ప్రపంచ చమురు మరియు గ్యాస్ రంగ ముఖ్య కార్యనిర్వహణ అధికారుల ( సిఇఒల) తోను, ఆ రంగానికి చెందిన నిపుణుల తోను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 అక్టోబర్ 20న సాయంత్రం 6 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సమావేశం కానున్నారు. ఇది ప్రతి ఏటా జరిగే సమావేశమే. ఈ సమావేశం 2016వ సంవత్సరం లో మొదలై, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తోంది. అంటే ఈసారి జరిగే సమావేశం ఇటువంటి ఆరో సమావేశం అన్న మాట. ఇది చమురు, గ్యాస్ రంగం లో ప్రపంచ స్థాయి లో అగ్రగామి దేశాల భాగస్వామ్యానికి ప్రతీక గా ఉంది. ఈ అగ్రగామి దేశాలు చమురు మరియు గ్యాస్ రంగానికి సంబంధించిన కీలక అంశాల పై ఆలోచనలను వ్యక్తం చేయడమే కాక భారతదేశం తో సహకారం తో పాటు పెట్టుబడి కి అవకాశాలు ఉన్న రంగాల ను గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది.
స్వచ్ఛమైన అభివృద్ధికి మరియు స్థిరత్వానికి ప్రోత్సాహాన్ని అందించడం అనేది ఈ సంభాషణ తాలూకు ముఖ్య విషయం గా ఉంటుంది. భారతదేశం లో హైడ్రోజన్ రంగం లో అన్వేషణ ను మరియు ఉత్పాదన ను పెంపొందించడం, శక్తి స్వాతంత్ర్యం సముపార్జన, గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ ను రూపొందించడం, ఉద్గారాల ను తగ్గించుకొంటూ ఉండడం, హరిత హైడ్రోజన్ ప్రధానమైన ఆర్థిక వ్యవస్థ, బయోఫ్యూయల్స్ ఉత్పత్తి ని పెంచుకోవడం తో పాటు చెత్త నుంచి సంపద ను సృష్టించడం వంటి రంగాల పైన ఈ మాటామంతీ కార్యక్రమం లో దృష్టి ని కేంద్రీకరించడం జరుగుతుంది. ఈ ఆలోచనల ఆదాన ప్రదానం లో ప్రముఖ బహుళజాతీయ సంస్థలకు మరియు అంతర్జాతీయ సంస్థలకు చెందిన సిఇఒ లు, నిపుణులు పాలుపంచుకోనున్నారు.
పెట్రోలియమ్, సహజ వాయువు శాఖ కేంద్ర మంత్రి ఈ కార్యక్రమం లో పాల్గొంటారు.