Quoteగ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌టిష్ఠ‌త‌, ఆ ప్రాంత రైతుల‌కు చేయూత అందించ‌డం ల‌క్ష్యంగా “బెనార‌స్ డెయిరీ సంకుల్”కు శంకుస్థాప‌న చేయ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి
Quoteఉత్త‌ర‌ప్ర‌దేశ్ వాసుల‌కు గ్రామీణ నివాస హ‌క్కు రికార్డు “ఘ‌రౌనీ” పంపిణీ చేయ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి
Quoteవార‌ణాసిలో రూ.870 కోట్ల పెట్టుబ‌డితో 22 అభివృద్ధి ప్రాజెక్టుల‌కు ప్ర‌ధానమంత్రి శంకుస్థాప‌న‌
Quoteప‌ట్ట‌ణాభివృద్ధి, ఆరోగ్యం, విద్య‌, రోడ్డు మౌలిక వ‌స‌తులు, టూరిజం రంగాల ప్రాజెక్టులు
Quoteవార‌ణాసిలో 360 డిగ్రీల ప‌రివ‌ర్త‌న‌కు జ‌రుగుతున్న ప్ర‌య‌త్నాల‌ను మ‌రింత శ‌క్తివంతం చేయ‌నున్న ప్రాజెక్టులు

తాను ప్రాతినిథ్యం వ‌హిస్తున్న వార‌ణాసి నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి, ఆర్థిక  పురోగ‌తికి ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నిరంత‌రం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్ర‌ధాన‌మంత్రి 23 డిసెంబ‌ర్ 21న (గురువారం) మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు వార‌ణాసిని సంద‌ర్శించి బ‌హుళ అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించ‌నున్నారు.

వార‌ణాసిలోని కార్ఖియోం వ‌ద్ద‌ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ‌కు చెందిన ఫుడ్ పార్కులో “బెనార‌స్ డెయిరీ సంకుల్”కు ప్ర‌ధాన‌మంత్రి శంకుస్థాప‌న చేస్తారు. రూ. 475 కోట్ల పెట్టుబ‌డితో 30 ఎక‌రాల స్థ‌లంలో  ఈ డెయిరీని నిర్మిస్తున్నారు. రోజుకి 5 ల‌క్ష‌ల లీట‌ర్ల పాలు ప్రాసెసింగ్ చేయ‌గ‌ల సామ‌ర్థ్యం దీనికి ఉంటుంది. ఈ డెయిరీ గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్ఠం చేయ‌డంతో పాటు ఆ ప్రాంతంలోని రైతుల‌కు కొత్త అవ‌కాశాలు అందుబాటులోకి తెస్తుంది. బెనార‌స్ డెయిరీతో స‌హ‌కార భాగ‌స్వామ్యం క‌లిగి ఉన్న‌ 1.7 ల‌క్ష‌ల మందికి పైగా పాడి రైతుల‌ ఖాతాల‌కు ప్ర‌ధాన‌మంత్రి రూ.35 కోట్లు డిజిట‌ల్ గా జ‌మ‌ చేస్తారు.

వార‌ణాసిలోని రామ్ న‌గ‌ర్ లో పాల ఉత్ప‌త్తిదారుల స‌హ‌కార యూనియ్ ప్లాంట్ లో బ‌యోగ్యాస్ నుంచి విద్యుత్ ఉత్ప‌త్తి చేసే ప్లాంట్ కు ప్ర‌ధాన‌మంత్రి శంకుస్థాప‌న చేస్తారు. పాల ఉత్ప‌త్తిదారుల స‌హ‌కార యూనియ‌న్‌ ప్లాంట్ ఇంధ‌న స్వ‌యంస‌మృద్ధిలో ఈ ప్లాంట్ కీల‌క పాత్ర పోషిస్తుంది.

పాల ఉత్ప‌త్తుల నాణ్య‌త ధ్రువీక‌ర‌ణ‌కు జాతీయ పాడిప‌రిశ్ర‌మాభివృద్ధి బోర్డు (ఎన్ డిడిబి) స‌హ‌కారంతో బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్ (బిఐఎస్‌) అభివృద్ధి చేసిన పోర్ట‌ల్‌ను, క‌న్ఫ‌ర్మిటీ అసెస్ మెంట్ స్కీమ్ లోగోను ప్ర‌ధాన‌మంత్రి ఆవిష్క‌రిస్తారు. బిఐఎస్‌, ఎన్ డిడిబి రెండింటి లోగోల ల‌క్ష‌ణాల‌తో రూపొందించిన ఈ ఉమ్మ‌డి లోగో స‌ర్టిఫికేష‌న్ ప్ర‌క్రియ‌ను స‌ర‌ళం చేయ‌డంతో పాటు ప్ర‌జ‌ల‌కు పాల ఉత్ప‌త్తుల నాణ్య‌త‌పై భ‌రోసా ల‌భిస్తుంది.

