ఏశియాన్ పారా గేమ్స్ లో పాల్గొన్న భారతదేశాని కి చెందిన క్రీడాకారుల మరియు క్రీడాకారిణుల దళం తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 నవంబర్ 1 వ తేదీ నాడు సాయంత్రం పూట దాదాపు గా 4 గంటల 30 నిమిషాల కు న్యూ ఢిల్లీ లోని మేజర్ ధ్యాన్ చంద్ నేశనల్ స్టేడియమ్ లో సమావేశమై, వారి ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో అసాధారణమైన కార్యసాధన కు గాను క్రీడాకారుల ను, క్రీడాకారిణుల ను అభినందించడం తో పాటు భావి పోటీల కు వారి లో ఉత్సాహాన్ని నింపాలన్న ప్రధాన మంత్రి ప్రయాస లో భాగం గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది. ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో భారతదేశం 29 బంగారు పతకాల తో సహా మొత్తం 111 పతకాల ను గెలుచుకొంది. అంతకు మునుపు (2018వ సంవత్సరం లో) భారతదేశం యొక్క ఉత్తమ ప్రదర్శన తో పోలిస్తే ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో మొత్తం పతకాల సంఖ్య లో 54 శాతం వృద్ధి గా ఉంది; అంతేకాకుండా, తాజా గా సాధించిన 29 పసిడి పతకాలు ఇదివరకు 2018 వ సంవత్సరం లో గెలిచిన పతకాల కంటే దాదాపు రెట్టింపు గా ఉన్నాయి.
ఈ కార్యక్రమం లో క్రీడాకారిణులు, క్రీడాకారులు, వారి యొక్క కోచ్ లు, పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా మరియు భారతీయ ఒలింపిక్ సంఘాల కు చెందిన అధికారులు, జాతీయ క్రీడా సమాఖ్య ల ప్రతినిధుల తో పాటు యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ కు చెందిన అధికారులు కూడా పాలుపంచుకోనున్నారు.