గ్రామపంచాయతీలకు),12 రాష్ట్రాలకు ఈ పంచాయత్ పురస్కారాలు అందజేస్తారు.
ప్రధానమంత్రి, ఈ అవార్డుల మొత్తాన్ని (గ్రాంట్ ఇన్ ఎయిడ్ ) మీట నొక్కి బదిలీ చేస్తారు. 5 లక్షల రూపాయలనుంచి 50 లక్షల రూపాయల వరకు బహుమతి మొత్తాలు ఉన్నాయి. ఈ మొత్తాలను ఆయా పంచాయత్‌ల బ్యాంక్ ఖాతాలకు నేరుగా బదిలీ చేస్తారు. ఇలా అవార్డు మొత్తాన్ని నేరుగా ఆయా గ్రామపంచాయతీల ఖాతాలకు బదిలీచేయడం ఇదే మొదటిసారి.
స్వమిత్వపథకం గురించి.
స్వమిత్వ ( సర్వేఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపిగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియా) పథకాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020 ఏప్రిల్ 24న కేంద్ర ప్రభుత్వపథకంగా ప్రారంభించారు. సామాజిక ఆర్థికసాధికారత, స్వావలంబిత భారత దేశాన్ని ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు.ఆయునిక సాంకేతిక ఉపకరణాలను ఉపయొగించి మాపింగ్,సర్వేద్వారా గ్రామీణ భారతదేశంలో పరివర్తన తీసుకువచ్చే శక్తి ఈ పథకానికిఉంది. ఈ పథకం , గ్రామీణ ప్రాంతాలలోనివారు తమ ఆస్థిని ఆర్థిక విలువ కలిగిన ఆస్థిగా ఉపయోగించుకోవడానికి తద్వారా రుణాలు, ఇతర ఆర్థిక పరమైన ప్రయోజనాలు పొందడానికి వీలు కలుగుతుంది. ఈ పథకం 2021-2025 మధ్య 6.62 లక్షల గ్రామాలన్నింటికీ కవర్ అవుతుంది.
ఈ పథకానికి సంబంధించి పైలట్ పథకం 2020-21 మధ్య మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా,ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్,మధ్యప్రదేశ్‌లలో , పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలలోని ఎంపిక చేసిన గ్రామాలలో చేపట్టడం జరిగింది.