జన్ ఔషధి దివస్ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ , జన ఔషధి కేంద్ర యజమానులు, లబ్ధిదారులతో మార్చి నెల 7 వ తేదీ నాడు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా జన్ ఔషధి కేంద్ర యజమానుల తో, జన్ ఔషధి పథకం లబ్ధిదారుల తో ముచ్చటించనున్నారు. ఈ సమావేశం ముగిసిన తరువాత ప్రధాన మంత్రి ప్రసంగ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ‘‘జన్ ఔషధి-జన్ ఉపయోగి’’ ఇతివృత్తం గా ఉంది.
జెనెరిక్ మందుల ఉపయోగం గురించి, జన్ ఔషధి పథకం ప్రయోజనాల గురించి అవగాహన ను ఏర్పరచడం కోసం మార్చి నెల 1వ తేదీ నుంచి దేశం అంతటా ‘జన్ ఔషధి వారం’ ను పాటించడం జరుగుతోంది. ఈ వారం రోజుల లో జన్ ఔషధి సంకల్ప్ యాత్ర, మాతృ శక్తి సమ్మాన్, జన్ ఔషధి బాల మిత్ర్, జన్ ఔషధి జన్ జాగరణ్ అభియాన్, ఆవో జన్ ఔషధి మిత్ర్ బనేఁ మరియు జన్ ఔషధి జన్ ఆరోగ్య మేళా ల వంటి విభిన్న కార్యక్రమాల ను ఏర్పాటు చేయడమైంది.
ఔషధాల ను చౌక గా మరియు పౌరుల కు సులభం గా అందుబాటు లోకి తీసుకు రావాలన్న ప్రధాన మంత్రి దృష్టి కోణాని కి అనుగుణం గా, ప్రస్తుతం దేశ వ్యాప్తం గా 8,600 కు పైగా జన్ ఔషధి స్టోర్ లు నెలకొన్నాయి. ఈ జన్ దాదాపు గా ప్రతి జిల్లా లో సేవల ను అందిస్తున్నాయి.