ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన పిఎమ్ స్వనిధి స్కీము లబ్ధిదారులతో ఈ నెల 27 న ఉదయం పదిన్నర గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమం లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా పాల్గొంటారు.
కోవిడ్-19 ప్రభావానికి లోనైన పేద వీధి వ్యాపారులు వారి బ్రతుకుతెరువు కు సంబంధించిన కార్యకలాపాలను మళ్లీ మొదలుపెట్టుకొనేటట్టుగా వారికి సాయపడటం కోసం పిఎమ్ వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి పథకాన్ని (పిఎమ్ స్వనిధి స్కీము) ఈ సంవత్సరం జూన్ 1 న ప్రారంభించడం జరిగింది. ఇంతవరకు, ఈ పథకం లో 24 లక్షల కు పైగా దరఖాస్తులు అందితే వాటిలో నుంచి 12 లక్షల దరఖాస్తులకు పైగా అనుమతించి, దాదాపు 5.35 లక్షల రుణాలను ఇవ్వడమైంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లో 6 లక్షల కు పైగా దరఖాస్తులు రాగా వాటిలో నుంచి 3.27 లక్షల దరఖాస్తులను అనుమతించి 1.87 లక్షల రుణాలను ఇవ్వడమైంది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గల పిఎమ్ స్వనిధి స్కీము లబ్ధిదారులు ఈ సంభాషణ కార్యక్రమాన్ని వీక్షించనున్నారు. ఈ కార్యక్రమం పై డిడి న్యూజ్ లో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది.