ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ 2021 ని ఈ నెల 10న సాయంత్రం 6:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. ‘మన భవిష్యత్తు ను పునర్ నిర్వచించుకోవడం: అందరికీ సురక్షితమైన, భద్రమైన పర్యావరణం’ అనే అంశం ఈ శిఖర సమ్మేళనానికి ఇతివృత్తం గా ఉండనుంది. గుయానా సహకార గణతంత్రం అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ఇర్ఫాన్; పాపువా న్యూ గునియా ప్రధాని జేమ్స్ మరాపే; మల్దీవ్స్ గణతంత్రం పీపుల్స్ మజ్లిస్ స్పీకర్ మొహమ్మద్ నషీద్, ఐక్య రాజ్య సమితి లో డిప్యూటీ సెక్రటరీ జనరల్ అమీనా జె మొహమ్మద్ లతో పాటు, పర్యావరణం, అడవులు, జలవాయు పరివర్తన శాఖ కేంద్ర మంత్రి శ్రీ ప్రకాశ్ జావడేకర్ లు ఈ కార్యక్రమం లో పాలుపంచుకొంటారు.
శిఖర సమ్మేళనాన్ని గురించిన వివరాలు
ది ఎనర్జీ ఎండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్స్ (టిఇఆర్ఐ) ప్రధాన కార్యక్రమం లో భాగం అయిన వరల్డ్ సస్టెనబుల్ సమిట్ తాలూకు 20వ సంచిక ను ఈ నెల 10వ తేదీ నాటి నుంచి 12వ తేదీ వరకు ఆన్ లైన్ లో నిర్వహించనున్నారు. ఈ శిఖర సమ్మేళనం పెద్ద సంఖ్య లో ప్రభుత్వాలు, వ్యాపార ప్రముఖులు, విద్యావేత్తలు, జలవాయు శాస్త్రవేత్తలు, యువజనులు, జలవాయు పరివర్తన కు వ్యతిరేకంగా పోరు సలుపుతున్న పౌర సమాజాన్ని ఒక చోటుకు తీసుకురానుంది. భారతదేశాని కి చెందిన పర్యావరణం, అడవులు, జలవాయు పరివర్తన మంత్రిత్వ శాఖ; నూతన, నవీకరణ యోగ్య శక్తి మంత్రిత్వ శాఖ; పృధ్వీ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖలు ఈ శిఖర సమ్మేళనాని కి కీలక భాగస్వాములుగా ఉంటాయి. ఈ శిఖర సమ్మేళనం లో శక్తి, పరిశ్రమ పరివర్తన, ప్రకృతి ఆధారితమైన పరిష్కార మార్గాలు, క్లయిమేట్ ఫైనాన్స్, చక్రీయ ఆర్థిక వ్యవస్థ, శుద్ధ మహాసాగరాలు, వాయుకాలుష్యం తదితర అంశాలు చర్చకు రానున్నాయి.