Quote‌–రూ 5800 కోట్ల రూపాయల విలువగల పలు శాస్త్ర విజ్ఞాన ప్రాజెక్టులకు శంకు స్థాపన చేసి జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి.
Quote– లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ–ఇండియా ( లిగో –ఇండియా )కు శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి.
Quote– ఇది ప్రపంచంలోని అతికొద్ది లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్వేవ్ అబ్జర్వేటరీలలో ఒకటి కానుంది.
Quote– విశాఖపట్నంలోని రేర్ ఎర్త్ పర్మినెంట్ మాగ్నెట్ ప్లాంట్ను జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి. దీనితో ఇండియా రేర్ ఎర్త్ పర్మినెంట్ మాగ్నెట్లు ఉత్పత్తి చేసే దేశాల సరసన భారతదేశం చేరనున్నది.
Quote–‘ నేషనల్ హార్డన్ బీమ్ థెరపీ సదుపాయాన్ని జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి. ఈ సదుపాయం, కాన్సర్ చికిత్సలో, అధునాతన మెడికల్ ఇమేజింగ్ సాంకేతికతలో దేశ సామర్ధ్యాన్ని మరింత పెంచుతుంది. – పలు కాన్సర్ ఆస్పత్రులు, సదుపాయాలకు శంకు స్థాపనచేసి జాతికి అంకితం చేయనున్నారు. దీనితో దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో కాన్సర్ చికిత్స అందుబాటుపెరగడంతో పాటు , వికేంద్రీకృత కాన్సర్ సదుపాయాలు, ఆస్పత్రులు ఏర్పడనున్నాయి.

 ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  2023 మే 11 వ తేదీ ఉదయం 10.30 గంటలకు న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో నేషనల్ టెక్నాలజీ దినోత్సవం 2023 ను పురస్కరించుకుని ఒక  కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. నేషనల్ టెక్నాలజీ దినోత్సవం 25 వ సంవత్సరం సందర్భంగా మే 11 నుంచి 14 వరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల ప్రారంభ సూచికగా కూడా ఇది ఉంటుంది.
కీలక సైంటిఫిక్ ప్రాజెక్టులు: జాతీయ టెక్నాలజీ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి  దేశంలో పలు  శాస్త్ర , సాంకేతిక పురోగతికి సంబంధించచిన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి వాటిని జాతికి అంకితం చేయనున్నారు. వీటి విలువ సుమారు 5800 కోట్ల రూపాయల వరకు ఉండనుంది. ప్రధానమంత్రి దార్శనికత అయిన ఆత్మనిర్భర్ భారత్కు అనుగుణంగా వీటిని చేపట్టడం జరుగుతోంది. దేశంలోని శాస్త్రవిజ్ఞాన సంస్థలను బలోపేతం చేసేందుకు దీనిని ఉద్దేశించారు. ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్న ప్రాజెక్టులలో లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ–ఇండియా, (లిగో–ఇండియా), హింగోలి, హోమి బాబా కాన్సర్ హాస్పిటల్ , రీసెర్చ్ సెంటర్, జాట్ని, ఒడిషా, టాటామెమోరియల్ హాస్పిటల్ , ముంబాయి ప్లాటినం జూబ్లీ బ్లాక్ ఉన్నాయి. లిగో –ఇండియాను మహారాష్ట్రలోని హింగోలిలో అభివృద్ధి చేయనున్నారు. ఇది ప్రపంచంలో గల అతి కొద్ది లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీలలో ఒకటి.ఇది అత్యంత సున్నిత ఇంటర్ఫెరోమీటర్. బ్లాక్ హోల్స్,న్యూట్రాన్ స్టార్స్ వంటి పెద్ద ఖగోళ భౌతిక వస్తువుల
అనుసంధాన సమయంలో 4 కిలోమీటర్ల పొడవుతో వెలువడే తరంగాలను గుర్తించగల అత్యంత సున్నిత ఇంటర్ఫెరోమీటర్. లిగో–ఇండియా అమెరికాలో పనిచేస్తున్న ఇటువంటి రెండు అబ్జర్వేటరీలతో కలిసి పనిచేస్తుంది. అందులో ఒకటి హాన్ ఫోర్డ్లో ఉండగా మరోకటి లూసియానాలోని లివింగ్స్టన్లో ఉంది.

