వారణాసికి చెందిన వైద్యులు, పారామెడికల్ సిబ్బంది మరియు ఇతర ఫ్రంట్-లైన్ ఆరోగ్య కార్యకర్తలతో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2121 మే, 21వ తేదీ ఉదయం 11 గంటలకు దృశ్య మాధ్యమం ద్వారా సంభాషించనున్నారు.
ఇటీవల డి.ఆర్.డి.ఓ. మరియు భారత సైన్యం సంయుక్త సహకారంతో ప్రారంభమైన, పండిట్ రాజన్ మిశ్రా కోవిడ్ హాస్పిటల్ తో సహా వారణాసిలోని వివిధ కోవిడ్ ఆసుపత్రు ల పనితీరును ప్రధానమంత్రి సమీక్షించనున్నారు. వారణాసి జిల్లాలో ఉన్న కోవిడ్ కాని ఇతర ఆసుపత్రుల పనితీరును కూడా, ఆయన, ఈ సందర్భంగా సమీక్షించనున్నారు.
వారణాసిలో కోవిడ్ రెండవ దశ తీవ్రత ను పరిష్కరించడానికి జరుగుతున్న ప్రయత్నాలతో పాటు, భవిష్యత్తు కోసం చేపడుతున్న సన్నాహకాల గురించి కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా చర్చించనున్నారు.