టాయికథన్-2021 లో పాల్గొంటున్న వారితో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 24న ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించనున్నారు.
కొత్త కొత్త ఆట వస్తువుల ను, ఆట ల తాలూకు ఉపాయాల ను వివిధ సమూహాల ద్వారా సమకూర్చడం కోసం టాయికథన్-2021 ని ఈ సంవత్సరం జనవరి 5న విద్య మంత్రిత్వ శాఖ, మహిళలు బాలల వికాసం మంత్రిత్వ శాఖ, ఎమ్ఎస్ఎమ్ఇ మంత్రిత్వ శాఖ, డిపిఐఐటి, జౌళి మంత్రిత్వ శాఖ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ లతో పాటు, ఎఐసిటిఇ లు కలసి మొదలు పెట్టాయి. టాయికథన్-2021 లో పాలుపంచుకొనేందుకు భారతదేశం లోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 1.2 లక్షల మంది ముందుకు వచ్చి నమోదులు చేసుకొని, 17,000కు పైగా ఉపాయాల ను దాఖలు చేశారు. వాటి లో నుంచి 1567 ఉపాయాల ను జూన్ 22 మొదలుకొని జూన్ 24 వరకు ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా నిర్వహించే టాయికథన్ గ్రాండ్ ఫినాలి కోసం తాత్కాలికం గా ఎంపిక చేయడమైంది. కోవిడ్-19 ఆంక్ష ల కారణం గా, ఈ డిజిటల్ మాధ్యమానికి అనువైనటువంటి టాయి ఐడియాస్ ను దాఖలు చేసిన జట్ల ను మాత్రమే గ్రాండ్ ఫినాలి లో అవకాశం కల్పించడం జరిగింది. డిజిటల్ మాధ్యమం కోవ కు చెందనటువంటి ఆటవస్తువుల ఉపాయాల ను సమర్పించిన అభ్యర్థుల కు విడి గా ఓ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు.
భారతదేశం లోని దేశవాళీ బజారు తో పాటు ప్రపంచ ఆట వస్తువుల బజారు ఒక భారీ అవకాశాన్ని మన తయారీ రంగాని కి ఇవ్వజూపుతోంది. భారతదేశం లోని ఆటవస్తువుల తయారీ పరిశ్రమ కు ప్రోత్సాహాన్ని అందించి, ఆ పరిశ్రమ ఆటబొమ్మల బజారు లో ఒక విస్తృతమైన వాటా ను చేజిక్కించుకోవడం లో సాయపడాలి అనేది టాయికథన్-2021 ధ్యేయం గా ఉంది.
ఈ కార్యక్రమం లో కేంద్ర విద్య శాఖ మంత్రి కూడా పాల్గొంటారు.
Published By : Admin |
June 22, 2021 | 12:25 IST
Login or Register to add your comment
Chief Minister of Gujarat meets Prime Minister
December 19, 2025
The Chief Minister of Gujarat, Shri Bhupendra Patel met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.
The Prime Minister’s Office posted on X;
“Chief Minister of Gujarat, Shri @Bhupendrapbjp met Prime Minister @narendramodi.
@CMOGuj”
Chief Minister of Gujarat, Shri @Bhupendrapbjp met Prime Minister @narendramodi.@CMOGuj pic.twitter.com/IMBh7EMPqN
— PMO India (@PMOIndia) December 19, 2025


