బస్తీ జిల్లా లో ఏర్పాటు చేసిన సాంసద్ ఖేల్ మహాకుంభ్ 2022-23 యొక్క రెండో దశ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జనవరి 18 వ తేదీ నాడు మధ్యాహ్నం పూట ఒంటి గంట వేళ లో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యం ద్వారా ప్రారంభించనున్నారు. బస్తీ లోక్ సభ నియోజకవర్గం ఎంపి శ్రీ హరీశ్ ద్వివేదీ బస్తీ జిల్లా లో సాంసద్ ఖేల్ మహాకుంభ్ ను 2021వ సంవత్సరం నుండి నిర్వహిస్తూ వస్తున్నారు.
సాంసద్ ఖేల్ మహాకుంభ్ 2022-23 ను రెండు దశల లో నిర్వహించడం జరుగుతున్నది. ఒకటో దశ ను 2022 డిసెంబర్ 10 వ తేదీ మొదలుకొని 16 వ తేదీ వరకు నిర్వహించడమైంది. రెండో దశ ను 2023 జనవరి 18 వ తేదీ నుండి 28 వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది.
కుస్తీ, కబడ్డీ, ఖో ఖో, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, హాకీ, వాలీబాల్, హ్యాండ్ బాల్, చదరంగం, కేరమ్స్, బాడ్ మింటన్, టెబుల్ టెనిస్ మొదలైన ఇండోర్ మరియు అవుట్ డోర్ స్పోర్ట్ స్ లో వివిధ పోటీలు ఖేల్ మహాకుంభ్ లో భాగం గా ఉంటాయి. ఇవి కాక విడి గా, వ్యాస రచన, చిత్రలేఖనం, రంగవల్లుల ను తీర్చిదిద్దడం వంటి వాటి లో పోటీల ను కూడా ఖేల్ మహాకుంభ్ లో భాగం గా ఏర్పాటు చేయడం జరుగుతుంది.
ఖేల్ మహాకుంభ్ అనేది బస్తీ జిల్లా తో పాటు ఇరుగు పొరుగు ప్రాంతాల యువతీ యువకుల కు క్రీడల లో వారి యొక్క ప్రతిభ ను చాటుకోవడాని కి ఒక అవకాశాన్ని మరియు ఒక వేదిక ను అందించేటటువంటి ఒక నూతన కార్యక్రమం మాత్రమే కాకుండా క్రీడల ను వృత్తి ప్రధానమైన ఐచ్ఛికం గా కూడా ఎంచుకోవడం లో వారి కి ప్రేరణ ను ఇస్తున్నది. ఈ కార్యక్రమం ఆ ప్రాంత యువత లో క్రమశిక్షణ, ఒక జట్టు వలె కలసికట్టు గా శ్రమించడం, ఆరోగ్యకరమైన స్పర్థ, ఆత్మ విశ్వాసం, ఇంకా జాతీయత భావన లను అలవరచడానికి చేపడుతున్న ఒక ప్రయాస గా కూడా ఉంది.