దేశవ్యాప్తం గా విద్యా సంస్థల కు 100 ‘5జి యూస్ కేస్ లేబ్స్’ ను ఇవ్వనున్న ప్రధాన మంత్రి
సామాజిక, ఆర్థిక రంగాల లో నూతన ఆవిష్కరణల ను ప్రోత్సహించడం కోసం 5జి అప్లికేశన్స్ ను అభివృద్ధి చేయడం ‘100 5జి లేబ్స్ ఇనిశియేటివ్’ యొక్క లక్ష్యం; దేశం లో 6జి-కి సన్నద్ధంగా ఉండే ఇకోసిస్టమ్ ను నిర్మించే దిశ లో ఇది ఒక కీలకమైన ముందంజ అని కూడా చెప్పాలి
కీలకమైనటువంటి అత్యాధునిక సాంకేతికత ల అభివృద్ధిదారు గాను, తయారీదారు గాను మరియు ఎగుమతిదారు గాను భారతదేశం యొక్కస్థానాన్ని బలపరచాలన్నదే ఐఎమ్ సి 2023 యొక్క లక్ష్యం

ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (ఐఎమ్ సి) 2023 యొక్క ఏడో సంచిక ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ ప్రగతి మైదాన్ లో గల భారత్ మండపం లో 2023 అక్టోబరు 27 వ తేదీ నాడు ఉదయం పూట 9 గంటల 45 నిమిషాల కు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం లో భాగం గా, ప్రధాన మంత్రి దేశవ్యాప్తం గా ఉన్నటువంటి విద్య సంస్థల కు 100 ‘5జి యూస్ కేస్ లేబ్స్’ ను ఇవ్వనున్నారు. ఈ ప్రయోగశాలల ను 100 ‘5జి లేబ్స్ ఇనిశియేటివ్’ లో భాగం గా అభివృద్ధి పరచడం జరుగుతోంది.

‘100 5జి లాబ్స్ ఇనిశియేటివ్’ అనేది 5జి అప్లికేశన్ లను అభివృద్ధి పరచడాన్ని ప్రోత్సహించడం ద్వారా 5జి సాంకేతికత తో ముడిపడినటువంటి భారతదేశం తాలూకు విశిష్ట అవసరాల తో పాటుగా ప్రపంచం అవసరాల ను కూడాను తీర్చే అవకాశాల్ని చేజిక్కించుకోవడానికి ఉద్దేశించిన ఒక ప్రయాస అని చెప్పాలి. ఈ అద్వితీయమైనటువంటి కార్యక్రమం విద్య, వ్యవసాయం, ఆరోగ్యం, విద్యుత్తు, రవాణా ల వంటి వివిధ సామాజిక, ఆర్థిక రంగాల లో నూతన ఆవిష్కరణల కు దన్ను గా నిలవడంతో పాటు దేశాన్ని 5జి సాంకేతిక విజ్ఞానం సంబంధి ఉపయోగం లో ముందుకు తీసుకు పోతుంది. ఈ కార్యక్రమం దేశం లో 6జి కి సన్నద్ధం అయిన విద్య బోధన మరియు స్టార్ట్-అప్ ఇకోసిస్టమ్ ల నిర్మాణం లో ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం గా ఉంది. మరీ ముఖ్యం గా, ఈ కార్యక్రమం దేశ భద్రత లో కీలకం అయినటువంటి స్వదేశీ టెలికమ్ సంబంధి సాంకేతిక విజ్ఞానం యొక్క వికాసం దిశ లో ఒక ముందంజ గా ఉంది.

ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎమ్ సి) ఆసియా లో అతి పెద్దదైనటువంటి టెలికమ్యూనికేశన్స్, ప్రసార మాధ్యాలు మరియు సాంకేతిక విజ్ఞానానికి సంబంధించిన వేదిక; ఐఎమ్ సి సమావేశాల ను 2023 అక్టోబరు 27 వ తేదీ మొదలుకొని 29 వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నిర్వహణ ద్వారా టెలికమ్యూనికేశన్స్ లో, సాంకేతిక విజ్ఞానం లో భారతదేశం సాధించిన అసామాన్యమైనటువంటి పురోగతి ని కళ్ళ కు కట్టేందేరే, కొన్ని ముఖ్య ప్రకటనల కు మరియు గే స్టార్ట్-అప్స్ కు వాటి నూతన ఆవిష్కరణ సంబంధి ఉత్పాదనల ను మరియు పరిష్కారాల ను ప్రదర్శించేందేరే అవకాశాలు అంది రానున్నాయి.

‘గ్లోబల్ డిజిటల్ ఇనొవేశన్’ ప్రధాన ఇతివృత్తం గా ఉండే ఐఎమ్ సి 2023, భారతదేశాన్ని అత్యాధునిక సాంకేతికత ల అభివృద్ధి దారు దేశం గానను, తయారీదారు దేశం గాను మరియు కీలకమైన ఎగుమతిదారు దేశం గాను చాటి చెప్పాలి అనే లక్ష్యాన్ని కూడా కలిగివుంది. మూడు రోజుల పాటు సాగే ఐఎమ్ సి సమావేశాల లో 5జి, 6జి, కృత్రిమ మేధ ( ఆర్టిఫిశియల్ ఇంటెలిజెన్స్.. ఎఐ) ల వంటి సాంకేతికతల ను వెలుగు లోకి తీసుకు రావడం తో పాటుగా సెమికండక్టర్ పరిశ్రమ, గ్రీన్ టెక్నాలజీ, సైబర్ భద్రత వగైరా అంశాల తో ముడిపడ్డ అంశాల ను క్షుణ్నం గా చర్చించడం జరుగుతుంది.

ఈ సంవత్సరం, ఐఎమ్ సి - ‘అస్పైర్’ పేరు తో ఒక స్టార్ట్-అప్ కార్యక్రమాన్ని మొదలుపెడుతోంది. ఈ కార్యక్రమం తాజా నవ పారిశ్రామికత్వ ప్రధానమైన కార్యక్రమాల ను మరియు సహకారాల ను ప్రోత్సహించడం తో పాటుగా స్టార్ట్-అప్స్, ఇన్ వెస్టర్ లు మరియు ప్రతిష్ఠిత వ్యాపారాల మధ్య పరస్పర సంబంధాల ను ప్రోత్సహించనుంది.

ఐఎమ్ సి 2023 లో దాదాపు గా 22 దేశాల కు చెందిన ఒక లక్ష మంది కి పైగా పాలుపంచుకోనున్నారు. వారి లో సుమారు 5000 మంది సిఇఒ స్థాయి ప్రతినిధులు, 230 మంది ఎగ్జిబిటర్ లు, 400 స్టార్ట్-అప్స్ మరియు ఇతర స్టేక్ హోల్డర్స్ కూడా ఉంటారు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
10 big-bang policy moves Modi government made in 2024

Media Coverage

10 big-bang policy moves Modi government made in 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 27 డిసెంబర్ 2024
December 27, 2024

Citizens appreciate PM Modi's Vision: Crafting a Global Powerhouse Through Strategic Governance