ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మధ్య ప్రదేశ్ లో ‘స్వామిత్వ పథకం’ లబ్ధిదారుల తో అక్టోబరు 6వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సమావేశం కానున్నారు. అదే కార్యక్రమం లో ఈ పథకం తాలూకు 1,71,000 మంది లబ్ధిదారుల కు ఇ-ప్రాపర్టీ కార్డుల ను కూడా ప్రధాన మంత్రి పంపిణీ చేస్తారు.
ఈ కార్యక్రమాని కి మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా హాజరు అవుతారు.
‘స్వామిత్వ పథకం’ గురించి:
‘స్వామిత్వ’ అనేది పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ పరిధి లో నడుస్తున్న ఒక కేంద్రీయ రంగ పథకం. గ్రామ ప్రాంత నివాసుల కు సంపత్తి హక్కుల ను అందించడమే ఈ పథకం ధ్యేయం గా ఉంది. పట్టణ ప్రాంతాల లో మాదిరిగానే రుణాల ను, ఇతరత్రా ఆర్థిక లాభాల ను పొందడం కోసం సంపత్తి ని ఒక ఆర్థిక ఆస్తి లా ఉపయోగించుకోవడానికి పల్లెవాసుల కు ఈ పథకం బాట ను పరుస్తుంది. సర్వేక్షణ కై వినియోగిస్తున్న ఆధునిక డ్రోన్ టెక్నాలజీ ద్వారా గ్రామీణ ప్రాంతాల లో జనావాసం కలిగిన భూముల కు హద్దుల ను నిర్ణయించాలన్నది ఈ పథకం ఉద్దేశ్యం గా ఉంది. ఈ పథకం దేశం లో డ్రోన్ ల తయారీ ప్రక్రియ కు కూడా ఊతాన్ని అందించింది.
मध्य प्रदेश के ग्रामीण क्षेत्रों के हजारों लोग कल ई-प्रॉपर्टी कार्ड के साथ अपनी संपत्ति का मालिकाना हक प्राप्त करेंगे। दोपहर 12.30 बजे वीडियो कॉन्फ्रेंसिंग के जरिए ऐसे कई लाभार्थियों से संवाद का सुअवसर भी मिलेगा। https://t.co/YhjIzBhaWb
— Narendra Modi (@narendramodi) October 5, 2021