కోవిడ్ టీకా మందు ఒకటో డోసు ను గోవా లో వయోజనులు అందరికీ ఇప్పించడం పూర్తి అయిన సందర్భం లో, కోవిడ్ టీకా లబ్ధిదారుల తోను, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల తోను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 సెప్టెంబర్ 18న ఉదయం 10:30 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సమావేశం కానున్నారు.
ప్రజల కు టీకా మందు ను ఇప్పించే కార్యక్రమం సఫలం అయ్యేటట్లు గా ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రయాసల లో.. సాముదాయక జన సమీకరణ, అట్టడుగు స్థాయి ప్రాంతాల కు కూడా చేరుకోవడానికి అనువు గా అదే పని గా టీకా ఉత్సవ్ ల ను నిర్వహించడం, పని ప్రదేశాలు, వృద్ధాశ్రమాలు, దివ్యాంగజనులు వంటి ప్రాధాన్య సమూహాల కు టీకాకరణ, సందేహాల ను, భయాందోళనల ను నివృత్తి చేయడం కోసం తీసుకొన్న చొరవ లు వంటివి భాగం గా ఉన్నాయి. టీకాల ను త్వరిత గతి న ఇప్పించే క్రమం లో ఆ రాష్ట్రం తౌక్తే తుఫాను వంటి సవాళ్ళ ను కూడా అధిగమించింది.
ఈ సందర్భం లో గోవా ముఖ్యమంత్రి కూడా పాలుపంచుకోనున్నారు.