ప్రధానమంత్రి జాతికి అంకితం చేయనున్న ప్రాజెక్టులలో ఫిషన్ మాలిబ్డినం –99 ఉత్పత్తి ఫెసిలిటి, ముంబాయి, రేర్ ఎర్త్ పర్మినెంట్మాగ్నెట్ ప్లాంట్ ,విశాఖపట్నం, నేషనల్ హాడ్రాన్ బీమ్ థెరపీ ఫెసిలిటీ, నవీ ముంబాయి, రేడియోలాజికల్ రిసెర్చ్ యూనిట్, నవీ ముంబాయి, హోమి బాబా కాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నం, ఉమన్, చిల్ట్రన్ కాన్సర్ హాస్పిటల్ బిల్డింగ్ నవీ ముంబాయి ఉన్నాయి. రేర్ ఎర్త్ పర్మినెంట్ మాగ్నెట్స్ ప్రాథమికంగా విదేశాలలో తయారవుతున్నాయి. రేర్ ఎర్త్ పర్మినెంట్ మాగ్నెట్ల తయారీ
సదుపాయాన్ని విశాఖపట్నంలోని బాబా అటామిక్ రిసెర్చ్ సెంటరల్ లో  అభివృద్ధి  చేయడం జరిగింది. ఈ ఫెసిలిటీని దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో, దేశీయ వనరులనుంచి తీసిన రేర్ ఎర్త్ మెటీరియల్తో ఈ ఫెసిలిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫెసిలిటీతో ఇండియా రేర్ ఎర్త్ పర్మినెంట్ మాగ్నెట్లు ఉత్పత్తి చేసే దేశాల సరసన చేరుతుంది. టాటా మెమోరియల్ సెంటర్,నవీ ముంబాయి కి చెందిన   నేషనల్ హార్డన్ బీమ్ థెరపీ ఫెసిలిటీ అత్యధునాతన ఫెసిలిటీ. ఇది కచ్చితమైన రీతిలో ట్యూమర్ పై రేడియేషన్ను ప్రసరింపచేస్తూనే, పక్కన ఉన్న భాగాలకు మామూలు డోస్ను అందిచేలా చూస్తుంది. లక్షిత టిష్యూకు తగిన మోతాదులో రేడియేషన్  అందించడం వల్ల రేడియేషన్ చికిత్స తో తలెత్తే ఇతర ఇబ్బందులను ఇది తొలగిస్తుంది.
ఫిసన్ మాలిబ్డినమ్ –99 ప్రొడక్షన్ ఫెసిలిటీ బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ ట్రాంబే క్యాంపస్ లో ఏర్పాటైంది. మాలిబ్డినమ్ –99 అపూది టెక్నీటియమ్ –99 ఎం కు పేరెంట్. దీనిని కాన్సర్ను తొలిదశలోనే గుర్తించే 85 శాతం ఇమేజింగ్ ప్రాసెస్లలో వాడుతారు. అలాగే గుండెజబ్బుల గుర్తింపులో వాడుతారు. ఈ ఫెసిలిటీ ఏడాదికి 9 నుంచి 10 లక్షల మంది పేషెంట్ స్కాన్ లను చేయగలుగుతుంది. పలు కాన్సర్ ఆస్పత్రులు, ఫెసిలిటీలకు శంకు స్థాపన చేయడంతో కాన్సర్ చికిత్సా సదుపాయాల వికేంద్రీకరణతోపాటు
దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రపంచశ్రేణి కాన్సర్ చికిత్సా సదుపాయాలు ఏర్పడనున్నాయి. అటల్ ఇన్నొవేషన్ మిషన్, ఇతర కాంపొనెంట్లు:
నేషనల్ టెక్నాలజీ దినోత్సవం 2023 సందర్భంగా చేపట్టే ఉత్సవాలలో అటల్ ఇన్నొవేషన్ మిషన్ (ఎ.ఐ.ఎం) పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతోంది. ఈ ఏడాది నేషనల్ టెక్నాలజీ డే థీమ్ను ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఆత్మనిర్భర్ మిషన్ (ఎఐఎం) పెవిలియన్ పలు వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించనుంది. అలాగే సందర్శకులు ప్రత్యక్షంగా ఆలోచనాత్మక సెషన్లను చూసే వీలుంటుంది.అలాగే ఈ కార్యకలాపాలలో పాల్గొనడానికి, చూడడానికి , అద్భుత ఆవిష్కరణల గురించి తెలుసుకోవడానికి , స్టార్టప్లు రూపొందించిన ఆయా ఉత్పత్తులను  చూడడానికి వీలు కలుగుతుంది.
ఇందుకు సంబంధించి వివిధ జోన్లు ఏర్పాటు చేస్తారు. ఎఆర్, విఆర్, డిఫెన్స్టెక్, డిజియాత్ర, టెక్స్ టైల్, లైఫ్ సైన్సెస్ వంటివి ఇందులో కొన్ని. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి దేశంలో ఇటీవలి కాలంలో జరిగిన  శాస్ట్ర, సాంకేతిక ఆధునిక పురోగతిని చూపే ప్రదర్శనను కూడా ప్రారంభించనున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి ఒక ప్రత్యేక తపాళా బిళ్లను, నాణాన్ని విడుదల చేయనున్నారు.

