ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 అక్టోబరు 19 వ తేదీ నాడు సాయంత్రం పూట సుమారు 4:30 గంటల వేళ లో వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా మహారాష్ట్ర లో 511 ప్రమోద్ మహాజన్ గ్రామీణ్ కౌశల్య వికాస్ కేంద్రాల ను ప్రారంభించనున్నారు. ఈ కేంద్రాల ను మహారాష్ట్ర లో 34 జిల్లాల లో ఏర్పాటు చేయడం జరుగుతున్నది.
గ్రామీణ్ కౌశల్య వికాస్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల కు చెందిన యువత కు ఉద్యోగ అవకాశాల ను కల్పించడం కోసం వివిధ రంగాల లో నైపుణ్య అభివృద్ధి సంబంధి శిక్షణ కార్యక్రమాల ను నిర్వహించనున్నాయి. ప్రతి ఒక్క కేంద్రం దాదాపు గా 100 మంది యువజనుల కు కనీసం రెండు వృత్తి ప్రధానమైన కోర్సుల లో శిక్షణ ను ఇవ్వనున్నాయి. జాతీయ నైపుణ్య అభివృద్ధి మండలి లో భాగం గా ఎంపిక చేసిన పరిశ్రమ భాగస్వాములు మరియు ఏజెన్సీ ల ద్వారా ఈ శిక్షణ ను అందించడం జరుగుతుంది. ఈ కేంద్రాల ను ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంతం మరింత సమర్థం అయినటువంటి మరియు నైపుణ్యం కలిగినటువంటి శ్రమశక్తి ని అభివృద్ధి పరచే దిశ లో ముఖ్యమైన ముందంజల ను వేయడం లో తోడ్పాటు లభించగలదు.