ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 జూన్ 5వ తేదీ న సాయంత్రం 6 గంటల వేళ కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రపంచ కార్యక్రమం ‘‘పర్యావరణం కోసం జీవనశైలి ఉద్యమం’’ (లైఫ్ స్టయిల్ ఫార్ ద ఎన్ వైరన్ మెంట్.. లైఫ్) ను ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభం ‘లైఫ్ గ్లోబల్ కాల్ ఫార్ పేపర్స్’ ను కూడా ఆరంభించనుంది. దేని ద్వారా అయితే ప్రపంచం అంతటా వ్యక్తులు, సముదాయాలు మరియు సంస్థల కు పర్యావరణ చైతన్య సహిత జీవన శైలి ని అనుసరించడం కోసం ప్రభావితం చేయడం మరియు వారిని కోరే క్రమం లో విద్య రంగ ప్రముఖులు, విశ్వవిద్యాలయాలు మరియు పరిశోధన సంస్థల వంటి వాటి ఆలోచనల ను, సలహాల ను ఆహ్వానిస్తుంది. ప్రధాన మంత్రి కార్యక్రమం సందర్భం లో ముఖ్యోపన్యాసం కూడా చేయనున్నారు.
ఈ కార్యక్రమం లో పాలుపంచుకొనే వారి లో బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేశన్ కో- చైర్ మన్ శ్రీ బిల్ గేట్స్, క్లైమేట్ ఇకానామిస్ట్ లార్డ్ నికొలస్ స్టర్న్, నజ్ థియరి రచయిత ప్రొఫెసర్ కేస్ సన్ స్టీన్, వరల్డ్ రిసోర్సెజ్ ఇంస్టిట్యూట్ సిఇఒ మరియు ప్రెసిడెంట్ శ్రీ అనిరుద్ధ దాస్ గుప్త, యుఎన్ఇపి గ్లోబల్ హెడ్ ఇంగర్ ఎండర్ సన్ గారు, యుఎన్ డిపి గ్లోబల్ హెడ్ శ్రీ అచిమ్ స్టేనర్, ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంటు శ్రీ డేవిడ్ మల్ పాస్ తదితర ప్రముఖులు ఉంటారు.
లైఫ్ స్థాపన తాలూకు ఆలోచన ను ప్రధాన మంత్రి కిందటి సంవత్సరం లో గ్లాస్ గో లో 26వ యునైటెడ్ నేశన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీజ్ (కాప్26) జరిగిన సందర్భం లో పరిచయం చేశారు. ఈ ఆలోచన పర్యావరణం పట్ల అవగాహన కలిగిన జీవన శైలి ని ప్రోత్సహిస్తుంది; అటువంటి జీవన శైలి ‘గంభీరమైన ఆలోచన కు తావు ఇవ్వక వినాశకారి వినియోగాని’ కంటే ‘ఆచి తూచి ఆలోచన చేసి ఉద్దేశ్యపూర్వక వినియోగం’ పై శ్రద్ధ వహిస్తుంది.