 

  • Bhagat Ram Chauhan May 19, 2023

    हार्दिक बधाई एवं शुभकामनाएं
  • Upendra paswan May 15, 2023

    jay hind jay bharat Jay shree ram
  • Tribhuwan Kumar Tiwari May 13, 2023

    वंदेमातरम् सादर प्रणाम सर सादर त्रिभुवन कुमार तिवारी पूर्व सभासद लोहिया नगर वार्ड पूर्व उपाध्यक्ष भाजपा लखनऊ महानगर उप्र भारत
  • Upendra paswan May 12, 2023

    modi teri jay ho
  • Sunu Das May 12, 2023

    Modi ji mera bat to sunlo 2024 mein tumko harane ke liye jo,jo Desh ka gaddar😡Muslim😡 log hai ,ek Naya card khel raha hai,🤷dalit log ko hath mein lene ka tarika kar raha hai This time Hindustan mein dalit logon ka population bahut jyada hai🤔 ,2024 mein ek bhi dalit agar tumko vote na Dey yah koshish kar raha hai.😕 UN logon ka brainwash😡kar raha hai. Jaise kuchh din pahle Punjabi bhaiyon ko kiya tha Punjabi bhaiyon se Tum To bahut kuchh karke unka man Khush karke apna hath mein le Liya🫤. but dalit log ke liye tumko kuchh karna padega 🙄nahin to 2024 mein vote Milana mushkil hai. 🙄🙄🙄🙄🙄🙄 Link 👇👇👇👇👇 https://youtube.com/shorts/mrMbd6hvWy8?feature=share Baki =Jay shree Ram, 🚩🙏🙁
  • Ishvar Chaudhary May 11, 2023

    जय हा
  • Sagar bhatt May 10, 2023

    jay shree ram
  • Jaysree May 10, 2023

    jaisreeram
  • Arun Potdar May 10, 2023

    आत्मविकासि भारत
  • DIpak S Upadhye May 10, 2023

    जय श्री राम् Dipak Upadhye Mandal Sachiv Kasarvadvali Thane 9422809721
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Khadi products witnessed sale of Rs 12.02 cr at Maha Kumbh: KVIC chairman

Media Coverage

Khadi products witnessed sale of Rs 12.02 cr at Maha Kumbh: KVIC chairman
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 8 మార్చి 2025
March 08, 2025

Citizens Appreciate PM Efforts to Empower Women Through Opportunities