ఇదివరకటి రాజ్ పథ్ ఒక అధికార చిహ్నం గా ఉండగా కర్తవ్యపథ్ సార్వజనిక యాజమాన్యానికి మరియు సశక్తీకరణ కు ఒక నిదర్శనం గా ఉంటుంది; అంటే ఇదిఒక మార్పు నకు సంకేతం గా నిలుస్తుందన్నమాట
ప్రధాన మంత్రి సూచించిన ‘పాంచ్ ప్రణ్’ లలో ఒకటైన ‘వలసవాద మనస్తత్వం తో కూడిన ఎటువంటి జాడను అయినా తొలగించాలి’ కి అనుగుణం గా ఇది ఉంది
‘కర్తవ్య పథ్’ పచ్చిక బయళ్ళు, నడక దారులు, ఆకుపచ్చదనం నిండిన ప్రదేశాలు, మరమ్మతు చేసిన కాలవలు, మెరుగు పరచిన చిహ్నాలు, సరికొత్త సౌకర్యాలతో కూడిన భవనాలను, ఇంకా వెండింగ్ కియోస్క్ ల వంటి శ్రేష్ఠసార్వజనిక ప్రదేశాలు మరియు సదుపాయాలను కళ్లకు కట్టనుంది
పాదచారుల కోసం నూతనం గా నిర్మించిన అండర్ పాస్ లు, వాహనాల ను నిలిపి ఉంచడానికి ఇదివరకటికంటే మెరుగైనటువంటి జాగా లు, సరికొత్త ప్రదర్శన ఏర్పాటు లు, ఉన్నతీకరించినటువంటి రాత్రిళ్లు వెలిగేదీపాల వ్యవస్థ ప్రజల కు కలిగే అనుభూతి ని అధికం చేయనున్నాయి
ఘన వ్యర్థాల నిర్వహణ, ఒకసారి ఉపయోగించిన జలాల ను ప్రక్షాళన చేయడం, వాననీటి ఇంకుడు గుంతలు, అలాగే శక్తి ని ఆదా చేసే దీపమాలవ్యవస్థ లు మొదలైన అనేక సుస్థిరమైన వ్యవస్థ లు కూడా జతపడ్డాయి

‘కర్తవ్య పథ్’ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీ నాటి రాత్రి 7 గంటల వేళ లో ప్రారంభించనున్నారు. మునుపటి రాజ్ పథ్ అధికార చిహ్నం గా ఉండగా ‘కర్తవ్య పథ్’ దానికి భిన్నం గా సార్వజనిక యాజమాన్యాని కి మరియు సశక్తీకరణ కు ఒక నిదర్శన గా ఉంటూ మార్పు నకు ప్రతీక కానుంది. ప్రధాన మంత్రి ఇదే సందర్భం లో ఇండియా గేట్ ప్రాంతం లో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ యొక్క విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. ఈ చర్య లు అమృత కాలం లో న్యూ ఇండియా కోసం ప్రధాన మంత్రి ఉద్భోదించిన ‘పాంచ్ ప్రణ్’ (అయిదు ప్రతిజ్ఞ‌ ల) లోని రెండో ప్రణ్ అయినటువంటి ‘వలసవాద మనస్తత్వం తాలూకు ఏ విధమైన జాడ ను అయినా సరే, తొలగించాలి’ అనే ప్రతిన కు అనుగుణం గా ఉన్నాయి.

