ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మార్చి, 2వ తేదీన "మారిటైమ్ ఇండియా సదస్సు-2021" ని దృశ్యమాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు.
"మారిటైమ్ ఇండియా సబస్సు-2021" గురించి :
కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ, ఈ "మారిటైమ్ ఇండియా సదస్సు-2021" ని www.maritimeindiasummit.in అనే వర్చువల్ వేదికపై 2021 మార్చి, 2వ తేదీ నుండి మార్చి, 4వ తేదీ వరకు నిర్వహించనుంది.
వచ్చే దశాబ్దానికి భారతదేశ నావికా రంగానికి సంబంధించి, ఒక ప్రణాళిక రూపకల్పన కు ఈ సదస్సు దోహదపడనుంది. అంతర్జాతీయ నావికా రంగంలో, భారతదేశాన్ని ముందంజలో ఉంచడానికి, ఈ సదస్సు, కృషి చేస్తుంది. అనేక దేశాల నుండి ప్రముఖ వక్తలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సుకు, డెన్మార్క్, భాగస్వామ్య దేశంగా వ్యవహరిస్తోంది.