భవిష్యత్తు లో ఆచరణ కు ఉద్దేశించినటువంటి ఒక మార్గ సూచి ని గురించి మరియు సంబంధిత దృష్టికోణం గురించి ఉన్నత స్థాయి లో చర్చించడం కోసం బ్యాంకుల కు, ఇంకా ఎన్ బిఎఫ్ సి లకు చెందిన స్టేక్ హోల్డర్స్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపటి రోజు న సాయంత్రం పూట చర్చ లు జరపనున్నారు.
కార్యసూచి రూపకల్పన కై సమాలోచనల ను చేపట్టే అంశాల లో- పరపతి ఉత్పాదనలు, బట్వాడా కోసం ఉద్దేశించిన ప్రభావశాలి నమూనా లు, సాంకేతిక విజ్ఞానం అండ తో ఆర్థిక సాధికారిత కల్పన తో పాటు ఆర్థిక రంగం యొక్క స్థిరత్వం మరియు నిరంతర మనుగడ కు లక్షించిన దూరదృష్టి ని కలిగివుండే అభ్యాసాలు కూడా- భాగం గా ఉన్నాయి.
మౌలిక సదుపాయాల కల్పన కు, వ్యవసాయ రంగాని కి, ఎమ్ఎస్ఎమ్ఇ లు సహా స్థానికం గా తయారీ లో నిమగ్నమైన సంస్థల కు ఆర్థిక సహాయాన్ని సమకూర్చుతూ భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి లో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర ను బ్యాంకింగ్ రంగం పోషిస్తోంది. ఆర్థిక సేవల ను అన్ని వర్గాల వారి కి అందుబాటు లోకి తీసుకు పోయే ప్రక్రియ విషయానికి వస్తే, ఇది సాంకేతిక విజ్ఞానం మాధ్యమం ద్వారా ఆర్థిక సంబంధి సాధికారిత ను కల్పించడం లో ఒక మహత్వపూర్ణమై పాత్ర ను పోషించగలుగుతుంది.
ప్రభుత్వ సీనియర్ అధికారులు కూడా ఈ సమాలోచనల కు హాజరు కానున్నారు.