గ్రామీణ స్థాయిలో యాజ‌మాన్య సంబంధిత స‌మ‌స్య‌లను త‌గ్గించ‌డం కోసం కేంద్ర‌ప్ర‌భుత్వ పంచాయ‌తీ రాజ్ సంస్థ  నిర్వ‌హ‌ణ‌లోని స్వ‌మిత్వ ప‌థ‌కం కింద 20 ల‌క్ష‌ల మందికి పైగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి వ‌ర్చువ‌ల్ విధానంలో “ఘ‌రౌనీ” నివాస హ‌క్కు రికార్డులు పంపిణీ చేస్తారు.

వార‌ణాసిలో రూ.870 కోట్ల‌తో చేప‌డుతున్న 22 అభివృద్ధి ప్రాజెక్టుల్లో కొన్నింటిని  ప్ర‌ధాన‌మంత్రి ప్రారంభించ‌డం, శంకుస్థాప‌న చేయ‌డం జ‌రుగుతుంది. వార‌ణాసి 360 డిగ్రీల ప‌రివ‌ర్త‌న‌కు ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప్ర‌య‌త్నాల‌ను ఇది మ‌రింత బ‌లోపేతం చేస్తుంది.

వార‌ణాసిలో బ‌హుళ ప‌ట్ట‌ణాభివృద్ధి ప్రాజెక్టుల‌ను ప్ర‌ధానంత్రి ప్రారంభిస్తారు. ఆరు పాత కాశీ వార్డుల పున‌ర్నిర్మాణం;  బెనియాబాగ్ లో పార్కింగ్‌, స‌ర్ఫేస్ పార్క్ ల నిర్మాణం, రెండు చెరువుల ఆధునికీక‌ర‌ణ‌, రామ్నా గ్రామంలో ఒక మురుగునీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణం, స్మార్ట్ సిటీ మిష‌న్ లో భాగంగా 720 ప్రాంతాల్లో నిఘా కెమెరాల ఏర్పాటు వంటివ‌న్నీ ఈ ప్రాజెక్టుల్లో ఉన్నాయి.

అలాగే ప్ర‌ధాన‌మంత్రి ప్రారంభించ‌నున్న విద్యారంగానికి చెందిన ప్రాజెక్టుల్లో రూ.107 కోట్ల‌తో నిర్మిస్తున్న‌ కేంద్ర విద్యా మంత్రిత్వ‌శాఖ కు చెందిన‌ సెంట‌ర్ ఫ‌ర్ టీచ‌ర్స్ ఎడ్యుకేష‌న్‌;   రూ.7 కోట్ల‌తో నిర్మించిన‌ సెంట్ర‌ల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ‌య్య‌ర్ టిబెట‌న్ స్ట‌డీస్ లో ఉపాధ్యా య‌ విద్యా కేంద్రం;  బిహెచ్ యు, ఐఐటి క‌రౌండిలో స్టాఫ్ట క్వార్ట‌ర్లు, ఆవాస్ ఫ్లాట్లు ఉన్నాయి.

అలాగే మ‌హామ‌న పండిట్ మ‌ద‌న్ మోహ‌న్ మాల‌వీయ కేన్స‌ర్ సెంట‌ర్ లో రూ.130 కోట్ల‌తో నిర్మించిన డాక్ట‌ర్ల హాస్ట‌ల్‌, న‌ర్సుల హాస్ట‌ల్‌, షెల్ట‌ర్ హోమ్ ల‌ను ప్ర‌ధానమంత్రి ప్రారంభిస్తారు.  భ‌ద్రాసిలో 50 పడ‌క‌ట స‌మీకృత ఆయుష్ ఆస్ప‌త్రిని కూడా ప్రారంభిస్తారు. అలాగే ఆయుష్ మిష‌న్ కింద పిండ్రా త‌హ‌సీల్ లో రూ.49 కోట్ల‌తో నిర్మించ‌నున్న ప్ర‌భుత్వ హోమియోప‌తిక్ వైద్య క‌ళాశాల‌కు ప్ర‌ధాన‌మంత్రి శంకుస్థాప‌న చేస్తారు.

రోడ్ల రంగానికి సంబంధించి ప్రాజక్టుల్లో ప్ర‌యాగ్ రాజ్‌, భాదోహి రోడ్ల‌ను 4 లేన్ల నుంచి 6 లేన్ల ర‌హ‌దారులుగా విస్త‌రించ‌డానికి ఉద్దేశించిన ప్రాజెక్ట‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి శంకుస్థాపన చేస్తారు. వీటితో వార‌ణాసికి అనుసంధాన‌త‌ మెరుగు ప‌డ‌డంతో పాటు న‌గ‌రంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొల‌గుతాయి.

ప‌విత్ర న‌గ‌రంలో ప‌ర్యాట‌క రంగానికి ఉత్తేజం క‌ల్పించే దిశ‌గా చేప‌ట్టిన వార‌ణాసిలో శ్రీ గురు ర‌విదాస్ జీ ఆల‌యం, గోవ‌ర్థ‌న్ స్వామి ఆల‌యం తొలి ద‌శ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్ర‌ధాన‌మంత్రి శంకుస్థాప‌న చేస్తారు.

ప్ర‌ధాన‌మంత్రి ప్రారంభించ‌నున్న ఇత‌ర ప్రాజెక్టుల్లో ఇంట‌ర్నేష‌న‌ల్ రైస్ ఇన్ స్టిట్యూట్ లోని స్పీడ్ బ్రీడింగ్ సెంట‌ర్‌, వార‌ణాసిలోని ద‌క్షిణాసియా ప్రాంతీయ కేంద్రం, పాయ‌క్ పూర్ గ్రామంలో రీజిన‌ల్ రిఫ‌రెన్స్ స్టాండ‌ర్డ్ లేబ‌రేట‌రీ, పిండ్రా త‌హ‌సీల్ లో అడ్వ‌కేట్ భ‌వ‌నం ఉన్నాయి.

  • शिवकुमार गुप्ता January 11, 2022

    वंदे मातरम जय हिंद जय भारत
  • SanJesH MeHtA January 11, 2022

    यदि आप भारतीय जनता पार्टी के समर्थक हैं और राष्ट्रवादी हैं व अपने संगठन को स्तम्भित करने में अपना भी अंशदान देना चाहते हैं और चाहते हैं कि हमारा देश यशश्वी प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में आगे बढ़ता रहे तो आप भी #HamaraAppNaMoApp के माध्यम से #MicroDonation करें। आप इस माइक्रो डोनेशन के माध्यम से जंहा अपनी समर्पण निधि संगठन को देंगे वहीं,राष्ट्र की एकता और अखंडता को बनाये रखने हेतु भी सहयोग करेंगे। आप डोनेशन कैसे करें,इसके बारे में अच्छे से स्मझह सकते हैं। https://twitter.com/imVINAYAKTIWARI/status/1479906368832212993?t=TJ6vyOrtmDvK3dYPqqWjnw&s=19
  • Moiken D Modi January 09, 2022

    best PM Modiji💜💜💜💜💜💜
  • BJP S MUTHUVELPANDI MA LLB VICE PRESIDENT ARUPPUKKOTTAI UNION January 08, 2022

    12*8=96
  • शिवकुमार गुप्ता January 08, 2022

    जय भारत
  • शिवकुमार गुप्ता January 08, 2022

    जय हिंद
  • शिवकुमार गुप्ता January 08, 2022

    जय श्री सीताराम
  • शिवकुमार गुप्ता January 08, 2022

    जय श्री राम
  • Neeraj Rajput January 03, 2022

    जय हो
  • G.shankar Srivastav January 01, 2022

    सोच ईमानदार काम दमदार फिर से एक बार योगी सरकार
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
A chance for India’s creative ecosystem to make waves

Media Coverage

A chance for India’s creative ecosystem to make waves
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the loss of lives in an accident in Nuh, Haryana
April 26, 2025

Prime Minister, Shri Narendra Modi, today condoled the loss of lives in an accident in Nuh, Haryana. "The state government is making every possible effort for relief and rescue", Shri Modi said.

The Prime Minister' Office posted on X :

"हरियाणा के नूंह में हुआ हादसा अत्यंत हृदयविदारक है। मेरी संवेदनाएं शोक-संतप्त परिजनों के साथ हैं। ईश्वर उन्हें इस कठिन समय में संबल प्रदान करे। इसके साथ ही मैं हादसे में घायल लोगों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। राज्य सरकार राहत और बचाव के हरसंभव प्रयास में जुटी है: PM @narendramodi"