ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపటి రోజు న అంటే 2020వ సంవత్సరం జనవరి 24వ తేదీ నాడు ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2020’ యొక్క విజేతలైన 49 మంది బాలల తో భేటీ అయ్యి, వారి తో ముచ్చటించనున్నారు.
ఈ 49 మంది పురస్కార గ్రహీత లు భారతదేశం లో వివిధ రాష్ట్రాల కు చెందిన వారు. వీరి లో జమ్ము & కశ్మీర్, మణిపుర్, మరియు అరుణాచల్ ప్రదేశ్ ల నుండి ఒక్కొక్క అవార్డు గ్రహీత ఉన్నారు.
ఈ బాలలు కళలు & సంస్కృతి, నూతన ఆవిష్కరణ, విద్యా సంబంధమైన కార్యసిద్ధి, సామాజిక సేవ, క్రీడలు మరియు సాహసం రంగాల లో విజేతలు గా నిలచారు.
జాతి నిర్మాణం లో అతి ముఖ్యమైన భాగస్వాముల లో బాలలు కూడా ఒకరు అనే విషయాన్ని భారత ప్రభుత్వం అంగీకరిస్తున్నది. వారి యొక్క ఆశల ను మరియు ఆకాంక్షల ను, అలాగే వారి కార్యసాధనల ను గుర్తించాలని వారికి పురస్కారాల ను ఇస్తూ వస్తున్నది.
ప్రతి ఒక్క చిన్నారి అసాధారణమే, అతడు లేదా ఆమె సాధించిన విజయాల ను ప్రశంసించవలసిందే అయినప్పటి కి, కొందరి కార్యసిద్ధులు ఎంతో మంది ఇతరుల కు ఒక ప్రేరణ గా కూడాను పని చేస్తాయి.
ఈ దిశ గా వివిధ రంగాల లో మన బాలల అసామాన్య కార్యసాధనల ను గుర్తించడం కోసం ప్రభుత్వం ప్రతి ఏటా ఈ పురస్కారాల ను ప్రదానం చేస్తున్నది.
నూతన ఆవిష్కరణ, విద్యా సంబంధమైన కార్యసాధన, సంఘ సేవ, కళలు & సంస్కృతి, క్రీడలు, ఇంకా సాహసం.. ఈ రంగాల లో ఏదైనా అపూర్వమైనటువంటి విజయాన్ని సాధించిన ఏ చిన్నారి అయినా ఈ పురస్కారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక చిన్నారి సాధించిన ప్రతిభావంతమైన కార్యసిద్ధి ని గురించి న సమాచారం ఏ వ్యక్తి కి అయినా తెలిసిన పక్షం లో, ఆ యొక్క చిన్నారి పేరు ను అవార్డు కోసం సిఫారసు చేయవచ్చును. ప్రతి ఒక్క దరఖాస్తు ను ఒక ఉన్నత స్థాయి సంఘం శ్రద్ధ గా పరిశీలించిన అనంతరం విజేతల ను ఎంపిక చేస్తుంది.
భారత రాష్ట్రపతి శ్రీ రాం నాథ్ కోవింద్ నిన్‌దటి రోజు న అంటే 2020వ సంవత్సరం జనవరి 22వ తేదీ నాడు ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ల ను ప్రదానం చేశారు.
ఆదివాసీ కళాకారులు, ఎన్‌సిసి కేడెట్ లు, ఎన్ఎస్ఎస్ వలంటియర్ లు మరియు శకటాల కళాకారుల తో స్వాగత సత్కారం
గణతంత్ర దిన కవాతు లో పాలుపంచుకోనున్న శకటాల సంబంధిత కళాకారులు, ఎన్‌సిసి కేడెట్ లు, ఎన్ఎస్ఎస్ వలంటియర్ లు, ఆదివాసీ కళాకారులు 1730 మంది తో 2020వ సంవత్సరం జనవరి 24వ తేదీ నాడు జరిగే ఒక స్వాగత సత్కారం లో కూడా ప్రధాన మంత్రి పాల్గొంటారు.