గత కొన్ని సంవత్సరాలు గా సందర్శకుల సంఖ్య పెరిగిపోయినందువల్ల రాజ్ పథ్ మరియు సెంట్రల్ విస్టా ఏవిన్యూ పరిసర ప్రాంతాల లో ఒత్తిడి తలెత్తి దాని తాలూకు ప్రభావం అక్కడి మౌలిక సదుపాయల పై పడుతున్నది. ఆ ప్రాంతాల లో సార్వజనిక స్నానాల గదులు, తాగునీరు, వీధి సరంజామా, వాహనాల ను నిలిపి ఉంచడం కోసం తగినంత జాగా లేకపోవడం వంటి కనీస సౌకర్యాలు కొరవడ్డాయి. అంతేకాదు, నిర్ధిష్టమైన చిహ్నాలు లోపించడం, చాలినంత జలం అందుబాటు లో లేకుండా పోవడం, అస్తవ్యస్తమైన పార్కింగ్ ల వంటివి సైతం సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. దీనికి తోడు, గణతంత్ర దిన కవాతు ను మరియు ఇతర జాతీయ కార్యక్రమాల ను ప్రజల రాక పోకల కు సాధ్యమైనంత తక్కువ ఆంక్షల తో నిర్వహించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయం వ్యక్తం అయింది. ఈ అంశాల ను దృష్టి లో పెట్టుకొని పునరభివృద్ధి కార్యక్రమాల ను చేపట్టడమైంది. అదే కాలం లో భవన నిర్మాణ పరమైన సమగ్రత ను విచ్ఛిన్నం చేయకుండా తగిన జాగ్రతల ను కూడా తీసుకోవడమైంది.

సుందరీకరణ కు తావు ఇచ్చిన ప్రకృతి చిత్రాలు, నడక దారుల తో దిద్దితీర్చిన పచ్చిక బయళ్ళు, సరికొత్త గా జతపరచిన హరిత ప్రదేశాలు, మరమ్మతులు చేసిన కాలవ లు, సరికొత్త సదుపాయాల తో నిర్మించిన భవనాలు, మెరుగు పరచినటువంటి సైన్ బోర్డు లు మరియు వెండింగ్ కియోస్క్ లు ‘కర్తవ్య పథ్’ లో కొలువుదీరనున్నాయి. వీటికి అదనం గా పాదచారుల కోసం కొత్త గా నిర్మించిన అండర్ పాస్ లు, మెరుగుపరచిన వాహనాల నిలుపుదల జాగా లు, నూతన ఎగ్జిబిశన్ ప్యానల్స్, ఇంకా అప్ గ్రేడెడ్ నైట్ లైటింగ్ ల వంటివి ఈ ప్రాంతాల ను చూడటానికి వచ్చే ప్రజల కు శ్రేష్ఠమైన అనుభూతి ని కలుగజేయనున్నాయి. ఘన వ్యర్థాల నిర్వహణ, వరద జలాల నిర్వహణ, ఒకసారి ఉపయోగించిన జలాల ప్రక్షాళనం, వర్షపు జలం ఇంకిపోయేందుకు తవ్విన గుంత లు, జల సంరక్షణ, శక్తి ని ఆదా చేయగల దీపాల వ్యవస్థ లు కూడా దీని లో భాగాలు గా ఉన్నాయి.

ఇక ప్రధాన మంత్రి ఆవిష్కరించనున్న నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్రహాన్ని- ఈ ఏడాది ఆరంభం లో పరాక్రమ్ దివస్ (జనవరి 23) నాడు ఏ చోటు న అయితే నేతాజీ యొక్క హోలోగ్రామ్ స్టాచ్యూ ను ప్రధాన మంత్రి ఆవిష్కరించారో- అదే స్థలం లో నెలకొల్పడం జరిగింది. నల్లసేనపు రాయి (గ్రానైట్) తో తయారు చేసిన ఈ విగ్రహం దేశ స్వాతంత్య్ర పోరాటాని కి నేతాజీ అందించినటువంటి బ్రహ్మాండమైన తోడ్పుటు కు గాను ఒక సముచితమైన శ్రద్ధాంజలి గా ఉంది; ఈ విగ్రహం నేతాజీ కి దేశ ప్రజల రుణగ్రస్తత తాలూకు ప్రతీక గా నిలవబోతున్నది. శ్రీ అరుణ్ యోగిరాజ్ ప్రధాన శిల్పకారుని గా ఉండగా 28 అడుగుల ఎత్తయిన ఈ విగ్రహాన్ని ఏకశిలా గ్రానైట్ నుండి చెక్కడం జరిగింది; మరి ఈ విగ్రహం 65 మెట్రిక్ టన్నుల బరువు తో ఉంది.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
25% of India under forest & tree cover: Government report

Media Coverage

25% of India under forest & tree cover: Government report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi