Quote‘జల్ జీవన్ మిశన్ యాప్’, ‘రాష్ట్రీయ జల్ జీవన్ కోశ్’ ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 అక్టోబర్ 2న ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా గ్రామ పంచాయతీ లు, పానీ సమితులు/ విలేజ్ వాటర్ ఎండ్ శానిటేశన్ కమిటీస్ (విడబ్ల్యుఎస్ సి) తో సమావేశం కానున్నారు.

ప్రధాన మంత్రి స్టేక్ హోల్డర్స్ లో చైతన్యాన్ని పెంచడం తోను, అలాగే జల్ జీవన్ మిశన్ లో భాగం అయిన పథకాల పట్ల జవాబుదారుతనాన్ని పారదర్శకం గాను ప్రోత్సహించడం జరుగుతుంది.  ‘జల్ జీవన్ మిశన్ యాప్’ ను ప్రారంభించనున్నారు.  

ప్రధాన మంత్రి ‘రాష్ట్రీయ జల్ జీవన్ కోశ్’ ను కూడా ప్రారంభిస్తారు.  ఈ నిధి కి ఏ వ్యక్తి అయినా, ఏ సంస్థ అయినా, ఏ కంపెనీ అయినా లేదా ఏ దాత అయినా.. వారు భారతదేశాని కి చెందినవారు కానీ, విదేశాల లో ఉంటున్నా గానీ  చందా ను ఇవ్వవచ్చును.  ఆ సొమ్ము ను గ్రామీణ ప్రాంతాల లోని ప్రతి ఒక్క కుటుంబాని కి, పాఠశాల కు, ఆంగన్ వాడీ కేంద్రాల కు, ఆశ్రమశాల కు, ఇంకా ఇతర సార్వజనిక సంస్థల కు నల్లా నీటి కనెక్షన్ ను అందించడం కోసం వినియోగిస్తారు.

అదే రోజు న ‘జల్ జీవన్ మిశన్’ అంశం పై జాతీయ స్థాయి గ్రామ సభ లు కూడా జరుగుతాయి.  గ్రామ సభ లు పల్లెల లో నీటి సరఫరా వ్యవస్థ ల తాలూకు ప్రణాళిక రూపకల్పన, వాటి నిర్వహణ లను గురించి చర్చించడం తో పాటు, దీర్ఘకాలిక జల సురక్షత దిశ లో కృషి చేయడం గురించి కూడా చర్చిస్తారు.

పానీ సమితులు/విడబ్ల్యుఎస్ సి ల గురించి:

పల్లెల లో నీటి సరఫరా వ్యవస్థ ల రూపకల్పన, అమలు, నిర్వహణ, మరమ్మత్తు లలో పానీ సమితులు ఒక కీలకమైన పాత్ర ను పోషిస్తాయి.  తద్వారా ప్రతి కుటుంబాని కి శుద్ధమైన నల్లా నీటిని క్రమం తప్పక దీర్ఘకాల ప్రాతిపదికన అందేటట్లు చూస్తాయి.

6 లక్షల కు పైగా గ్రామాల లో నుంచి సుమారు 3.5 లక్షల గ్రామాల లో ఇంతవరకు పానీ సమితుల ను/విడబ్ల్యుఎస్ సి లను ఏర్పాటు చేయడం జరిగింది.  ఫీల్డ్ టెస్ట్ కిట్స్ ను ఉపయోగించడం ద్వారా నీటి నాణ్యత ను పరీక్షించడం కోసం 7.1 లక్షల మంది కి పైగా మహిళల కు శిక్షణ ను ఇవ్వడం జరిగింది.  

జల్ జీవన్ మిశన్ గురించి:

ప్రతి ఒక్క కుటుంబాని కి శుద్ధమైన నల్లా నీటిని అందించడం కోసం జల్ జీవన్ మిశన్ ను ప్రధాన మంత్రి 2019 ఆగస్టు 15న ప్రకటించారు.  ఆ మిశన్ ప్రారంభించేటప్పటి కి కేవలం 3.23 కోట్ల  గ్రామీణ కుటుంబాలు నల్లా నీటి సరఫరా సదుపాయానికి నోచుకొన్నాయి.  ఇది 17 శాతాని కి సమానం గా ఉంది.

గడచిన రెండు సంవత్సరాల కాలం లో కోవిడ్-19 మహమ్మారి స్థితి ఉత్పన్నం అయినప్పటికీ కూడా 5 కోట్ల కు పైగా కుటుంబాల కు నల్లా నీటి కనెక్షన్ లను సమకూర్చడం జరిగింది.  ఇప్పటివరకు చూస్తే రమారమి 8.26 కోట్ల గ్రామీణ కుటుంబాలు వారి ఇళ్ళ లో నల్లాల ద్వారా నీటిని అందుకొంటున్నాయి.  అంటే ఈ సదుపాయం పొందిన వారు 43 శాతాని కి చేరుకొన్నారన్న మాట.  78 జిల్లాల లో, 58 వేల గ్రామ పంచాయతీల లో 1.16 లక్షల పల్లెల లో నివాసం ఉంటున్న ప్రతి ఒక్క గ్రామీణ కుటుంబం నల్లా నీటి సరఫరా సదుపాయాన్ని అందుకొంటున్నాయి.  ఇంతవరకు, నల్లానీటి సరఫరా సౌకర్యాన్ని 7.72 లక్షల (76 శాతం) పాఠశాలల్లోను, 7.48 లక్షల (67.5 శాతం) ఆంగన్ వాడీ సెంటర్ ల లోను ఏర్పాటు చేయడమైంది.
 
ప్రధాన మంత్రి ప్రస్తావిస్తున్న ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’  దృష్టి కోణాన్ని ఆచరణ లోకి తీసుకు రావడం కోసం, అలాగే, ‘అట్టడుగున ఉన్నవారికి’ అన్ని సౌకర్యాల ను కల్పించే క్రమం లో భాగం గా ‘జల్ జీవన్ మిశన్’ ను రాష్ట్రాల భాగస్వామ్యం ద్వారా 3.60 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ తో అమలు లోకి తీసుకు రావడమైంది.  అంతకు మించి 2021-22 నుంచి 2025-26 సంవత్సరాల మధ్య కాలం లో పల్లెల లో నీరు, పారిశుధ్యం సంబంధి సదుపాయాల కల్పన కై 15వ ఆర్థిక సంఘం సూచన మేరకు 1.42 లక్షల కోట్ల రూపాయల ను అనుబంధ గ్రాంట్ల రూపం లో పిఆర్ఐ లకు కేటాయించడం జరిగింది.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Big desi guns booming: CCS clears mega deal of Rs 7,000 crore for big indigenous artillery guns

Media Coverage

Big desi guns booming: CCS clears mega deal of Rs 7,000 crore for big indigenous artillery guns
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 మార్చి 2025
March 21, 2025

Appreciation for PM Modi’s Progressive Reforms Driving Inclusive Growth, Inclusive Future